నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే డీఎం చేయండి.. టాలీవుడ్ హీరోయిన్ బంపర్ ఆఫర్!

ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ హీరోయిన్ రేఖ వేదవ్యాస్ 'ఆనందం' సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 'ఒకటో నెంబర్ కుర్రాడు', 'దొంగోడు', 'జానకి వెడ్స్ శ్రీరాం', 'ప్రేమించుకుందాం' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. అయితే ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో కన్నడ చిత్రసీమ వైపు అడుగులు వేసిన రేఖ, కొంతకాలం అక్కడ సినిమాలు చేసిన తర్వాత సినీ పరిశ్రమకు దూరమయ్యారు. చాలా కాలం తర్వాత తాజాగా యాంకర్ వర్ష హోస్ట్‌గా నిర్వహిస్తున్న 'కిసిక్ టాక్స్' కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రేఖ వేదవ్యాస్, తన వ్యక్తిగత జీవితం, ప్రేమ, పెళ్లి, కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సినిమాలకు దూరమవ్వడం నా నిర్ణయం కాదు..
సినిమాలకు ఎందుకు దూరమయ్యారని అడిగిన ప్రశ్నకు రేఖ భావోద్వేగంగా స్పందించారు. "నేను కావాలని ఇండస్ట్రీని వదిలేయలేదు. అంతా విధి రాత. మనం ఒకటి ప్లాన్ చేస్తాం.. దేవుడు ఇంకోటి ప్లాన్ చేస్తాడు. ఏ నటికైనా ప్రతిరోజూ షూటింగ్‌కు వెళ్లాలని, సినిమాల్లో నటించాలనే కోరిక ఉంటుంది. నాకూ అదే ఉంది. మళ్లీ నటించాలని చాలా బలంగా కోరుకుంటున్నాను. అందుకు ఇండస్ట్రీ సపోర్ట్, ప్రేక్షకుల ప్రేమ రెండూ కావాలి" అని చెప్పారు.

Rekha Vedavyas Marriage DM Me If You Want to Marry Me Anandam Actress Goes Viral

సల్మాన్ ఖాన్ తర్వాత నేనే బ్యాచిలర్!
పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అనే ప్రశ్నకు రేఖ ఇంట్రెస్టింగ్ సమాధానమిచ్చింది. "ఇండియాలో సల్మాన్ ఖాన్ తర్వాత పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయేది నేనే అనుకుంటా" అంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది. వెంటనే "అసలు ఎందుకు పెళ్లి కాలేదు?" అని అడగగా.. "సరైన వ్యక్తి ఇంకా దొరకలేదు. చాలామంది నాకు ఇప్పటికే పెళ్లయిపోయిందని లేదా ఎవరో ఉన్నారని అనుకుంటారు. కానీ నిజంగా నేను ఇప్పటికీ సింగిలే" అని స్పష్టం చేశారు. తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలనే ప్రశ్నకు రేఖ "ఈ ప్రపంచంలో ఎవరూ పర్‌ఫెక్ట్ కాదు. నేనూ కాదు. మంచి మనసు ఉండాలి. నిజంగా ప్రేమించాలి. అంతకంటే నాకు ఇంకేమీ అవసరం లేదు. హైట్, కలర్, లుక్స్ ఇవేవీ నాకు ముఖ్యం కాదు. మంచి మనిషి అయితే చాలు" అని తెలిపారు.

'నన్ను ప్రేమిస్తే డైరెక్ట్‌గా డీఎం చేయండి'
ఈ సందర్భంగా యాంకర్ వర్ష ఫన్నీగా "మీరు సింగిల్ అని చెప్పారు కదా.. ఇప్పుడు చాలా మంది మీకు మెసేజ్‌లు చేస్తారు" అని చెప్పగా, వెంటనే రేఖ "మీలో ఎవరైనా నిజంగానే నన్ను ప్రేమిస్తే.. డైరెక్ట్‌గా డీఎం చేయండి. నాకు నచ్చిన మెసేజ్‌లకు తప్పకుండా రిప్లై ఇస్తాను" అంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రేమ గురించి మాట్లాడుతూ రేఖ ఆసక్తికరమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "ప్రేమ అంటే కేవలం ఆకర్షణ కాదు. ప్రేమ అంటే ఓపిక. టీనేజ్ లవ్ వేరు, క్రష్ వేరు, ఇన్‌ఫ్యాచ్యుయేషన్ వేరు, అబ్సెషన్ వేరు. వాటి మధ్య తేడా గుర్తించాలి. నిజమైన ప్రేమ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం, గౌరవించడం. అలాంటి ప్రేమే నాకు కావాలి" అని చెప్పారు.

మోసం చేసే వాళ్లు తప్పించుకోలేరు
ప్రేమలో మోసం చేసే వారి గురించి అడగగా రేఖ మాట్లాడుతూ.. "మనల్ని ఒకరు మోసం చేస్తే.. వారిని ఇంకొకరు మోసం చేస్తారు. మనం మనుషుల నుంచి తప్పించుకోవచ్చు కానీ దేవుడి నుంచి తప్పించుకోలేరు. ప్రతి పనికి ఒక లెక్క ఉంటుంది. ఒకరోజు వడ్డీతో సహా చెల్లించుకోవాల్సిందే" అని వ్యాఖ్యానించారు. "మీరు ఎప్పుడైనా ఎవరికైనా ప్రపోజ్ చేశారా?" అని అడగగా రేఖ కాసేపు మౌనంగా ఉండి తన మనసులోని మాట బయటపెట్టారు.

"ఒక వ్యక్తిని నేను చాలా ఇష్టపడ్డాను. కానీ ఆ సమయంలో నా మనసులోని ప్రేమను చెప్పడానికి ధైర్యం చేయలేకపోయాను. చెబితే దూరమైపోతాడేమో అనిపించింది. ఇప్పుడు మాత్రం ఆ విషయాన్ని చాలా మిస్ అవుతున్నాను" అని చెప్పారు. అంతేకాకుండా కెమెరా వైపు చూస్తూ.. "హాయ్ చిన్న... నువ్వంటే నాకు చాలా ఇష్టం... మిస్ యూ" అంటూ ఎమోషనల్‌గా తన మనసులోని మాట చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X