ఆయన వల్లే బతికున్నా... నాతో పెళ్లికి నో... రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ ఎమోషనల్
హీరోలతో పోలిస్తే హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువ. ఈ సమయంలోనే వాళ్లు జీవితానికి సరిపడా ఫేమ్, నేమ్, డబ్బు సంపాదించుకోవాలి. కానీ ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఒకటి ఆరా సినిమాలకే ఫేడవుల్ అయిపోయిన వారు ఉన్నారు... ఓ వెలుగు వెళ్లి ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయిన వారు ఉన్నారు. అవకాశాలు రాకపోవడం ఒకటైతే... వ్యక్తిగత కారణాలు, ఇతర సమస్యలతో ఇండస్ట్రీకి దూరమైన వారు చాలామందే ఉన్నారు. తాజాగా తన అనారోగ్యాన్ని, పరిశ్రమకు ఎందుకు దూరం కావాల్సి వచ్చిందో బయటపెట్టారు ఓ సీనియర్ హీరోయిన్. ఈ వివరాల్లోకి వెళితే..
ఆనందంతో పాపులర్
రేఖ వేదవ్యాస్.. ఈ పేరు ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. అదే ఆనందం హీరోయిన్ అంటే ఎవరైనా సరే టక్కున గుర్తుపడతారు. తన అందం, నటన, చిరునవ్వుతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేశారు. ఆనందం సినిమాలో ఆమె నటనతో ఎంతోమంది కుర్రాళ్లకు కలల రాకుమారిగా మారారు. ఆ తర్వాత అందం, జాబిలి, ఒకటో నెంబర్ కుర్రాడు, మన్మథుడు తదితర సినిమాలతో వరుస హిట్స్ అందుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న దశలో అనూహ్యంగా పరిశ్రమకు దూరమయ్యారు. ఆ తర్వాత కన్నడంలో కొన్ని సినిమాలు చేసిన రేఖ .. టాలీవుడ్‌కు పూర్తిగా దూరమయ్యారు. చివరిసారిగా 2008లో వచ్చిన నిన్న, నేడు రేపు సినిమాతో తెలుగువారిని పలకరించారు రేఖ. అయితే మాతృభాషలోనూ ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయారు. 2014 తర్వాత కన్నడంలోనూ ఆమె నటించలేదు.

పదేళ్లుగా ఇండస్ట్రీకి దూరం
దాదాపు పదేళ్లుగా ఇండస్ట్రీగా దూరంగా ఉంటున్న రేఖ.. ఇటీవల అలీతో సరదాగా, వావ్ వంటి షోలతో తెలుగు వారి ముందుకు వచ్చారు. ఆ సమయంలో బాగా బక్క చిక్కిపోయి గుర్తుపట్టని విధంగా మారిపోయారు. దాంతో రేఖకి ఏమైంది? దీనికి కారణం ఏంటీ? అంటూ ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ తెలుగు యూట్యూబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, ఆరోగ్యం, కుటుంబం, పెళ్లిపై రేఖ వేదవ్యాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే.. కోవిడ్‌కు ముందు వ్యక్తిగత కారణాలతో సినిమాలకు దూరంగా ఉన్నా. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ.. శారీరకంగా, మానసికంగా కృంగిపోయా. రీ ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తూనే ఉన్నా.. ఇందుకు రెండు కారణాలు. సినిమా అనేది నా ఫ్యాషనైతే, రెండోది నా చికిత్సకు డబ్బులు కావాలి. అని రేఖ అన్నారు.
నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడం లేదు
మీరెందుకు పెళ్లి చేసుకోలేదు? మీకు ఇష్టమైన వాళ్లు దొరకలేదా? ఏదైనా బ్యాడ్ పాస్ట్ ఉందా? అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి రేఖ స్పందిస్తూ.. నా ఆన్సర్ కూడా రెండింటిలో ఒకటి ఉంటుంది. నా ఆన్సర్ ఆ రెండు ప్రశ్నలే. గతంలో కొందరు నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారు.. అప్పుడు నాకు పెళ్లి ఇష్టం లేదు. ఆ తర్వాత నేను పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. వాళ్లు నన్ను ఇష్టపడలేదు. అయితే ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. పెళ్లి చేసుకుంటారు... ఏడాదికి, రెండేళ్లకే డివోర్స్ అంటున్నారు. విడాకులు ఇచ్చేదానికి పెళ్లెందుకు చేసుకుంటున్నారు. నేను ఆలస్యంగా పెళ్లి చేసుకున్నా.. ఆ బంధాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తా. లేట్‌గా అయితే సూపర్.. నాకు ఇంత వరకు ఎవరూ తారసపడలేదు.. ఎవరైనా ఉంటే చెప్పండి అని రేఖ తేల్చారు.
అంతా దేవుడి దయే
ఇండస్ట్రీ అప్పటికీ, ఇప్పటికీ ఎంతో మారిపోయింది. ఎంతోమంది టాలెంటెడ్ పర్సన్స్ వచ్చారు.. సోషల్ మీడియా వచ్చింది. అప్పుడు ఇలాంటివి ఉండేవి కావు... కార్పోరేట్లు ఇండస్ట్రీలోకి వచ్చేశారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు కొత్తగా అనిపిస్తోంది. ఇప్పటికీ నేను నేర్చుకుంటూనే ఉన్నా... బయటికి వెళ్లినప్పుడు కొంతమంది గుర్తుపడతారు. హైదరాబాద్‌కి నేను దాదాపు 4 ఏళ్ల తర్వాత వచ్చాను. హైదరాబాద్ బ్యూటీఫుల్, ఐటీ కారిడార్ వైపు వెళితే బాగా డెవలప్‌మెంట్ కనిపిస్తోంది. అన్ని పరిస్ధితులను దాటుకుని ఈరోజు ఇలా ఉన్నానంటే దేవుడి దయేనని రేఖ వేదవ్యాస్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రేఖకు పెళ్లి కావాలని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











