నిహారిక పెళ్లికి అందుకే దూరంగా ఉన్నా.. పవన్ కల్యాణ్ గురించి రేణుదేశాయ్ క్లారిటీ!

మెగా ఫ్యామిలీలో నాగబాబు కూతురు, టాలీవుడ్ హీరోయిన్ నిహారిక కొణిదెల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాహానికి కొణిదెల ఫ్యామిలీకి చెందిన ముఖ్యులందరూ హాజరయ్యారు. అయితే రేణు దేశాయ్ పెళ్లిలో కనిపించకపోవడంపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే తాను ఎందుకు హాజరుకాలేదనే విషయాన్ని రేణుదేశాయ్ స్వయంగా వెల్లడించారు. రేణు దేశాయ్ చెప్పిన విషయం ఏమిటంటే..

 మెగా, అల్లు ఫ్యామిలీ కలయికతో

మెగా, అల్లు ఫ్యామిలీ కలయికతో

జైపూర్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన నిహారిక పెళ్లికి మెగా ఫ్యామిలీతోపాటు అల్లు కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. మెగా హీరోలందరూ కలిసికట్టుగా ఫ్యామిలీ ఫంక్షన్‌కు ఒక రోజు ముందే అక్కడికి చేరుకొన్నారు. మెగా హీరోలందరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానులకు కన్నుల పండువగా మారింది.

 కూతురు, కుమారుడితో కలిసి పవన్ కల్యాణ్

కూతురు, కుమారుడితో కలిసి పవన్ కల్యాణ్

నిహారిక పెళ్లి వేడుకకు ముందు పవన్ కల్యాణ్‌ తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు ఆంధ్రాలో పర్యటించారు. పెళ్లికి ముందు రోజుతన కుమారుడు అకీరా, కుమార్తె ఆద్యతో కలిసి జైపూర్‌కు చేరుకొన్నారు. అయితే రేణుదేశాయ్ కానీ, అన్నా లెజ్‌నోవా కనిపించలేదు. దాంతో రకరకాల ఊహాగానాలు మీడియాలో వినిపించాయి.

రేణు దేశాయ్‌పై రూమర్లు

రేణు దేశాయ్‌పై రూమర్లు

నిహారిక పెళ్లికి మెగా ఫ్యామిలీ రేణు దేశాయ్‌ని ఆహ్వానించలేదు. పెళ్లికి ఆమె రావడం ఇష్టం లేదు. వేడుకలో రేణుదేశాయ్, పవన్‌ను కలిసి ఉండటం ఫ్యాన్స్‌కు చూడటం ఇష్టం లేకనే పిలువలేదు అంటూ మీడియాలో రూమర్లు వినిపించాయి. అయితే వాటిని రేణుదేశాయ్ కొట్టిపడేశారు.

క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్

క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్

నిహారిక పెళ్లికి వెళ్లకపోవడంపై రేణుదేశాయ్ క్లారిటీ ఇచ్చింది. తనకు నిహారిక పెళ్లికి ఆహ్వానం అందింది. డిసెంబర్ 9వ తేదీన షూట్ ఉండటం కారణంగా నేను వెళ్లలేకపోయాను. అందుకే నా పిల్లలను పెళ్లికి పవన్ కల్యాణ్‌తో పంపించాను. అంతేకాకుండా మీడియాలో వస్తున్న వార్తలన్నీ రూమర్లే అంటూ క్లారిటీ ఇచ్చారు.

Recommended Video

#Nischay : Niharika And Chaithanya Visits Annavaram Temple | Filmibeat Telugu
తండ్రితో పిల్లలు చాలా ఎంజాయ్ చేశారని..

తండ్రితో పిల్లలు చాలా ఎంజాయ్ చేశారని..

నిహారిక పెళ్లిలో అకిరా, ఆద్య తన తండ్రితో కలిసి ఎక్కువ సమయాన్ని గడిపారు. తండ్రితో కలిసి పెళ్లిలో జాలీగా ఎంజాయ్ చేశారు. ఒకరోజు తర్వాత పవన్ కల్యాణ్ తన బిజీ షెడ్యూల్ కారణంగా వెంటనే హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు అని రేణుదేశాయ్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X