వారి పరిస్థితి దారుణంగా ఉంది, అందుకే సాక్షి టీవీతో చేతులు కలిపా: రేణు దేశాయ్

Recommended Video

అందుకే సాక్షి టీవీతో చేతులు కలిపా : రేణు దేశాయ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి సీరియస్‌ పాలిటిక్స్ చేస్తున్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో అటు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని అధికార తెలుగు దేశం పార్టీని, ఇటు జగన్ సారథ్యంలోని ప్రతిపక్ష వైసీపీపై విమర్శలు సందిస్తున్నారు.

ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్... జగన్‌కు సంబంధించిన సాక్షి టీవీ రైతుల గురించి చేస్తున్న షోలో భాగం కావడంతో అంతా ఆశ్చర్యపోయారు. చాలా మంది దీనికి రాజకీయ నేపథ్యాన్ని ఆపాదిస్తున్నారు. ఈ వార్తలపై రేణు దేశాయ్ స్పందించారు.

అందుకే సాక్షి టీవీతో చేతులు కలిపా

అందుకే సాక్షి టీవీతో చేతులు కలిపా

మనస్ఫూర్తిగా రైతుల కోసం చేస్తున్న పని ఇది. నేను రైతుల కోసం ఒక సినిమా కథ రాసిన విషయం మీకు అందరికీ తెలుసు. వారి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు సాక్షి టీవీ ఛానల్ చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగం అయ్యాను అని రేణు దేశాయ్ తెలిపారు.

ఎవరూ రాజకీయం చేయొద్దు

ఎవరూ రాజకీయం చేయొద్దు

ఒక మంచి ఉద్దేశ్యంతో నేను చేస్తున్న ఈ పనిని దయచేసి ఎవరూ రాజకీయం చేయవద్దు, నా మనసులో ఉన్న మంచి ఆలోచనను పాడు చేయవద్దు అంటూ... ఈ సందర్భంగా రేణు దేశాయ్ కోరారు.

పరిస్థితి దారుణంగా ఉంది

పరిస్థితి దారుణంగా ఉంది

దాదాపు 200 మంది రైతులను కలిశాను. వారి సమస్యలు విన్నాను. దేశానికి అన్నంపెట్టే రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వారు చాలా సమస్యు ఎదుర్కొంటున్న విషయం తన దృష్టికి వచ్చినట్లు రేణు దేశాయ్ తెలిపారు.

మనం కాకుంటే ఎవరు సహాయం చేస్తారు?

మనం కాకుంటే ఎవరు సహాయం చేస్తారు?

మనమంతా చదవుకున్న పౌరులుగా రైతులకు ఏమైనా చేయాల్సిన అవసరం ఉంది. మన కాకుంటే ఎవరు చేస్తారు?... బాధ్యతగల సిటీజెన్‌గా ఒక రైతుకు సహాయ పడినా నాకు సంతోషమే. అందుకే సాక్షి టీవీతో ఈ షో చేస్తున్నట్లు అని రేణు దేశాయ్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X