నా బాధ, నా కన్నీళ్లు ఆ ఇద్దరికీ తెలుసు... రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీనటుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ నటిగా కంటే సోషల్ యాక్టివిస్ట్‌గా బాగా ఫేమస్. అలాగే సోషల్ మీడియాలోనూ ఆవిడ బాగా యాక్టీవ్. అన్ని రకాల అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆమెపై ట్రోలింగ్ కూడా తారాస్థాయిలో జరుగుతుంటుంది. తాజాగా గత కొన్నిరోజులుగా తాను బాధపడుతున్నానంటూ సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
సామాజిక సేవా కార్యక్రమాలతో రేణు దేశాయ్ బిజీ
పవన్ కళ్యాణ్‌తో విడాకుల తర్వాత సినీ జీవితానికి గుడ్ బై చెప్పేసి, ఇద్దరు పిల్లలతో ఒంటరిగానే జీవితాన్ని కొనసాగిస్తున్నారు రేణూ దేశాయ్. ఒత్తిడిని అధిగమించడానికి, సంతృప్తి కోసం సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఓ ఎన్జీవోను స్థాపించి మూగజీవాల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. ప్రతినిత్యం పలు అంశాలపై అవగాహన కల్పిస్తూ.. ఎక్కడైనా మూగజీవాలు కష్టంలో ఉంటే వాటిని ఆదుకోవడానికి తనవంతు ప్రయత్నం చేస్తారు రేణు దేశాయ్.

వీధి కుక్కలపై సుప్రీంకోర్ట్ తీర్పు
ప్రస్తుతం దేశంలో వీధి కుక్కల దాడులు, వాటి నిర్మూలన అన్న అంశం చర్చనీయాంశమైంది. ఏకంగా సుప్రీంకోర్ట్ వరకు విషయం చేరగా.. వీధి కుక్కల నివారణ కోసం సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. దీనిపై జంతు ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దేశంలోని కొన్ని చోట్ల వీధి కుక్కలను చంపేస్తున్న వార్తలు వెలుగుచూస్తున్నాయి. దీనిపై జనవరి 19వ తేదీన హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో రేణు దేశాయ్, యాంకర్ రష్మి గౌతమ్ తదితర సామాజిక కార్యకర్తలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేణు దేశాయ్ ఆవేశపూరితంగా మాట్లాడారు. ఎప్పుడు కూల్‌గా, నవ్వుతూ ఉండే ఆమె ఈ స్థాయిలో బరస్ట్ కావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
రేప్ చేసిన వాడిని చంపగలరా
కుక్కలపై పగతోనే న్యాయమూర్తి అలాంటి తీర్పు ఇచ్చారు.. ఇలా మాట్లాడినందుకు నన్ను జైళ్లో పెట్టినా పర్వాలేదు. ప్రస్తుతం దేశంలో న్యాయవ్యవస్థ జోక్‌గా మారింది. నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వు సేఫ్.. డబ్బు లేకపోతే నువ్వు సేఫ్ కాదు. ప్రతిరోజూ ఐదారు కుక్కలు పలు ప్రమాదాల్లో గాయపడితే.. వాటిని అంబులెన్స్‌లలో తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ అందిస్తున్నాం. దానికి బిల్ నేనే వ్యక్తిగతంగా కట్టి.. కుక్కలను కాపాడుతున్నాను. కుక్కలు కరిచి చిన్నారి చనిపోతే.. ఆ కుక్కని కొట్టి చంపుతున్నారు.. మరి చిన్నారులను రేప్ చేసి చంపేస్తుంటే అలాంటి మగాళ్లని ఎందుకు చంపడం లేదు అని రేణూ దేశాయ్ ప్రశ్నించారు.
మందు షాపులను మూసేయగలరా
నిత్యం దేశంలో ఎంతో మంది చిన్నారులు ఆకలితో చనిపోతున్నారు.. హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేసి ఎంతోమంది యువత ప్రాణాలు కోల్పోతున్నారు.. గ్రామాల్లో మందు తాగి గొడవలు చేస్తున్నారు, ఆ మందు షాపులను మూసేసి దమ్ము మీకుందా? కానీ కుక్కలను చంపడానికి మాత్రం దమ్ముందా? నేను ఎప్పుడూ ఇంత గట్టిగా, ఆవేశంగా మీడియా సమావేశాల్లో మాట్లాడలేదన్నారు. అయితే ఈ ప్రెస్‌మీట్ ముగిసిన తర్వాత ఆమెపై దారుణంగా ట్రోలింగ్ జరిగింది. దీనిపై మరో వీడియోలో రేణు దేశాయ్ వివరణ ఇస్తూ ఎమోషనల్ అయ్యారు.
