Renu Desai: రేణు దేశాయ్​ రెండో పెళ్లికి సిద్ధమైందా? జీవితంలో తోడు కావాలని పోస్ట్.. వీడియోలు వైరల్​

రేణు దేశాయ్​ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. బంగాళ ఖాతంలో నీరంటే నువ్వేలే అనే సాంగ్​ ఎంత పాపులరో.. అంతకుమించి ఫేమస్​ అయ్యారు రేణు దేశాయ్​. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీతో టాలీవుడ్​ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాందించుకున్నారు. హీరోయిన్​గా బ్రేక్​ ఇచ్చిన రేణు దేశాయ్​ నటిగా, దర్శకురాలిగా మారి అలరించారు. 2012లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్​ నుంచి విడాకులు తీసుకున్న రేణు దేశాయ్​ సింగిల్​గానే ఉంటున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆమె పెట్టిన పోస్టులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

సింగిల్​ గానే..

సింగిల్​ గానే..

బద్రి సినిమాతో హీరోయిన్​గా మోస్ట్ పాపులారిటీ సంపాందించుకున్నారు రేణు దేశాయ్​. ఇందులో పవన్​ కల్యాణ్ సరసన నటించగా, వాళ్లిద్దరి పెయిర్​కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే పవన్​ కల్యాణ్​ను పెళ్లి చేసుకున్న రేణు దేశాయ్​ 2012లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచి ఆమె సింగిల్​గానే జీవితం గడుపుతోంది. ఇక ఈ మధ్యనే దర్శకురాలిగా మారి ఓ సినిమాను డైరెక్ట్​ చేశారు.

వీడియోలు చక్కర్లు..

దర్శకురాలిగా, జడ్జిగా రీ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఎంటర్​టైన్​ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉండే రేణు దేశాయ్​ పలు ఫొటోలు, పోస్ట్​లతో నెటిజన్లకు టచ్​లో ఉంటారు. అయితే తాజాగా ఆమె పెట్టిన రెండు పోస్ట్​లు చర్చనీయాంశంగా మారాయి. ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట్ల చక్కర్లు కొడుతున్నాయి.

తోడు కావాలి..

ఇందులోని ఒక వీడియోలో ''జీవితంలో అవసరం ఉన్నప్పుడు మన చేయి పట్టుకుని నడిపించే ఒక తోడు కావాలి'' అని రాసి ఉంది. అలాగే ఈ వీడియోలో రేణు దేశాయ్ ఒక ఒడ్డు పక్కన కూర్చొని ఉంటుంది. ఇక రెండో పోస్ట్​లోని వీడియోలో ''మీ సోల్​మేట్​ని వెతకడానికి ముందు మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోండి'' అని రాసుకొచ్చింది. దీంతో ఈ వీడియోలు వైరల్​ కావడమే కాకుండా చర్చనీయాంశంగా మారాయి.

రెండో పెళ్లిపై వార్తలు..

రెండో పెళ్లిపై వార్తలు..

ఈ కామెంట్స్​ను బట్టి రేణు దేశాయ్​ రెండో పెళ్లి వైపు అడుగులు వేస్తుందా? అని చర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావాల్సింది. ఇదిలా ఉంటే ఇదివరకు రేణు దేశాయ్​ రెండో వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. అతడితో ఎంగేజ్​మెంట్ అయిన ఫొటోలను కూడా షేర్ చేశారు. తనకు కాబోయే రెండో భర్త ముఖాన్ని దాస్తూ అతడి చేతికి ఉన్న రింగ్​ను చూపించేలా ఆ ఫొటో ఉంది.

ఐటీ ఉద్యోగం..

ఐటీ ఉద్యోగం..


కాగా గతేడాది అలీతో సరదాగా షోకి వచ్చిన రేణు దేశాయ్​ తన రెండో భర్త గురించి కొన్ని విషయాలు చెప్పారు. అతడు ఓ ఐటీ కంపెనీలో మేనేజర్​గా పనిచేస్తాడని, అంతకుముందు అతడు అమెరికాలో ఉద్యోగం చేసేవాడని తెలిపారు. అతని తండ్రికి ఆరోగ్యం బాలేకపోవడంతో ఇండియాకు వచ్చి పూణెలో ఐటీ జాబ్ చేస్తున్నాడని రేణు దేశాయ్ తెలిపారు. ఇక దాని తర్వాత ఆమె రెండో పెళ్లి విషయంపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X