సముద్రపు ఒడ్డున కసరత్తులు.. రెజీనా వర్కౌట్లు వైరల్
రెజీనా ఒకప్పుడు తెలుగులో ఫుల్ బిజీగా ఉండేది. తమిళ్ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్‌కు సుధీర్ బాబు ఎస్ఎమ్ఎస్ సినిమా ద్వారా పరిచయమైంది. ఆ సినిమా అంతగా ఆడకపోయినా కూడా రెజీనాకు మంచి అవకాశాలే వచ్చాయి. కాల్సినంత అందం, ప్రతిభ అన్నీ ఉండటంతో రెజీనాకు టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు వచ్చాయి. రొటీన్ లవ్ స్టోరీ, కొత్తజంట, రారా కృష్ణయ్య వంటి చిత్రాలతో ఓ మోస్తరుగా గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తరువాత పవర్, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాలతో స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. అలా వరుసగా ఆఫర్లు రావడం సినిమాలు హిట్ అవుతుండటంతో రెజినాకు తెలుగులో అభిమానులు బాగానే పెరిగారు. అయితే మధ్యలో రెజీనా నటించిన చిత్రాలేవీ ఆకట్టుకోలేదు. అలాగే మిగతా భాషల్లో ఆఫర్లు ఎక్కువగా వస్తుండటంతో అటు వైపే దృష్టి సారించింది. చివరగా ఎవరు చిత్రంతో రెజీనా అందర్నీ ఆశ్చర్యపరిచింది.

రెజీనా తెరపై ఎలా ఉన్నా కూడా సోషల్ మీడియాలో కాస్త హద్దుల్లోనే ఉంటుంది. అంత యాక్టివ్‌గా ఏమీ ఉండదు. కానీ ఈ మధ్య మాత్రం రెజీనా రచ్చ రచ్చ చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన వర్కవుట్ వీడియో చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. బీచ్‌లో భారీ భారీ కసరత్తులు చేస్తోంది. టైర్లు, తాళ్లు ఇలా ఏది పడితే దాంతో వర్కవుట్లు చేస్తోంది. కొండల నుంచి బీచ్... బీచ్ నుంచి రోడ్డు ఇలా ఎక్కడైనా సరే వర్కవుట్లు చేయాల్సిందేనని రెజీనా చెబుతోంది.


Click it and Unblock the Notifications











