లవ్ కాంప్లికేటేడ్.. బ్రేకప్ చాలా దారుణం.. ఆ బాధ నుంచి ఎలా బయటపడ్డానంటే.. రేణుదేశాయ్

సోషల్ మీడియా అందుబాటులోకి రావడం వల్ల సెలబ్రిటీలు తమ అభిమానులకు, సన్నిహితులకు సులభంగా చేరువ అవుతున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ పరిస్థితుల్లో సోషల్ మీడియా బలం ఏమిటో తెలిసి వచ్చింది. పలు సోషల్ మీడియా వేదికలపై సెలబ్రిటీలు స్పందిస్తూ.. ఆర్థిక, సామాజిక, మానసిక విషయాలను చర్చిస్తున్నారు. తాజాగా లాక్‌డౌన్ సమయంలో రేణుదేశాయ్ తన అభిమానులతో లైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సమయంలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. రేణుదేశాయ్ చెప్పిన విషయాలు మీ కోసం..

లవ్, బ్రేకప్ గురించి చెప్పడం చాలా

లవ్, బ్రేకప్ గురించి చెప్పడం చాలా

లవ్ అనే పదం చాలా కాంప్లికేటేడ్. దానికి రకరకాల ఉద్దేశాలు, అభిప్రాయాలు ఉంటాయి. లవ్ బ్రేకప్ అనేది ఒక్కొ వ్యక్తికి ఒక రకంగా ఉంటుంది. మనకు ఇలాంటి ఎమోషన్స్ గురించి ఫ్యామిలీ గానీ, స్కూల్‌లో నేర్పించరు. రకరకాల చరిత్రల గురించి చెబుతారు కానీ భావోద్వేగాలను ఎలా డీల్ చేయాలో అనే విషయం గురించి చెప్పరు. మనకు సరిపడని వ్యక్తితో జీవించి విడిపోతే ఆ బాధ గురించి చెప్పలేం అని రేణుదేశాయ్ అన్నారు.

 మానసికంగా బలంగా ఉండాలి

మానసికంగా బలంగా ఉండాలి

లవ్ బ్రేకప్ అనేది చాలా కష్టమైన ఫీలింగ్. దానిని తట్టుకోవాలంటే చాలా మానసిక ధృడత్వం ఉండాలి. మనకు డాక్టర్లు, మానసిక వైద్యులు ఉన్నప్పుడు కూడా అలాంటి నుంచి బయటపడాలంటే మన వంతుగా మనం కృషి చేయాలి. ఆ బాధ నుంచి నేను బయటపడ్డాను. మనిషిని ఇలాంటి సంఘటనలు మానసిక క్షోభకు గురిచేస్తాయి. వాటి నుంచి బయటపడటానికి మనంతటా మనమే ప్రిపేర్ కావాలి అని రేణుదేశాయ్ తెలిపారు.

మానసికంగా డీలా పడొద్దు

మానసికంగా డీలా పడొద్దు

మనకు ఏదైనా జరగకూడని విషయం జరిగితే దాని గురించి చాలా ఆలోచిస్తాం. పదే పదే ఆలోచించడం ద్వారా మానసికంగా మనం చాలా డీలా పడిపోతాం. అలా ఆలోచించకుండా వేరే విషయాలపైన దృష్టి పెట్టాలి. పాజిటివ్ విషయాలపైన దృష్టిపెట్టాలి. మనకు ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడాలి. ఆహారంపై దృష్టిపెట్టాలి. అలాంటి విషయాలపైన దృష్టిపెడితే మెంటల్ బ్యాలెన్స్ ఏర్పడుతుంది అని రేణుదేశాయ్ అన్నారు.

సోషల్ మీడియాలో నెగిటివిటీ

సోషల్ మీడియాలో నెగిటివిటీ

నెగిటివిటీ ఎదుర్కోవడం చాలా కష్టం. ఇలాంటి విషయాన్ని ఎదురించడం నాకే కష్టం. సోషల్ మీడియాలో ఇలాంటి ఎక్కువగా జరుగుతుంటాయి. అలాంటి వాటిని అక్కడే వదిలేయాలి. మీ ఖర్మ అంటూ వదిలేస్తే.. ఏదో ఒక రోజు నిజం బయట పడుతుంది. అంతేగానీ నెగిటివిటి గురించి ఆలోచిస్తూ.. వాటికి సమాధానాలిస్తే ఇంకా సమస్య జఠిలమవుతుంది అని రేణుదేశాయ్ తెలిపారు.

కులం వల్లే ఆ సమస్యలు

కులం వల్లే ఆ సమస్యలు

కులం వల్లే అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. సమాజంలో కులం బలంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రేమ వైఫల్యాలకు ప్రధాన కారణం ప్రేమనే కారణమవుతుంది. కులాన్ని ఎదురించాలంటే మనలో మార్పులు రావాలి. అబ్బాయి, అమ్మాయిల మధ్య ప్రేమను వారి ఆలోచన విధానాన్ని పెద్దలకు చెప్పి ఒప్పించాలి అని రేణుదేశాయ్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X