అన్ని లెక్కలు తేల్చుకుంటా .. రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ నటి, దర్శకురాలు, నిర్మాత రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న రేణు దేశాయ్, ఆ తరువాత కాలంలో తన మల్టీటాలెంట్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నటిగా మాత్రమే కాకుండా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా, నిర్మాతగా, దర్శకురాలిగా తనదైన ముద్ర వేశారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె, ఇప్పుడు ఆధ్యాత్మికత పరంగా, సామాజిక సేవ, జంతు సంరక్షణ వైపు అడుగులు వేస్తుంది. అయితే.. తాజాగా రేణు దేశాయ్ తన పాత ఇంటర్వ్యూపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఏం అన్నారంటే?

బద్రి, జానీ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రేణు దేశాయ్, ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. ఈ జంటకు అకీరా నందన్, ఆధ్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కాలక్రమంలో విభేదాలు రావడంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం రేణు దేశాయ్ పూర్తిగా సినిమాలకు దూరమై, తన వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టడంతో పాటు కాస్ట్యూమ్ డిజైనింగ్, నిర్మాణం, దర్శకత్వం వంటి రంగాల్లో తన ప్రతిభను చూపించారు.

Renu Desai s Moksha Comments Resurface Actress Reacts to Her Viral Spiritual Interview

కొన్నేళ్ల విరామం తర్వాత ఆమె టైగర్ నాగేశ్వరరావు సినిమాతో మళ్లీ తెరపైకి వచ్చారు. అయితే ఆ సినిమా తరువాత కూడా నటిగా కొనసాగడం కన్నా, తన జీవన తత్వం, ఆధ్యాత్మిక ప్రయాణంపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే రేణు దేశాయ్, జంతు సంరక్షణ, జీవన విలువలు, సమాజానికి సంబంధించిన అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. నిత్యం తన అభిమానులతో టచ్ లో ఉంటుంది.

గతంలో రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితం, కెరీర్, పిల్లలు, ఆధ్యాత్మికతపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ 'మరో జన్మ ఉంటే ఎలా పుట్టాలని ఉంది?'అని ప్రశ్నించగా, రేణు దేశాయ్ ఇచ్చిన సమాధానం అప్పట్లో సంచలనంగా మారింది. "నాకు మరో జన్మ వద్దు. నాకు మోక్షం లభిస్తుంది అనే విషయంలో నేను చాలా క్లియర్‌గా ఉన్నాను. ఈ జన్మలో ఉన్న అన్ని కర్మలు, అన్ని రుణానుబంధాలు సెట్ చేసుకుంటున్నాను. ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేస్తాను, రావాల్సి ఉంటే తీసుకుంటాను. ఎవరినైనా నేను హర్ట్ చేసి ఉంటే, నన్ను కూడా హర్ట్ చేయొచ్చు. ఏదైనా సరే... అన్ని లెక్కలు తేల్చేసుకుంటాను. నేను ఏ క్షణంలోనైనా చనిపోవచ్చు... మాట్లాడుతుండగానే హార్ట్ అటాక్ వచ్చి పోవచ్చు' అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి.

ఈ వ్యాఖ్యలపై అప్పట్లో భారీ స్పందన వచ్చింది. కొందరు ఆమె ఆధ్యాత్మిక ఆలోచనలను గౌరవిస్తే, మరికొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా రేణు దేశాయ్ తన అభిప్రాయాలపై ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. తాజాగా ఆ పాత ఇంటర్వ్యూను గుర్తు చేస్తూ ఆమె మరోసారి స్పందించడం ఇప్పుడు మరోసారి వైరల్‌గా మారింది.

రేణు దేశాయ్ తాజాగా చేసిన కామెంట్‌లో.. 'డిసెంబర్ 31, 2025న ప్రసారమైన ఆ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా 'నాకు మోక్షం లభిస్తోంది' అనే కామెంట్స్ ప్రేక్షకులను ఆలోచింపజేశాయి. ఏడాది చివరి రోజున విడుదలైన ఆ ఇంటర్వ్యూ నాకు ఒక ప్రత్యేక అనుభవాన్ని ఇచ్చింది. నెటిజన్ల నుంచి భారీ ప్రశంసలు అందుకున్నాను' అంటూ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలతో ఆ ఇంటర్వ్యూ క్లిప్స్ మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పుడూ ఈ కామెంట్స్ ఎందుకు చేసింది అనే హాట్ టాపిక్ గా మారింది. ఎవర్ని టార్గెట్ చేసి ఈ కామెంట్స్ చేసింది? అని చర్చనీయంగా మారింది. ఇలా మరోసారి రేణు దేశాయ్... వార్తల్లో నిలవడం విశేషం.

More from Filmibeat

Read more about: renu desai pawan kalyan tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X