For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్‌బాస్‌లోకి రియా చక్రవర్తి.. ఆ సూపర్ స్టార్ అండతో ఎంట్రీ అంటూ...

  |

  వివాదాస్పద హీరోయిన్ రియా చక్రవర్తి మరోసారి పలు రకాలైన వార్తలతో మీడియాలో హెడ్‌లైన్స్‌గా మారుతున్నది. సారా ఆలీఖాన్, సుశాంత్ ఫ్యామిలీపై డ్రగ్స్ ఆరోపణలు చేసిన ఈ భామ వార్తల్లో నిలిచింది. ఇంకా ఆ వార్తలు కనుమరుగక ముందే మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్టులో టాప్‌గా షాకిచ్చింది. అంతేకాకుండా ఇప్పుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించే బిగ్‌బాస్‌ షోలో చేరబోతున్నట్టు వార్తలు ముంబై మీడియాలో గుప్పుమన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

  బిగ్‌బాస్ 15 ప్రారంభానికి సన్నాహాలు

  బిగ్‌బాస్ 15 ప్రారంభానికి సన్నాహాలు

  బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించే బిగ్‌బాస్ సీజన్ 14 కొద్ది నెలల క్రితమే గ్రాండ్‌గా ముగిసింది. టీవీ నటి రుబీనా దిలాయక్ బిగ్‌బాస్ 14 టైటిల్‌ను సొంతం చేసుకొన్నారు. ఆ షో అలా ముగిసిందో లేదో.. బిగ్‌బాస్ 15కు సన్నాహాలు ప్రారంభించారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలతో సంప్రదింపులు ముగిసాయనే విషయం హాట్ టాపిక్‌గా మారింది.

   భూమికా చావ్లా, ఇతర సెలబ్రిటీల పేర్లు

  భూమికా చావ్లా, ఇతర సెలబ్రిటీల పేర్లు

  బిగ్‌బాస్‌లోకి ఖుషీ ఫేమ్ భూమికా చావ్లా, టీవీ యాక్టర్ నేహా మర్దా లాంటి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తాము రియాలిటీ షోలో అడుగుపెడుతున్నట్టు వస్తున్న వార్తలపై భూమిక, నేహా, దివ్యాంకా త్రిపాఠి, వివేక్ దహియా, సనయా ఇరానీ, సురభీ చందనా, దిశా వాకానీ, ఇతర సెలబ్రిటీలు ఖండిస్తూ వస్తున్నారు. అయితే అలాంటి రూమర్లు ఆగడం లేదు. తాజాగా రియా చక్రవర్తి బిగ్‌బాస్ 15లో చేరుతున్నారనే ఊహాగానాలు జోరందుకొన్నాయి.

  రియా చక్రవర్తి ఎంట్రీపై ఊహాగానాలు

  రియా చక్రవర్తి ఎంట్రీపై ఊహాగానాలు

  అయితే ఇప్పటి వరకు రియా చక్రవర్తి బుల్లితెర మీద కనిపించలేదు. ఒకవేళ ఈ ఊహాగానాలు, రూమర్లు నిజమైతే టెలివిజన్‌ షోలో మొదటిసారి ప్రత్యక్షంగా కనిపించినట్టు అవుతుంది. అయితే ఈ వార్తలపై రియా చక్రవర్తి స్పందించకపోవడంతో ఈ వార్తలో నిజమెంత అనేది గందరగోళంగా మారింది. అయితే సల్మాన్ ఖాన్ అండతో చేరే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి.

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో

  ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో, అలాగే బాలీవుడ్‌తో డ్రగ్స్ మాఫియా సంబంధాలు అనే కేసులపై మరోసారి ఎన్సీబీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో బెయిల్‌పై ఉన్న రియా చక్రవర్తి ఉన్నందున ఏ మేరకు ఆమె ఈ షోకు అంగీకరిస్తుందనే విషయం ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది.

  తూనీగ తూనీగ అంటూ రియా చక్రవర్తి కెరీర్

  తూనీగ తూనీగ అంటూ రియా చక్రవర్తి కెరీర్

  రియా చక్రవర్తి కెరీర్ విషయానికి వస్తే.. ఎంఎస్ రాజు నిర్మాతగా రూపొందించిన తూనీగ తూనీగ అనే తెలుగు చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది. ఆ తర్వాత మేరే డాడ్ కీ మారుతి, సొనాలీ కేబుల్, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, బ్యాంక్ చోర్, జలేజీ చిత్రాల్లో నటించింది. చెహ్రే అనే చిత్రంలో విడుదల కావాల్సి ఉంది.

  English summary
  Bollywood Actress Rhea Chakraborty name pop up into Salman Khan' Bigg Boss season 15 probable list. Reprots suggest that She has been agreed to participate in this show. But Officially no news from any corner. Rhea has been facing allegations in Sushant Singh Rajput's death case.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X