Renu Desai: రాజకీయాల్లోకి రేణు దేశాయ్.. ఏ పార్టీలోకి అంటే?
దేశంలో ఎక్కడా లేని విధంగా సినిమా వాళ్ళు ఎక్కువగా రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ అయ్యింది ఎక్కడైనా ఉంది అంటే మాత్రం అది మన సౌత్ లో అది కూడా తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ అని చెప్పవచ్చు. కాగా తెలుగు సినిమాకి చెందిన అనేకమంది నటీనటులు ఎప్పుడు నుంచో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు.
కాగా ఇలా అందరూ సక్సెస్ కాలేదు కానీ ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారి పరిధిలో రాణించిన వారు ఉన్నారు. అలాగే భారీ స్టార్డం ఉంది కూడా ఫెయిల్ అయ్యినవారు లేకపోలేరు. మరి ఇలా కొన్నేళ్ల పాటు గడ్డు కాలం చూసిన స్టార్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. మరి పవన్ కళ్యాణ్ హీరోగా మంచి పీక్ లో ఉన్నపుడు తాను రాజకీయాల్లోకి రావడం జరిగింది.

కాగా అక్కడ కూడా తనకి పదేళ్ల పాటు భారీ దెబ్బలు తప్పలేదు. ఇలా 2024కి వచ్చేసరికి తాను అధికారం లోకి రావడం జరిగింది. అయితే ఈ పదేళ్లలో కూడా పవన్ కి జరగని అవమానం లేదు. దారుణంగా పవన్ మాజీ భార్య విషయంలో కామెంట్స్ వినిపించేవి. కానీ ఇందుకు ట్విస్ట్ గా తన మాజీ భార్య రేణు దేశాయ్ మాత్రం పవన్ లాంటి నాయకుడు దేశానికి అవసరం అని ఇప్పటికీ చెబుతుంటారు.
కాగా ఇపుడు మరో షాకింగ్ వార్త ఆమె నుంచి బయటకి వచ్చింది. రేణు దేశాయ్ పొలిటికల్ ఎంట్రీ పట్ల చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. రేణు దేశాయ్ కి దైవ భక్తి ఎక్కువే అని అందరికీ తెలుసు. అలానే జాతకాలు కూడా నమ్ముతారు. కాగా ఇలా తన జాతకంలో ఆమెకి రాజకీయ ప్రవేశం ఉందని ఆమెకి ముందే తెలుసుకున్నానని రివీల్ చేశారు.
అలాగే ఒక టైం లో అయితే ఆమెకి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం కూడా వచ్చింది అనే ఆమె తెలిపారు. కానీ తనకి పిల్లలు బాధ్యత ఉండడంతో అప్పట్లో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారట. కాగా ఇపుడు మాత్రం తన నుంచి ఈ మాటలు వింటుంటే ఇప్పుడే కాకపోయినా ఫ్యూచర్ లో అయినా రాజకీయాల్లోకి రేణు దేశాయ్ వచ్చినా ఆశ్చర్యం లేదు అనేలా అనిపిస్తుంది. ఇది వరకే బయట పలు సామాజిక కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొనడం జరిగింది.
మరి ఇపుడు మెల్లగా రాజకీయాలు వైపు తాను వెళుతుండడం అనేది ఆసక్తిగా మారుతుంది. కాగా ఆమెకి ఎలాగో తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ స్వభావం అంటే ఇప్పటికీ గౌరవం ఉంది. మరి వాటి మూలాన ఆ పార్టీ లోనే చేరుతారా లేక ఇతర ప్రధాన పార్టీలో ఏమన్నా చేరుతారా అనేది మాత్రం కాలమే నిర్ణయించాలి. ఇక ఇవి పక్కన పెడితే రీసెంట్ గానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సైతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ అడవుల నరికివేతపై ప్రశ్నించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











