F**k అంటూ నెటిజన్ దారుణంగా ట్రోలింగ్.. రేణుదేశాయ్ ఏలా గడ్డిపెట్టిందో తెలుసా?

టాలీవుడ్ నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ప్రస్తుతం రైతుల గురించి ఓ డాక్యుమెంటరీ రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీలోని కర్నూల్ జిల్లాలో పర్యటించారు. కరువు బారిన పడిన పలువురు రైతులను కలిసి వారి బాధలను పంచుకొన్నారు. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్‌ని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఓ వ్యక్తి దారుణమైన కామెంట్ చేశారు. దాంతో రేణు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

సెలబ్రిటీలు డబ్బు కోసం తప్ప

సెలబ్రిటీలు డబ్బు కోసం తప్ప

రేణుదేశాయ్‌ని టార్గెట్ చేస్తూ ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ వ్యక్తి.. నేను ఓ రైతు కుటుంబానికి చెందిన వాడిని. 20 ఏళ్లుగా నేను వ్యవసాయం చేస్తున్నాను. f**k మీరు రైతులకు ఏం చేశారు. ఏమీ చేయలేదు. కేవలం ముఖానికి రంగు వేసుకొని డబ్బుల కోసం కెమెరా ముందు డ్రామాలు చేయడం తప్ప అని తీవ్రమైన పదజాలంతో ట్రోల్ చేశాడు.

 రేణు దేశాయ్ ఘాటుగా రిప్లై

రేణు దేశాయ్ ఘాటుగా రిప్లై

తనను ఉద్దేశించి ట్రోల్ చేసిన వ్యక్తిపై రేణుదేశాయ్ స్పందిస్తూ.. ఈ పోస్టు మీరు ఖచ్చితంగా చదువుతారని అనుకొంటాను. ఒక సెలబ్రిటీ F అనే పదాన్ని సోషల్ మీడియాలో ఒక అభిమానిపై వాడితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో అర్థం చేసుకోవచ్చు.

దారుణంగా దూషిస్తారా?

దారుణంగా దూషిస్తారా?

ఒకవేళ అలాంటి F అనే పదాన్ని వాడితే బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. నిర్దయగా చాలా దారుణంగా ఆ సెలబ్రిటీని ట్రోల్ చేస్తారు. అతి దారుణంగా దూషిస్తారు. అదే పదాన్ని సెలబ్రిటీలపై మాములు వ్యక్తి వాడితే ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ స్పందించరు. సెలబ్రిటీ అయితే ఇంత దారుణమా అని రేణుదేశాయ్ ప్రశ్నించారు.

సెలబ్రిటీలైతే భరించాలా?

సెలబ్రిటీలైతే భరించాలా?

సమాజంలో ఇది ఏంటి? అంటే ఒక సెలబ్రిటీని ఎవరు పడితే వాల్లు ఏది పడితే అది అనొచ్చు, దూషించవచ్చు. అలాంటి వాటిని సెలబ్రిటీలు భరించాలి... సహించాలి. ఎలాంటి భావోద్వేగానికి గురికాకుడదు. అంటే మాములు మనుషులకు భావాలు, భావోద్వేగాలు ఉంటాయి. సెలబ్రిటీలకు భావోద్వేగాల ఉండకూడదా? అని రేణుదేశాయ్ అని అన్నారు.

మిమ్మల్ని ట్రోల్ చేస్తే పరిస్థితి ఏంటి?

మిమ్మల్ని ట్రోల్ చేస్తే పరిస్థితి ఏంటి?

ప్రతీ రోజు మీ సోషల్ మీడియాలో ఎవరో ఒకరు ఏదో రకంగా మిమ్మల్ని దూషిస్తూ ఎవరో ఒకరు పోస్టులు పెడుతూ ఉంటే వాటిని చదువుతున్నప్పుడు మీకు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. రైతులకు ఏదో రకంగా సహాయపడాలని నేను చేస్తున్న ప్రయత్నాన్ని విమర్శిస్తూ నన్ను దూషించడం మరీ దారుణం అని రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు.

మంచి పని కోసం ప్రయత్నించాలని సలహా

మంచి పని కోసం ప్రయత్నించాలని సలహా

నేను డబ్బు కోసం చేస్తున్నానా లేక పేరు కోసం చేస్తున్నానా లేదా ఇంకేదైనా కారణం కోసం చేస్తున్నానా అనేది ముఖ్యం కాదు. దాని వల్ల మన రైతుల సమస్యలు ఎంత వరకు బయటికి తీసుకొచ్చి ప్రజల ముందు పెడుతున్నామన్నది ముఖ్యం. ఊరు పేరు లేని ట్రోల్ చేసే వాళ్లంతా ఏదో ఒక రోజు వారి తప్పు తెలుసుకోవాలి. ఇలా వారి శక్తి సామర్థ్యాలు అనవసరంగా సెలబ్రిటీలను దూషించడం కోసం పెట్టకుండా ఏదన్నా మంచి పని కోసం పెడితే మంచిది అని రేణు దేశాయ్ సలహా ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X