రేణూ దేశాయ్ కఠిన నిర్ణయం.. త్వరలో అకీరా, ఆధ్యలను విడిచి వెళ్తానంటూ..
టాలీవుడ్ హీరోయిన్ రేణూ దేశాయ్ (Renu Desai) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రేణు.. ఆ తరువాత కాలంలోకాస్ట్యూమ్ డిజైనర్‌గా, నిర్మాతగా, డైరెక్టర్‌గా తన మల్టీటాలెంట్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గత కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరంగా రేణు దేశాయ్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈసారి ఆమె వ్యక్తిగత జీవితంపై తీసుకున్న కఠిన నిర్ణయం చర్చనీయాంశమైంది. ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించి, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన రేణు దేశాయ్, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడుతూ ఆశ్చర్యపరిచే విషయాలు వెల్లడించింది.
ఆధ్యాత్మిక ప్రయాణం
ఇటీవల రేణు దేశాయ్ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ తన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి తొలిసారి వెల్లడించింది. "నాకు 2000 సంవత్సరంలోనే సద్గురు పరిచయం అయ్యారు. ఆయన బుక్స్ చదవడం, సంగీతం వినడం ద్వారా ఆయనపై ఆసక్తి పెరిగింది. ఇంజనీరింగ్ పర్సన్ ఒకరు ఇలా ఆధ్యాత్మిక గురువుగా మారడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆయన జీవిత కథ చదివిన తర్వాత, ఆయన ఆశ్రమం వెళ్లి ప్రత్యక్షంగా చూసాను" అని చెప్పింది.

ఆశ్రమంలో దేవి విగ్రహం చూసిన క్షణం గురించి మాట్లాడుతూ "ఆ విగ్రహాన్ని చూసినప్పుడు నాకు తల్లి దగ్గరికి వెళ్లిన భావన కలిగింది. శివుడికి, వినాయకుడికి భక్తురాలినే కానీ, దేవిని మాత్రం తల్లిలా భావిస్తాను. అందుకే ఆ విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చాను" అని తెలిపారు. అదే సమయంలో "నేను దేవత దగ్గర ఏం కోరుకోను. ఆ తల్లి ఏమి ఇవ్వాలో ఆమెకే తెలుసు" అంటూ తన ఆధ్యాత్మిక విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.
సన్యాసం నా తదుపరి అడుగు
ఇంటర్వ్యూలో యాంకర్ "మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?" అని అడగగా, రేణు దేశాయ్ ఇచ్చిన సమాధానం అందరినీ షాక్‌కు గురి చేసింది. "నేను కొద్ది రోజుల తర్వాత సన్యాసిగా మారబోతున్నాను. ధ్యానం, ఆధ్యాత్మికత వైపు నా జీవితం మలుచుకుంటుంది. ప్రస్తుతం నా పిల్లలు ఆధ్యా, అకీరా చిన్నవారు. వారు పెద్దవాళ్లు అయిన తర్వాత పూర్తిగా ఆధ్యాత్మిక మార్గం పట్టాలనే నా నిర్ణయం," అంటూ వెల్లడించింది. ఆమె ఈ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారింది. అభిమానులు 'ఇది నిజంగా కఠిన నిర్ణయం,' "ఆమె జీవితం నిజంగా ప్రేరణాత్మకం," అంటూ కామెంట్లు చేస్తున్నారు.
రేణూ దేశాయ్ తన పిల్లలు ఆధ్యా, అకీరా గురించి మాట్లాడుతూ "వారికి నచ్చిన మార్గంలోనే వెళ్లమని చెబుతాను. నేను ఎప్పుడూ ఏ విషయంలోనూ ఒత్తిడి చేయను. పిల్లల్ని స్వేచ్ఛగా ఎదగనివ్వాలి అని నమ్ముతాను." అదే సమయంలో ఆసక్తికర విషయాన్ని పంచుకుంటూ"వారిలో సంగీతంపై ఆసక్తి పెరగాలని అనిపించి, ఇంటికి పియానో తెప్పించాను. మాస్టర్ పెట్టించుకున్నాను. నేను నేర్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత వారు కూడా ఆసక్తి చూపించి నేర్చుకోవడం మొదలుపెట్టారు," అని చెప్పింది. అలా ఆధ్యా, అకీరా ఇద్దరూ సంగీత ప్రియులు అని ఆమె గర్వంగా తెలిపింది.
ఆద్య భవిష్యత్తు... ప్రజాసేవ దిశగా?
ఆధ్య ఫ్యూచర్ గురించి ప్రశ్నించగా.. రేణు దేశాయ్ షాకింగ్ సమాధానమిచ్చింది. "ఆధ్య సినిమాల్లోకి రాదు. నాకు గానీ, ఆమెకు గానీ ఆ ఆసక్తి లేదు. ఆమె పబ్లిక్ సర్వీస్, ప్రజాసేవ వైపు వెళ్తుంది. చిన్న వయసులోనే ఆ విషయాలపై ఆసక్తి చూపుతుంది. ఆమె జాతకంలో కూడా 'ప్రజాసేవకురాలిగా ఎదుగుతుంది' అని ఉంది," అంటూ వెల్లడించింది. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో మరో చర్చ మొదలైంది. 'పవన్ కళ్యాణ్ రాజకీయ వారసురాలు ఆద్యనా?', 'పవన్ కళ్యాణ్ కుమార్తె కూడా ప్రజాసేవ మార్గంలోకి వస్తుందా?'అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
టాలీవుడ్ ప్రేక్షకులందరికీ తెలిసిందే రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ ప్రేమకథ ఒకప్పుడు ఇండస్ట్రీని కుదిపేసింది. "బద్రి" మరియు "జానీ" సినిమాల్లో వీరి జంట హిట్ అయ్యింది. అదే సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించి, సహజీవనం తర్వాత వివాహం జరిగింది. అకీరా, ఆద్యలకు జన్మనిచ్చిన తర్వాత వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. పవన్ తర్వాత మరోసారి పెళ్లి చేసుకున్నారు, కానీ రేణు మాత్రం పిల్లలతో సింగిల్‌గా ఉంటూ, సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంది.
కొన్నేళ్లుగా రేణు దేశాయ్ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, ఆమె సోషల్ మీడియా పోస్టులు మాత్రం అభిమానులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటుంటాయి. 2023లో "టైగర్ నాగేశ్వరరావు" సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చిన రేణు, ఆ తరువాత మరో ప్రాజెక్ట్‌లో నటించలేదు. అయితే, ఆమె సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యం రేణూ దేశాయి నిర్ణయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications











