కరోనా విషయంలో జగమొండిగా.. బీఎంసీ అధికారులకు షాకిచ్చిన రేఖ

ప్రస్తుత పరిస్థితుల్లో బాలీవుడ్‌ను కరోనావైరస్ భయభ్రాంతులకు గురిచేస్తున్నది. బచ్చన్, అనుపమ్ ఖేర్ ఫ్యామిలీలతోపాటు పలువురు కోవిడ్19 బారిన పడ్డారు. ఇదే క్రమంలో అలనాటి స్టార్ హీరోయిన్ రేఖ ఇంట్లో కూడా కరోనావైరస్ తిష్టవేయడం షాక్ ఇచ్చింది. ఆమె బాడీగార్డులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో అందరూ షాక్ తిన్నారు. ఈ క్రమంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) జారీ చేసిన ఆదేశాలను రేఖ తిరస్కరించం చర్చనీయాంశమైంది. అసలు రేఖ ఎందుకు నిరాకరించారంటే..

 బాలీవుడ్ వర్గాల్లో కలవరం

బాలీవుడ్ వర్గాల్లో కలవరం

గత శుక్రవారం రేఖ బాడీగార్డులకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలడం బాలీవుడ్ వర్గాల్లో కలవరం మొదలైంది. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే అమితాబ్ ఫ్యామిలీలో నలుగురికి కరోనావైరస్ సోకిందనే వార్తలతో బీఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే రేఖ ఇంటిని సీజ్ చేసి కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఆ క్రమంలో రేఖను కూడా కరోనా నిర్ధారణ టెస్టులు చేయించుకోవాలని సూచించారు.

 బీఎంసీ అధికారుల రిక్వెస్ట్‌ను

బీఎంసీ అధికారుల రిక్వెస్ట్‌ను

అయితే బీఎంసీ అధికారులు రిక్వెస్ట్‌ను రేఖ ఎలాంటి మొహమాటం లేకుండా తోసిపుచ్చారనేది బాలీవుడ్ మీడియా సమాచారం. తనకు కరోనా లక్షణాలు లేవు. తాను కోవిడ్ 19 లక్షణాలు ఉన్న వ్యక్తులను కలువలేదు. వారి దరిదాపుల్లోకి వెళ్లలేదు. అందుచేత తనక కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం లేదు అని రేఖ స్పష్టం చేశారు.

నేను సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నా

నేను సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నా

బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. ప్రస్తుతం బాంద్రాలోని సీ స్ప్రింగ్స్ నివాసంలోనే క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలియజేశారు. తనకు ఎలాంటి ఆరోగ్య పరీక్షలు అవసరం లేదని రేఖ స్పష్టం చేసింది అని పలు కథనాలు పేర్కొన్నాయి.

Recommended Video

Bollywood Actress Rekha Excellent Speech @ ANR National Awards Function
మీడియాకు దూరంగా ఉంటున్న రేఖ

మీడియాకు దూరంగా ఉంటున్న రేఖ

తన బాడీగార్డులకు కరోనావైరస్ సోకిన తర్వాత ఆమె నివాసంలో బీఎంసీ అధికారులు చేసిన హంగామా నేపథ్యంలో రేఖ ఎలాంటి స్పందనను వ్యక్తం చేయలేదు. అలాగే మీడియాతో మాట్లాడటానికి కూడా నిరాకరించారని తెలిసింది. ప్రస్తుతం తనకు ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకొంటూ ఇంట్లోనే ఉంటున్నట్టు మీడియా వర్గాలు తెలిపాయి. అయితే కొద్దికాలంగా ఆమె బాలీవుడ్‌కు దూరంగా ఉంటున్నారు. 2018లో ఆమె యమ్లా పగ్లా దీవానా అనే చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X