పవన్ కల్యాణ్‌తో నా ప్రేమ గుడ్డిది.. రేణూ దేశాయ్

Renu Desai-Pawan Kalyan: హీరోయిన్ రేణుదేశాయ్ ప్రత్యేక పరిచయం లేని పేరు. టాలీవుడ్‌లో ఒకప్పుడు హీరోయిన్‌గా మెరిసి, తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్‌, నిర్మాత‌, దర్శకురాలిగా మల్టీటాలెంట్ గా సత్తా చాటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు ఆమె. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో తన బంధం గురించి రేణూ దేశాయ్ (Renu Desai) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రస్తుతం వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఇంతకీ రేణూ దేశాయ్ ఏమన్నారంటే?

రేణు దేశాయ్ మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత జానీ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించారు. ఈ రెండు సినిమాల ద్వారా వీరి జంట తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ దగ్గరైంది. ప్రేమతో మొదలైన బంధం వివాహంగా మారింది. వీరికి ఇద్దరు పిల్లలు అకీరా నందన్, ఆద్య. అయితే కొన్ని కారణాల వల్ల ఈ జంట పరస్పర అంగీకారంతో విడిపోయింది. విడాకుల తర్వాత రేణు దేశాయ్ తన పిల్లల పెంపకంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు.

Renu Desai Opens Up About Her Love for Pawan Kalyan Love Made Me Blind and Deaf

విడాకుల తర్వాత రేణు సినిమాలకు దూరమయ్యారు. అయితే పూర్తిగా ఇండస్ట్రీని వదిలేయలేదు. కాస్ట్యూమ్ డిజైనింగ్‌, నిర్మాణం, దర్శకత్వం వంటి రంగాల్లో తన ప్రతిభను చూపించారు. సోషల్ మీడియాలో కూడా ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లోనే లక్షల్లో అభిమానులు ఆమెను ఫాలో అవుతుండటం ఆమె క్రేజ్‌కు నిదర్శనం. దాదాపు రెండు దశాబ్దాల గ్యాప్ తర్వాత 2023లో విడుదలైన టైగర్ నాగేశ్వర రావు సినిమాలో కీలక పాత్ర పోషిస్తూ రీ-ఎంట్రీ ఇచ్చారు. అందులో సామాజికవేత్త హేమలతా లవణం పాత్రలో ఆమె నటించారు. సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా, రేణు నటనకు మంచి స్పందన వచ్చింది.

ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో తన గత బంధం గురించి మాట్లాడిన రేణూ దేశాయ్ (Renu Desai) ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా 'పవన్ కళ్యాణ్ అంతకు ముందు పెళ్లి చేసుకున్నాడని మీకు తెలుసా?' అనే ప్రశ్నకు రేణు దేశాయ్ సమాధానమిస్తూ.. 'ఆ విషయం నాకు అప్పట్లో పూర్తిగా తెలియదు. నాకు కేవలం 18 సంవత్సరాలే. ఆ పెళ్లి గురించి తెలిసిన తర్వాత కూడా నేను తీసుకుంటున్న నిర్ణయం సరైందో కాదో అర్థం చేసుకునే స్థితిలో లేను'అని తెలిపారు.

ఇక పవన్ కళ్యాణ్‌పై తన ప్రేమ గురించి మాట్లాడుతూ రేణు దేశాయ్ భావోద్వేగానికి లోనయ్యారు. 'కేవలం పవన్ కళ్యాణ్ మీద ప్రేమ మాత్రమే నాకు కనిపించింది. ప్రేమించిన తర్వాత బుద్ధి ఎక్కడ పనిచేస్తుంది? ప్రేమ గుడ్డిదని అంటారు.. కానీ, నా విషయంలో ప్రేమ గుడ్డిదే కాదు, చెవిటిది కూడా. ఆ సమయంలో ఎవరు ఏమన్నా నాకు వినిపించలేదు, కనిపించలేదు. పూర్తిగా ప్రేమలోనే ఉన్నాను' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన ఆ సమయంలో ఆమె ఎంతగా భావోద్వేగాలకు లోనయ్యారో చూస్తే అర్థమవుతుంది. గతంలో రేణు దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X