చనిపోయేలోపు అన్ని లెక్కలు తేలుస్తా... రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ఇటీవల తిరిగి యాక్టీవ్ అయ్యారు. వరుస సినిమాలతో పాటు తన సామాజిక సేవా కార్యక్రమాలను జోరుగా సాగిస్తున్నారు. తన పిల్లలు అకీరా నందన్, ఆద్య కొణిదెలను పెంచి పెద్దచేసిన రేణు దేశాయ్... వారిని కెరీర్‌లో సెట్ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, ఆధ్యాత్మికత, సినిమాలు, పిల్లల గురించి కీలక విషయాలు ప్రస్తావించారు. ఈ వివరాల్లోకి వెళితే...

నాకు చేతనైనంత సాయం చేస్తా
వీధి కుక్కలు మనుషుల మీద దాడి చేస్తున్నాయి, ఫుడ్ పెట్టొద్దు.. వాటిని దూరం పెట్టొద్దని కొంతమంది అంటుంటే మీరేమీ వాటి సంక్షేమం కోసం పాటుపడుతున్నారని యాంకర్ ప్రశ్నించగా.. మనం మనుషులం, కలియుగం సెల్ఫీష్‌గా మారిపోయింది. నేను, నా లైఫ్ నా బ్రతుకు. కుక్కలు ఉండకూడదు, కుక్కలు కరుస్తున్నాయి అంటారు. మీరు కారులో వెళ్తారు.. మీకేం తెలుసు మా బాధలు అంటారు. నా వరకు ఎంత వీలైతే అంత నేను చేస్తాను. మనం ఎంత చేసినా మన గురించి తప్పుగా అనుకునే వారు తప్పుగానే అనుకుంటారు. మనం ఎంత తక్కువ చేసినా మన గురించి మంచే అనుకునేవారు మంచే అనుకుంటారు అని రేణు దేశాయ్ తేల్చిచెప్పారు.

Renu Desai Opens Up on Spirituality Social Service Films and Son Akira Nandan s Future

వినాయకుడి ఉపాసన
మీరు వినాయకుడి ఉపాసన తీసుకున్నారా? అని యాంకర్ అడగ్గా.. మహారాష్ట్రలో గణపతిని ఎక్కువగా ఆరాధిస్తారు. అందుకే నేను ఒక చిన్న మంత్రాన్ని తీసుకుని ఉచ్చరిస్తున్నాను. నేను నూటికి నూరు శాతం వెజిటేరియన్. డాక్టర్ మాత్రం బీ 12 కోసమైనా తినాలని చెబుతారు. కొన్నేళ్ల క్రితం ట్రై చేసినా ఆ వాసన నాకు పడలేదు. నాకు సాధ్యమైనంత వరకు డెయిరీ ఉత్పత్తులను ఆహారంలో తీసుకోను. ఇక ఉపవాసాల విషయానికి వస్తే.. ఏకాదశి రోజున ఓ రాక్షసుడు ధాన్యాల్లో ఉంటాడు. అందుకనే మనం ఆ రోజున ధాన్యాన్ని తినకూడదని ఫాలో అవుతాను అని రేణు దేశాయ్ తెలిపారు.

అకీరా కోసం రోజూ పూజ చేస్తున్నా
అకీరాని చూసిన ప్రతి ఒక్కరూ సినిమాల్లోకి ఎప్పుడు వస్తున్నారని అడుగుతున్నారని యాంకర్ ప్రశ్నించగా.. బాగా చదువుకోమని, ఈ టైంలో పడుకోండి, ఇలా తినండి అని పలు రకాలుగా చెబుతాం. మన చేతుల్లో ఉన్నంత వరకు ఓకే.. కానీ వాళ్లు పెదద్యిన తర్వాత వారిష్టం. అకీరా గురించి ప్రతి ఇంటర్వ్యూలోనూ చెబుతూనే ఉంటాను. నేను కన్నతల్లిని మీ అందరి కంటే ఎక్కువ బాధ్యత నాదే. అకీరా కోసం రోజూ ఒక కొబ్బరికాయ కొడుతున్నా, రోజూ దీపం పెడుతున్నా ఎప్పుడు హీరో అవుతాడా అని. ఇంట్లో ఈ టాపిక్ వచ్చినప్పుడల్లా అకీరా వద్దు అంటాడు అని రేణు దేశాయ్ తెలిపారు.

అన్ని లెక్కలు తేల్చుకుంటా
మంచి క్యారెక్టర్లు వస్తే ఖచ్చితంగా నటిస్తా.. ఇప్పుడు 16 రోజుల పండుగ అనే సినిమాలో అత్త క్యారెక్టర్ చేస్తున్నా. 45 ఏళ్ల వయసు వచ్చింది కాబట్టి.. అత్త పాత్రలు హ్యాపీగా చేయొచ్చు. ఈ సినిమాలో అత్తాకోడళ్లు వారి బంధం బాగుంటుంది. ఇప్పుడున్న రోజుల్లో ఫ్యామిలీతో అంత బాండింగ్ ఉండటం లేదు. నాకు మరో జన్మ వద్దు.. మోక్షం ఉంది, ఆ విషయంలో చాలా క్లియర్. ఈ జన్మలో అన్ని రుణానుబంధాలు, అన్ని కర్మలు సెట్ చేసుకుంటున్నాను. నేను ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఇచ్చేస్తా.. ఎవరి దగ్గరి నుంచైనా రావాల్సి వస్తే తీసుకుంటా. ఒకవేళ నేను హర్ట్ చేసుంటే నన్ను కూడా హర్ట్ చేయొచ్చు ఏదైనా సరే అన్ని లెక్కలు తేల్చేసుకుంటా. నేను ఏ క్షణంలోనైనా చనిపోవచ్చు.. మాట్లాడుతుండగా నాకు హార్ట్ అటాక్ వచ్చి పోవచ్చు అని రేణు దేశాయ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అకీరా నందన్ ఎంట్రీ, తన ఆధ్యాత్మిక యాత్ర, సినిమాల గురించి రేణు దేశాయ్ ఏం చెప్పారో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X