ఏ పార్టీలోనూ చేరడం లేదు
నాకు కొంచెం దగ్గు, జ్వరం ఉంది కొంచెం గొంతు పోయింది. కుక్కలకు సంబంధించిన విషయంపై మాట్లాడి ఇప్పుడే ఇంటికి వచ్చాను. నేను ఏ రాజకీయ పార్టీలోనూ జాయిన్ కావడం లేదు. నాకు రాజకీయాలంటేనే ఇష్టం లేదు. అనవసరంగా రూమర్స్ పెట్టొద్దు. నా ఎన్జీవో వర్క్, ఇతర కార్యక్రమాలతో హ్యాపీగా ఉంటున్నా. ఇవాళ్టీ ప్రెస్‌మీట్‌లో నేను మీడియా ప్రతినిధిని కావాలని తిట్టలేదు. 55 ఏళ్ల ఒక వ్యక్తి నా మీద అరిచాడు.. స్టేజ్ మీదున్న నన్ను కొట్టడానికి దూసుకొచ్చాడు. సెక్యూరిటీ సిబ్బంది, వాలంటీర్లు అతనిని అడ్డుకుని నన్ను కాపాడారు. అందుకే అతనిపై కోప్పడ్డాను. మీడియాను ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటా. నా మీద తప్పుడు ప్రచారం, పుకార్లు వ్యాప్తి చేయడం ఆపండి అని రేణు దేశాయ్ కోరారు.
నా వ్యక్తిగత జీవితంపై దారుణంగా
ఇంటికి వస్తుంటే దారిలో కొన్ని కామెంట్స్ చూశాను. నా పర్సనల్ లైఫ్ మీద మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్. అందుకే పవన్ కళ్యాణ్ నిన్ను వదిలేశారు.. నీకు తిక్క ఉంది అంటూ నానారకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. నేను ఎవరి కోసం పోరాడుతున్నాను, నాకు ఏమైనా డబ్బు వస్తుందా? నేను కుక్కల కోసం కూడా పోరాడటం లేదు.. మనిషి జీవితం కోసమే పోరాడుతుంటే మీరు నాపై ఇలాంటి నీచమైన కామెంట్స్ పెడుతున్నారు. నీ పిల్లల్ని కుక్క కరిచి.. నీ పిల్లలు చనిపోతే అప్పుడు తెలుస్తుంది అంటున్నారు. మీ వీధిలో కుక్కల గురించి కంప్లయంట్ చేయాలంటే జీహెచ్ఎంసీ లేదా నా ఎన్జీవోను సంప్రదిస్తే మేం సాయం చేస్తాం. అలా కాకుండా నా పర్సనల్ లైఫ్ మీద, నా బిడ్డల మీద అలాంటి మాటలు మాట్లాడొద్దని రేణు దేశాయ్ కోరారు.
నా బాధ, నా కన్నీళ్లు వాళ్లకి తెలుసు
ఆమె స్వయంగా వివరణ ఇచ్చినా విమర్శలు, ట్రోలింగ్ ఆగిపోవడంతో మరోసారి రేణు దేశాయ్ స్పందించారు. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ పెట్టారు. నేను నా వ్యక్తిగత హక్కుల కోసం పబ్లిక్‌గా ఎప్పుడూ పోరాడలేదు. కానీ కొన్ని దూకుడుగా ఉన్న కుక్కల కోసం అమాయకమైన కుక్కల్ని చంపడం తప్పు అని అదరికీ అర్ధమయ్యే వరకు నేను అరుస్తూనే ఉంటాను. మీరు నా గురించి ఎంత ప్రతికూలంగా, ద్వేషంతో మాట్లాడినా సరే.. నేను నా బాధను, కన్నీళ్లను ఎవరితో పంచుకుంటున్నానో మాత్రం గుర్తుంచుకోండి. నాకు తల్లిదండ్రులు, అన్నయ్య, భర్త లేరు. నా తప్పు లేకుండా నాపై జరుగుతున్న ఈ ప్రచారాన్ని మౌనంగా దేవి, మహదేవుడితో పంచుకుంటున్నా. నా బాధ, నా కన్నీళ్లు వాళ్లకు తెలుసు అంటూ రేణు దేశాయ్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











