రియా‌ చక్రవర్తిని వెంటాడుతున్న అరెస్ట్ భయాలు.. ఒక్కోరోజుకు లాయర్ ఫీజు ఎంతంటే!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వెనుక వాస్తవాలు బయటపెట్టాలని కోరుతూ ఆయన తండ్రి కేకే సింగ్ బీహార్‌లోని పాట్నాలో రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన తర్వాత ఒక్కసారి పరిస్థితుల్లో అనూహ్య మార్పులు సంభవించాయి. రియా చక్రవర్తిపై అనేక అనుమానాలు వ్యక్తమవ్వడం, బీహార్ పోలీసులు విచారించడానికి ముంబైలో ఆమె నివాసానికి వెళ్లడంతో వాతావరణం వేడెక్కింది.

ఈ క్రమంలో రియా అరెస్ట్‌ను తప్పించుకోవడానికి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రియా తరఫు వాదిస్తున్న లాయర్ గురించి చర్చ జరగడమే కాకుండా ఒక్కసారిగా మీడియాలో హైలెట్ అయ్యారు. ఇంతకు రియా లాయర్ ఎవరు? ఆయన ఈ కేసులో ఎంత ఫీజు వసూలు చేస్తున్నారనే విషయాలు చర్చకు వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే..

రియాను వెంటాడుతున్న అరెస్ట్ భయాలు

రియాను వెంటాడుతున్న అరెస్ట్ భయాలు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసిన రియా చక్రవర్తికి ఇప్పుడు అరెస్ట్ భయాలు వెంటాడుతున్నాయి. సుశాంత్ సింగ్ మరణం తర్వాత రియా చక్రవర్తి కలిసిన వ్యక్తులు, అనుసరిస్తున్న తీరు అనేక అనుమానాలు వ్యక్తమయ్యేలా చేశాయి. సుశాంత్ తండ్రి పిటిషన్ నేపథ్యంలో ఆమెను విచారించేందుకు బీహార్ పోలీసులు వెంటాడుతున్నారు. ఈ క్రమంలో ముంబైలోని ప్రముఖ లాయర్ సతీష్ మానెషిండే‌ను నియమించుకోవడం చర్చనీయాంశమైంది.

రియా చక్రవర్తి లాయర్ ఎవరంటే

రియా చక్రవర్తి లాయర్ ఎవరంటే

ముంబైలో లీడింగ్ లాయర్ సతీష్ మానెషిండే విషయానికి వస్తే.. ముంబై బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ అరెస్ట్ తర్వాత బెయిల్ కోసం తన వాదనలు వినిపించారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సల్మాన్ ఖాన్‌ను కాపాడటానికి సతీష్ మానెషిండే తన వంతు ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా ఇటీవల సంచలనం రేపిన పాల్గార్ సాధువుల హత్య కేసులో ఆయన న్యాయపోరాటం చేశారు. తాజాగా రియా చక్రవర్తి తన కేసులో లాయర్‌గా నియమించుకోవడంతో మళ్లీ మీడియాలో ప్రముఖంగా మారారు.

ముంబైలోని టాప్ లాయర్‌తో రియా

ముంబైలోని టాప్ లాయర్‌తో రియా

బీహార్ పోలీసులు ముంబైలో అడుగుపెట్టారనే విషయం తెలియగానే రియా చక్రవర్తి అప్రమత్తమయ్యారు. కొందరు లాయర్లతో తన నివాసంలో మంతనాలు జరిపారు. ఈ క్రమంలో రియా ఇంటికి సతీష్ మానెషిండే సహాయకురాలు ఆనందిని ఫెర్నాండేజ్ వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. రియా ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో బ్యాగుల నిండా డబ్బు నింపుకొని వెళ్లారనే ఫోటోలు మీడియాలో, సోషల్ మీడియాలో కనిపించాయి.

ఒక్కో రోజుకు రూ.10 లక్షల ఫీజు?

ఒక్కో రోజుకు రూ.10 లక్షల ఫీజు?

ఇక సుశాంత్ కేసు తన మెడకు చుట్టుకొనే అవకాశాలు పెరిగిపోవడంతో భారీ ఫీజు ఇచ్చేందుకు సిద్ధపడి సతీష్ మానెషిండేను లాయర్‌గా నియమించుకొన్నారు. ఆయన ప్రతీ రోజుకు 10 లక్షల రూపాయల ఫీజుతో కేసును వాదించడానికి ఒప్పందం కుదుర్చుకొన్నట్టు బాలీవుడ్ మీడియా కథనాలు వెల్లడించింది.

Recommended Video

Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
సీబీఐకి అప్పగింతకు సుప్రీం నో

సీబీఐకి అప్పగింతకు సుప్రీం నో

ఇదిలా ఉండగా, సుశాంత్ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తులో లోపాలు ఉన్నాయంటూ సుశాంత్ కుటుంబ సభ్యులు దాఖలు చేసిన కేవీయట్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించే విషయంపై దాఖలు చేసిన పిటిషన్‌ను దేశ అత్యున్నత కోర్టు తోసిపుచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X