రియా చక్రవర్తి కనుసైగల్లోనే అన్నీ.. బీహార్ పోలీసులకు సుశాంత్ స్వీపర్ షాకింగ్‌గా
తమ విచారణలో భాగంగా బీహార్ పోలీసులు సుశాంత్ ఇంటిలో డెత్ సీన్‌ను రీ క్రియేట్ చేసినట్టు తెలిసింది. సుశాంత్ స్వీపర్ నుంచి కొన్ని విషయాలను సేకరించినట్టు సమాచారం. తన అనుమతి లేకుండా సుశాంత్ రూమ్‌లోకి ఎవరినీ అడుగుపెట్టనివ్వదనే విషయం స్వీపర్ విచారించగా బయటకు వచ్చింది. సుశాంత్ రూమ్ క్లీన్ చేయాలా? వద్దా అనేది రియా ఆదేశాల మేరకే చేయాల్సి వచ్చేదని స్పష్టం చేశారు. ఇంట్లో పనిచేసే సిబ్బందిని కలువకుండా రియా కట్టడి చేసేదని స్పష్టం చేశారు.
అయితే కొద్ది రోజులుగా కనిపించకుండా పోయిన రియా చక్రవర్తి పరారీలో లేదని ఆమె న్యాయవాది స్పష్టం చేశారు. రియా పరారీలో ఉన్నట్టు బీహార్ పోలీసులు చెబుతున్న వార్తలు నిజం కాదు. ముంబై పోలీసులు ఆమె స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. ముంబై పోలీసులు పిలిస్తే ఎప్పుడంటే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నారని సతీష్ మాన్ షిండే పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, ముంబైలోని బాంద్రా, పాలి హిల్‌లోని సుశాంత్ నివాసం మాంటే బ్లాంక్‌ను బీహార్ పోలీసులు, మీడియా సందర్శిస్తున్న సమయంలో ఇంటి వాచ్‌మెన్ అక్కడి నుంచి పారిపోయాడని తెలిసింది. జూన్ 13 పార్టీ జరిగిందని, జరగలేదని మీడియాకు పొంతన లేని సమాధానాలు చెప్పడం గమనార్హం.


Click it and Unblock the Notifications











