‘వాళ్లు అడిగితే మంచం ఎక్కాల్సిందే... సుఖం కోసం స్టార్ హీరోయిన్‌ని దారుణంగా’
చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవకాశాలు పేరుతో మహిళా నటుల్ని ట్రాప్ చేసి వారిపై లైంగిక దాడులకు పాల్పడుతూ జీవితాల్ని నాశనం చేస్తున్నారు. ఇండస్ట్రీలో జరిగే చీకటి బాగోతాలపై నిత్యం ఎవరో ఒకరు పెదవి విప్పుతూనే ఉన్నారు. పైకి పెద్ద మనుషుల్లా చెలామణీ అవుతున్న వారి బాగోతాలను బయటపెడుతూనే ఉన్నారు. తాజాగా చిత్ర పరిశ్రమలోని క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఓ సీనియర్ నటి. కొత్తగా వచ్చేవారే కాదు.. ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉంటున్నవారికి, బడా ఫ్యామిలీల నుంచి వచ్చిన అమ్మాయిలకు కూడా వేధింపులు తప్పలేదని ఆమె బాంబు పేల్చింది. ఈ వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు రేణుకా షహానే. ప్రముఖ నటుడు అశుతోష్ రాణా సతీమణియే ఈ రేణుకా. ముంబైలో పుట్టి పెరిగిన ఈ విలక్షణ నటి... సురభి నాటకాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. దూరదర్శన్‌లోనూ సీరియల్స్‌తో పాటు పలు కార్యక్రమాల్లో నటించారు. 1980వ దశకంలో దూరదర్శన్‌లో స్టార్‌డమ్ అందుకున్నారు. 1988లో తమాచా అనే హిందీ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. హమ్ ఆప్కే కౌన్ హై, మౌసమ్, ఏక్ అలగ్ మ్యూజియం, రిటా, సన్ జర్రా, హైవే, బకెట్ లిస్ట్, గోవింద నామ్ మేరా, దేవ్ మానస్ తదితర చిత్రాల్లో నటించారు. ఇక తెలుగులో రామ్ గోపాల్ వర్శ దర్శకత్వంలో మనీ, మనీ మనీ సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు.

ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమలోని చీకటి కోణాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు రేణుక. కెరీర్ తొలినాళ్లలోనే లైంగిక వేధింపులకు గురయ్యానని తెలిపారు. నటిగా గుర్తింపు తెచ్చుకుని ఎదుగుతున్న దశలో ఓ నిర్మాత మా ఇంటికి వచ్చి.. తనను ఓ చీరల కంపెనీకి బ్రాండవ్ అంబాసిడర్‌గా ఉండమని అడిగాడు. ఆ మాటలతో సంతోషించే లోపు బాంబు పేల్చాడు. ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటానికి నెలకు కొంత మొత్తం స్టైఫండ్ కూడా ఇప్పిస్తానని అయితే నీకు ఇంత చేసినందుకు ప్రతిఫలంగా తనతో కలిసుండాలని ప్రతిపాదించాడు. ఆ మాటలతో నేను, మా అమ్మ నిర్ఘాంతపోయామని రేణుక తెలిపారు.
తాను మరో మాట లేకుండా.. ఆ ఆఫర్‌ను తిరస్కరించా. దాంతో సదరు నిర్మాత మర నటి వద్దకు వెళ్లి అదే ప్రతిపాదన చేశాడు. కానీ ఇలా ముక్కుసూటితనంతో ముఖం మీదే చెబితే.. ఇలాంటి శక్తివంతమైన వ్యక్తులు మనకు అడుగడుగునా ఇబ్బందులు సృష్టిస్తారు. అలాంటి వారిని ఎదుర్కొంటూ పరిశ్రమలో నిలబడటం అంత ఈజీ కాదు. పగతో రగిలిపోతూ... మనకి అవకాశాలు రాకుండా చేస్తారు. దేవుడి దయ వల్ల నాకు అలా జరగలేదు.. ఒక్కోసారి రావాల్సిన పారితోషికాన్ని కూడా రాకుండా అడ్డుకుంటారు. కానీ చాలా మందికి ఇలా జరిగిన ఉదంతాలు ఉన్నాయని రేణుక అన్నారు.
కొత్తగా వచ్చే అమ్మాయిలే కాదు.. ఆల్రెడీ హీరోయిన్లుగా నిరూపించుకున్న వారు.. బడా ఫ్యామిలీల నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టే వారిని ఈ ఫాసిస్ట్ క్లబ్స్ వదలవు. బలమైన సినీ నేపథ్యం నుంచి వచ్చిన రవీనా టాండన్ వంటి హీరోయిన్స్ కూడా ఇలాంటి వారికి భయపడ్డారు. ఔట్‌డోర్ షూటింగ్స్ ఉన్నప్పుడు మేమిద్దరం గదులు మార్చుకునేవాళ్లం. ఎందుకంటే రాత్రిపూట నటులు, నిర్మాతలు, దర్శకులు వంటి వారు హీరోయిన్లు బస చేసే గదుల తలుపులు కొట్టేవారు, ఎంతగా తప్పించుకోవాలని చూసినా సాధ్యం అయ్యేది కాదు అని రేణుక పేర్కొన్నారు. దాంతో ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











