మనశ్శాంతి కోసం పోరాడుతున్నా... రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీనటుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తిరిగి యాక్టీవ్ అయ్యారు. వరుసపెట్టి సినిమాలతో పాటు ఇతర కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్‌తో విడాకుల తర్వాత పిల్లల కోసం కెరీర్ త్యాగం చేసిన రేణు దేశాయ్.. ఇప్పుడు కెరీర్‌లో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. వరుసపెట్టి సినిమాలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తన సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే.. తన వయసు, ఇమేజ్‌కు తగ్గపాత్రలు వస్తే ఖచ్చితంగా చేస్తానని రేణు ఇప్పటికే తెలిపారు. తాజాగా సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
సినిమాలకు దూరమైనా తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన అనుభవాలతో ఎలాంటి పరిస్ధితులు వచ్చినా తట్టుకునేందుకు అనుగుణంగా రాటుదేలారు. ఒంటరి మహిళగానే తన పిల్లలను పెంచి పెద్ద చేశారు రేణు. ఎన్‌జీవో సంస్థను స్థాపించి మూగ జీవాల సంరక్షణ కోసం పాటుపడుతున్నారు. అలాగే మహిళలపై జరిగే అన్యాయాలు, సామాజిక అంశాలపై ఆమె తరచుగా గొంతెత్తుతూ తన అభిప్రాయాలను కుండబద్ధలు కొడుతున్నారు రేణు దేశాయ్. తన జీవితంపై కొన్నిసార్లు ట్రోలింగ్ ఎదురైనా, వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ.. ట్రోలర్స్‌కు తనదైన శైలిలో కౌంటర్స్ ఇస్తుంటారు.

రెండేళ్ల క్రితం మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. ప్రస్తుతం పదహారు రోజుల పండుగ అనే సినిమాలో నటిస్తున్నారు రేణు. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా ప్రారంభోత్సవంలో రేణు దేశాయ్ సందడి చేశారు. ఇందులో తాను అత్త పాత్ర పోషిస్తున్నట్లు కూడా ఆమె హింట్ ఇచ్చారు. ఇది కాకుండా మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ఎలా సాగుతుందోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అలాగే నటి కావడానికి ముందు మోడల్‌గా ర్యాంప్ వాక్ చేసిన రేణు దేశాయ్.. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఫ్యాషన్ షోలో మరోసారి ర్యాంప్ వాక్ చేసి అలరించారు.
సినిమాలు, సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మికంగానూ రేణుదేశాయ్ ముందున్నారు. తన ఇంట్లో అన్ని పండుగలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ.. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలపై ఎన్నో విలువైన సూచనలు చేస్తుంటారు రేణు దేశాయ్. తనకు వీలున్నప్పుడల్లా తీర్ధయాత్రలకు వెళ్తుంటారు. ముఖ్యంగా వారణాసికి క్రమం తప్పకుండా వెళ్తూ.. శివయ్య సేవలో తరిస్తుంటారు. తనకు కష్టంలో, సుఖంలో శివుడు తోడుగా ఉంటాడని పలుమార్లు తెలిపారు రేణు. అలాగే సన్యాస దీక్షపైనా వ్యాఖ్యలు చేసి అప్పట్లో కలకలం రేపారు ఈ నటి.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రేణు దేశాయ్ తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఓ ఆలయాన్ని సందర్శించిన రేణు... దానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. ఆ ఆలయంలో కూర్చొని అద్భుతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఆమె కనిపించారు. అలాగే మనశ్శాంతి అనేది ఓ స్వాభావిక గుణమా అని అంతా ఆలోచిస్తున్నారు. అయితే భౌతికపరమైన విషయాల వెనుక పరిగెడుతూ మనం దానిని కోల్పోయామా అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











