twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Renu Desai in TNR హేమలత లవణం పాత్రలో పవర్‌ ఫుల్‌గా.. రేణుదేశాయ్ సెకండ్ ఇన్సింగ్స్‌ క్రేజీగా!

    |

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ సతీమణి, టాలీవుడ్ హీరోయిన్ రేణుదేశాయ్ మరోసారి వెండితెర మీద ఎంట్రీ ఇస్తున్నారు. పవన్ కల్యాణ్‌తో వివాహం తర్వాత నటనకు దూరంగా ఉంటూ వచ్చారు. పవన్ కల్యాణ్‌తో విడాకుల తర్వాత బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చారు. పలు రియాలిటీ షోలలో న్యాయమూర్తిగా, మెంటర్‌గా కనిపించారు. అయితే చాలా రోజుల తర్వాత ప్రస్తుతం మాస్ మహారాజా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. సినిమాకు సంబంధించి, అలాగే రేణు దేశాయ్ పాత్రకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

    స్టూవర్ట్‌పురంలో పేరు మోసిన దొంగ

    స్టూవర్ట్‌పురంలో పేరు మోసిన దొంగ

    ది కశ్మీర్ ఫైల్స్, కార్తీకేయ 2 లాంటి పాన్ ఇండియా సినిమాలతో విశేష ఆదరణ చూరగొన్న నిర్మాత అభిషేక్ అగర్వాల్, డైరెక్టర్ వంశీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు. స్టూవర్ పురంలో దేశంలోనే భారీ చోరీలకు పాల్పడిన పేరు మోసిన దొంగ జీవితం ఆధారంగా టైగర్ నాగేశ్వర్ రావు చిత్రం బయోపిక్‌గా తెరకక్కింది. ఈ సినిమా ప్రారంభోత్సం ఉగాది రోజున చిరంజీవి చేతుల మీదుగా జరిగింది.

    ఇందిరాగాంధీకే సవాల్ విసిరిన స్టూవర్ట్‌పురం దొంగ

    ఇందిరాగాంధీకే సవాల్ విసిరిన స్టూవర్ట్‌పురం దొంగ

    70 దశకంలో దేశంలో పలు సంచలన దొంగతనాలకు కేరాఫ్ అడ్రస్‌గా టైగర్ నాగేశ్వరరావు నిలిచాడు. ఏకంగా అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఇంట్లో చోరికి పాల్పడుతానని చెప్పి ఛాలెంజ్ చేసి దొంగతనం చేసిన చరిత్ర ఆయన పేరున ఉంది. అలాంటి సంచలన చోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతున్నది.

    పవర్‌ఫుల్ పాత్రలో రేణుదేశాయ్

    మాస్ మహారాజ్ రవి తేజ, నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో ఓ కీలకపాత్రలో రేణుదేశాయ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె నటిస్తున్న హేమావతి లవణం పాత్రను అభిమానులకు, ప్రేక్షకులకు పరిచయం చేశారు. రచయిత, సామాజిక కార్యకర్త హేమలత లవణం పాత్రను రేణుదేశాయ్ పోషిస్తున్నారు. ఈ సినిమాలో సామాజిక పరిస్థితుల చక్కదిద్దే పవర్‌ఫుల్ పాత్రలో రేణుదేశాయ్ నటిస్తున్నారు.

     సామాజిక కార్యకర్తగా పెద్దరికం, హుందాగా

    సామాజిక కార్యకర్తగా పెద్దరికం, హుందాగా

    టైగర్ నాగేశ్వరరావు చిత్రంలోని హేమలత లవణం పాత్రలో రేణుదేశాయ్ హుందాగా కనిపించారు. కళ్లజోడు, తెల్ల చీరతో సామాజిక కార్యకర్తగా పెద్దరికం కనిపించారు. ప్రస్తుతం రేణుదేశాయ్ లుక్, గెటప్ అభిమానులను విశేషంగా ఆకట్టుకొంటున్నది. ఆమె పోషించిన పాత్ర, నటన కోసం ఎదురు చూసేలా ఆసక్తిని పెంచింది. రేణుదేశాయ్ సెకండ్ ఇన్సింగ్ ఓ రేంజ్‌లో ఉండే అవకాశం ఉందనే విషయం ఫస్ట్ లుక్ పోస్టర్‌తో స్పష్టమైంది.

     ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా

    ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా


    టైగర్ నాగేశ్వర్ రావు చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్నది. ఈ చిత్రానికి ఆర్ మాధి సినిమాటోగ్రాఫర్‌గా, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అవినాశ్ కోళ్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా, శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్‌గా వ్యవహరిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్, మయాంక్ సింఘానియా సహ నిర్మాతగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

    English summary
    Tiger Nageswara Rao movie makers came up with a small glimpse to introduce Renu Desai’s character. Renu Desai is playing a very important and powerful character called Hemavathi Lavanam. It’s a real-life character and Hemalatha Lavanam was an Indian social worker, and writer, who protested against untouchability and the imbalance in the social system. Renu Desai, in the video
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X