For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Renu Desaiకు షాకిచ్చిన కుర్రాళ్లు: షాకింగ్‌గా సెల్ఫీ వీడియో.. ప్రాణాలు పోతాయంటూ వార్నింగ్

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తుంటారు. కానీ, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే ఎనలేని గుర్తింపును అందుకుంటారు. అందులోనూ కొందరైతే రెండు మూడు సినిమాలు చేసినా.. తమ తమ వ్యవహార శైలితో ఎక్కువ ఫేమస్ అవుతుంటారు. అలాంటి వారిలో రేణు దేశాయ్ ఒకరు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను వివాహం చేసుకోవడం వల్లే ఆమె పాపులర్ అయ్యారు. ఇక, ఆయనకు విడాకులిచ్చిన తర్వాత కూడా ఏదో రకంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రేణు దేశాయ్‌కు కొందరు షాకిచ్చారు. అసలేం జరిగింది? వివరాల్లోకి వెళ్తే...

  ఆ సినిమాతో పరిచయం.. పెళ్లి కూడా

  ఆ సినిమాతో పరిచయం.. పెళ్లి కూడా

  పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘బద్రి' సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు రేణు దేశాయ్. ఆ సినిమా సమయంలో పవన్‌తో ప్రేమలో పడడం.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. ఈ గ్యాప్‌లోనే ఆమె ‘జేమ్స్ పాండూ' అనే తమిళ చిత్రంతో పాటు ‘జానీ'లో నటించారు. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైపోయారు.

   ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకుంటూ

  ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకుంటూ

  హీరోయిన్‌గా కేవలం మూడు సినిమాల్లోనే నటించారు రేణు దేశాయ్. కానీ, పలు విభాగాల్లో పని చేస్తూనే వచ్చారు. తద్వారా ఆల్‌రౌండర్‌గా గుర్తింపును అందుకున్నారు. పవన్ కల్యాణ్ నటించిన పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేసిన ఆమె.. కొన్ని పాటలకు ఎడిటర్‌గానూ పని చేశారు. ఇలా పెళ్లైన తర్వాత కూడా ఆమె కొన్ని సినిమాలు చేసిన విషయం చాలా మందికి తెలియదు.

   డైరెక్షన్‌తో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు

  డైరెక్షన్‌తో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు

  పవన్‌తో విడిపోయిన తర్వాత పుణెలో ఉంటున్న రేణు దేశాయ్.. ‘ఇష్క్ వాలా లవ్' అనే మరాఠీ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు ఆమె నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ సినిమా అంతగా సక్సెస్ కాకపోవడంతో మరోసారి దర్శకత్వం వైపు చూడలేదు. కానీ, కొన్ని వెబ్ సిరీస్‌లు నిర్మించడానికి ప్రయత్నాలు చేశారు. అలాగే, సినిమాలు కూడా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోన్నారు.

  ఆ షోలో భాగం అయిన రేణు దేశాయ్

  ఆ షోలో భాగం అయిన రేణు దేశాయ్

  తెలుగులో వచ్చే ఎన్నో ప్రయోగాత్మకమైన షోలలో ‘డ్రామా జూనియర్స్' ఒకటి. నాలుగు సీజన్లు సూపర్ డూపర్ హిట్ అవడంతో ‘డ్రామా జూనియర్స్ - ద నెక్ట్స్ సూపర్ స్టార్' పేరిట ఐదో సీజన్‌ కూడా ఇటీవలే ప్రారంభమైంది. దీనికి ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి, సింగర్ సునీతతో కలిసి రేణు దేశాయ్‌ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఆమె ఇందులో స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నారు.

  ఎప్పుడూ అందులోనే... భారీగా క్రేజ్

  ఎప్పుడూ అందులోనే... భారీగా క్రేజ్

  రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్ సంబంధించిన విశేషాలను తరచూ ప్రస్తావిస్తుంటారు. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తున్నారు. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే రేణు దేశాయ్ కొన్ని లక్షల ఫాలోవర్లను సంపాదించారు.

  రేణు దేశాయ్‌కు షాకిచ్చిన నెటిజన్లు

  రేణు దేశాయ్‌కు షాకిచ్చిన నెటిజన్లు

  ఇండియాలో కరోనా వైరస్ ప్రభావం భారీగా పెరగడంతో.. ఏదైనా సమస్య ఉన్నవాళ్లు తన దృష్టికి తీసుకొస్తే.. ఏదొక సహాయం చేస్తానని రేణు దేశాయ్ ఇటీవల ప్రకటించారు. అందుకు అనుగుణంగానే పలువురు బాధితుల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆమెకు కొందరు నెటిజన్లు షాకిచ్చారు. దీంతో రేణు ఓ సెల్ఫీ వీడియోను షేర్ చేశారు.

  Renu Desai refutes rumours of Testing Positive for Coronavirus | Filmibeat Telugu
  ప్రాణాలు పోతాయంటూ గట్టి వార్నింగ్

  ప్రాణాలు పోతాయంటూ గట్టి వార్నింగ్

  తాజాగా షేర్ చేసిన సెల్ఫీ వీడియోలో ‘హాయ్.. అందరూ బాగున్నారా? క్విక్ లైవ్‌లోకి రావడానికి కారణం.. చాలా మంది నాకు హాయ్ హలో మెసేజ్‌లు పంపుతున్నారు. మీ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లు చేసే మెసేజ్‌లు కనిపించడం లేదు. దీని వల్ల చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. దయచేసి పిచ్చి పిచ్చి మెసేజ్‌లు చేయకండి. కష్టకాలంలో సహకరించండి' అంటూ రేణు వార్నింగ్ ఇచ్చారు.

  English summary
  Renu Desai is Very Active in Social Media. Recently She Shared a Selfie Video. In This Video She Gave Strong Warning to Netizens.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X