Pawan Kalyan డబ్బు మనిషి కాదు.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. ఫ్యామిలీని వదులుకొని పాలిటిక్స్‌లోకి: రేణుదేశాయ్

బ్రో ది అవతార్ (Bro The Avatar) సినిమా వివాదం తర్వాత పవన్ కల్యాణ్ జీవితంపై మంత్రి అంబటి రాంబాబు ప్రకటించిన మూవీపై రేణు దేశాయ్ స్పందించారు. విదేశాల్లో ఉన్న పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు వీడియోలో సంచలన విషయాలను ప్రస్తావించారు. పవన్ వైవాహిక జీవితం గురించి పట్టించుకోకుండా.. మంచి లక్ష్యాలతో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్‌కు సపోర్టుగా ఉండాలని ఆమె సూచించారు. రేణుదేశాయ్ వీడియోలో వెల్లడించిన విషయాల్లోకి వెళితే..

పవన్ కల్యాణ్‌కు నాకు వ్యక్తిగత అభిప్రాయ బేధాలు ఉన్నప్పటికీ.. ఇప్పటికీ నేను ఆయనంటే నాకు చాలా గౌరవం. పవన్ కల్యాణ్ అరుదైన వ్యక్తి. సమాజ బాగోగుల కోసం చాలా కావాల్సిన మంచి మనిషి. నాకు తెలిసిన పవన్ కల్యాణ్‌కు డబ్బు పిచ్చి, సంపాదనపై ఆశలేదు. ఆయన ఎప్పుడూ సమాజం కోసం ఏదో చేయాలని తపన పడుతుంటాడు. అణగారిన ప్రజల సంక్షేమం కోసం ఆవేదన చెందుతుంటాడు అని రేణు దేశాయ్ అన్నారు.

Renu Desai reveals interesting facts and noble thoughts of Pawan Kalyan in her latest Video is trending

పవన్ కల్యాణ్‌తో నాకు ఎలాంటి సమస్యలు ఉన్నా.. నా వ్యక్తిగతం ఆయనకు నేను సపోర్ట్ చేశాను, చేస్తూనే ఉంటాడు. ఆయన రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయన వ్యక్తిగత జీవితాన్ని దూరంగా పెట్టండి. ఆయన విషయంలో నేను హార్ట్ అయ్యాను. కానీ ఆయనకు సపోర్టుగా ఉంటాను. మీరు కూడా అలాంటి సపోర్ట్ ఇచ్చి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లండి అని రేణుదేశాయ్ సూచించారు.

పవన్ కల్యాణ్ సక్సెస్‌ఫుల్ యాక్టర్. డబ్బు, పేరు, పాపులారిటీని వదులుకొని ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారు. తన కుటుంబాన్ని దూరంగా పెట్టి, తన వ్యక్తిగత జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన నిజాయితీతో రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నారని నమ్ముతాను. నేను మాజీ భార్యగా చెప్పడం లేదు. కానీ ఆయనకు ఓ అవకాశం ఇవ్వండి. ఈ విషయం చెప్పడం చూస్తే భార్యగా నేను చెప్పే విషయాలు, సమాజంలో వ్యక్తిగా నేను ఆశించే విషయాలు భిన్నంగా ఉండోచ్చు అని రేణుదేశాయ్ అన్నారు.

Renu Desai reveals interesting facts and noble thoughts of Pawan Kalyan in her latest Video is trending

పవన్ కల్యాణ్ వైవాహిక జీవితాన్ని రాజకీయాలకు ముడిపెట్టకూడదు. ప్రతీ సారి ఆయన పెళ్లిళ్లను రాజకీయాల కోసం వాడుకోవద్దు. దాంపత్య జీవితంలో పవన్ కల్యాణ్ తీసుకొన్న నిర్ణయం నాకు బాధ పెట్టింది. మేము విడిపోయి 11 సంవత్సరాలు అవుతున్నది. మా మధ్య ఎలాంటి సమస్యలు లేకుండా ఎవరి జీవితాలను వారు లీడ్ చేస్తున్నాం అని రేణు దేశాయ్ అన్నారు.

పవన్ కల్యాణ్‌ను రాజకీయాల్లో టార్గెట్ చేస్తూ ప్రతీసారి మూడు పెళ్లిళ్లు అంటూ కామెంట్ చేయడం సరికాదు. ఈ వీడియోలో అలా చెప్పడం అసౌకర్యంగా ఉంది. నేను సమాజానికి ఏం చేయడం లేదు. కనీసం ఆయననైనా సమాజానికి మంచి చేయడానికి అవకాశం ఇవ్వండి. మీ ప్రొఫెషనల్, పొలిటికల్ విభేదాలను దృష్టిలో పెట్టుకొని ఆయన దాంపత్య జీవితం గురించి విమర్శించొద్దు. మా పిల్లలను ఈ వివాదంలోకి లాగొద్దని మనవి చేసుకొంటున్నాను అని రేణు దేశాయ్ అన్నారు.

పవన్ కల్యాణ్ సమాజానికి, ప్రజలకు మంచి చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి ఆయనకు ఓ అవకాశం ఇవ్వండి. సమాజానికి మంచి జరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. పవన్ కల్యాణ్‌కు సపోర్టుగా ఉండండి అని రేణు దేశాయ్ తన వీడియోలో వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X