twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా పిల్లల్లో ఉన్నది పవన్ రక్తం కాదు: నెటిజన్ ప్రశ్నకు రేణు దేశాయ్ సమాధానం ఇదీ.!

    By Manoj
    |

    రేణు దేశాయ్.. ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరు అని చెప్పవచ్చు. దీనికి కారణం ఆమె టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను పెళ్లాడడమే. పూరీ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'బద్రి' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. ఆ సినిమా సమయంలోనే పవన్‌తో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వీళ్ల వివాహం అవడం.. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టడం జరిగిపోయాయి. అయితే, కొన్నేళ్ల క్రితం ఈ జంట విడిపోయింది. తాజాగా రేణు దేశాయ్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇవి ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి.

    విడాకుల తర్వాత స్వతంత్ర జీవితం

    విడాకుల తర్వాత స్వతంత్ర జీవితం

    పవన్ కల్యాణ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్.. స్వతంత్ర జీవితం గడుపుతున్నారు. ఆమె హైదరాబాద్ నుంచి పుణె షిప్ట్ అయిపోయారు. అక్కడే తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలోనే పలు అంశాల వల్ల ఆమె తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో తెలుగు వాళ్లకు గుర్తుండిపోయారు.

    పవన్ ఫ్యాన్స్ నుంచి బెదిరింపులు

    పవన్ ఫ్యాన్స్ నుంచి బెదిరింపులు

    రేణు దేశాయ్.. పవన్ కల్యాణ్‌తో విడాకులు తీసుకున్నప్పటికీ.. ఆయన అభిమానులు మాత్రం ఇప్పటికే వదిన అనే పిలుస్తుంటారు. ఇప్పటికీ ఆమెను సోషల్ మీడియాలో ఇలాగే అంటుంటారు. కొద్ది రోజుల కిందట ఈ విషయమై రేణు సీరియస్ అయ్యారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆమెపై ఫైర్ అయ్యారు. ఆ సమయంలో ఆమెకు బెదిరింపులు కూడా వచ్చాయన్న టాక్ వినిపించింది.

    మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధం

    మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధం

    గత ఏడాది రేణు దేశాయ్ ఓ వ్యక్తితో నిశ్చితార్థం చేసుకున్నారు. తనకు భర్త అవసరం లేకున్నా.. పిల్లలకు మాత్రం తండ్రి కావాలనే ఉద్దేశ్యంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. తాను చేసుకోబోయే వ్యక్తి తనను ఎంతగానో అర్థం చేసుకున్నాడని చెప్పారు. కానీ, ఆ వ్యక్తి ఎవరన్న విషయాన్ని మాత్రం ఆమె బయట పెట్టలేదు.

    వాళ్లిద్దరి ఫొటోను షేర్ చేశారు

    వాళ్లిద్దరి ఫొటోను షేర్ చేశారు

    రేణు దేశాయ్‌కు తన పిల్లలంటే ఎంతో ఇష్టం అన్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె తన పిల్లల ఫొటోలు పోస్ట్ చేశారు. అందులో అకీరా.. తన చెల్లి ఆధ్యను ఎత్తుకుని ఉన్నాడు. అంతేకాదు ‘‘1 2 3 అని లెక్కబెట్టే లోపు నీ ముందు ఉంటాను. ఇద్దరు క్రేజీ ఫెల్లోస్.. వారిద్దరికి నేనున్నాను వారు నా సొంతం'' అని అందులో రాసుకొచ్చారు.

    ఎంతైనా పవన్ రక్తం కదా

    రేణు దేశాయ్ షేర్ చేసిన ఈ ఫొటోకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. చాలా మంది పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ అభిమాని అయిన ఓ నెటిజన్ ‘ఫొటో చాలా బాగుంది. ఎంతైనా పవన్ రక్తం కదా' అనే అర్థం వచ్చేలా కామెంట్ చేశాడు. దీంతో ఈ ఫొటో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

     నా పిల్లల్లో ఉన్నది పవన్ రక్తం కాదు

    నా పిల్లల్లో ఉన్నది పవన్ రక్తం కాదు

    నెటిజన్ చేసిన కామెంట్‌కు రేణు దేశాయ్ ఘాటుగా స్పందించారు. ‘మీకు సెన్స్ సరిగా పని చేస్తుందో లేదో తెలియడం లేదు. టెక్నికల్‌గా చెప్పాలంటే వాళ్లిద్దరిలో ఉన్నది నా రక్తం. సైన్స్ పరంగా చూస్తే ఆ విషయం మీకే అర్థం అవుతుంది' అని ఆమె ఫైర్ అయింది. దీంతో రేణుకు మద్దతుగా చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

    English summary
    Renu Desai is a Gujarati. She has a son, born in 2004 with Tollywood actor Pawan Kalyan, whom she married in 28 January 2009. The couple also has a daughter born in 2010. They have reportedly filed for divorce as of 2011.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X