సుశాంత్ మృతి తరువాత మొట్ట మొదటిసారిగా అలా కనిపించిన రియా.. అందరికీ థాంక్స్ అంటూ!
బాలీవుడ్ నటి రియా చక్రవర్తి తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది. అయితే ఇక్కడ కలిసి రాకపోవడంతో ఆమె బాలీవుడ్ వెళ్లి సెటిల్ అయిపోయింది. అయితే సుశాంత్ అనుమాస్పద మృతి నేపథ్యంలో చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంది. ఎట్టకేలకు ఆమె పని మొదలు పెట్టింది. ఆ వివరాలు
Recommended Video

జైలుకి కూడా వెళ్లి
తెలుగులో ఒకట్రెండు సినిమాల్లో నటించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ రియా చక్రవర్తి హీరోయిన్ గా కంటే సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ గానే ఎక్కువ ఫేమస్ అయింది. అయితే అతడు సూసైడ్ చేసుకున్న కేసులో అందరూ రియా హస్తం ఉందని అనుమానించారు. ఆ తరువాత డ్రగ్స్ కేసులో ఇరుక్కొని జైలుకి కూడా వెళ్లింది రియా చక్రవర్తి. జైలు నుంచి బయటకొచ్చిన తరువాత ఆమె సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా లేని ఆమె ఇప్పుడు కొంచెం యాక్టివ్ అయింది.

స్టూడియోలో డబ్బింగ్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో జైలుకు వెళ్లి వచ్చినప్పటి నుండి రియా చక్రవర్తి జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా సినిమాలకు
సంబంధించి రియా రెండేళ్ల పాటు తెరకు దూరంగా ఉంది. ఆ కేసు విషయంలో ఆమె మీద నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అవడంతో ఆమెకు ఎలాంటి సినిమాలు
రాలేదు. కానీ ఇప్పుడు రియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను పంచుకుంది, అందులో ఆమె ఒక స్టూడియోలో డబ్బింగ్ చెబుతోంది.

ఎప్పుడూ వదులుకోవద్దని
రియా చేతిలో స్క్రిప్ట్‌తో మైక్ ముందు నిలబడి ఉంది. ఈ సమయానికి సంబంధించిన వీడియోను రియా స్వయంగా తన టైమ్‌లైన్‌లో షేర్ చేసింది. ఆమె
మళ్ళీ తెర మీదకు రావడం వల్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోను షేర్ చేస్తూ, రియా "నిన్న, రెండు సంవత్సరాల పూర్తయిన
తర్వాత నేను తిరిగి వర్క్ కోసం వచ్చాను. నా కష్ట సమయాల్లో నాకు అండగా నిలిచిన వారందరికీ నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఏది జరిగినా,
సూర్యుడు ఎల్లప్పుడూ ప్రకాశిస్తాడు." ఎప్పుడూ వదులుకోవద్దని పేర్కొన్నారు.

యాక్టివ్‌గా మారి
ఇక వీడియోలో, రియా చక్రవర్తి బ్లాక్ సూట్‌లో కనిపిస్తుంది. అలాగే ఆమె ఓవర్‌సైజ్ కోటుతో పాటు ప్యాంటు ధరించింది.ఇక రియా గత కొంతకాలంగా సోషల్
మీడియాలో చాలా యాక్టివ్‌గా మారింది. సుశాంత్ దూరం అవడంతో చాలా కాలం పాటు నుంచి డిప్రెషన్ లో ఉన్న ఆమె మెల్లగా బయటపడి తన జీవితాన్ని
మళ్ళీ ప్రారంభించింది.

ప్రసంసల వర్షం
రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో చిక్కుకుని డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లినప్పటి నుండి, అది ఆమె జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. కొన్ని
రోజుల క్రితం, రియా ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త మోనోక్రోమ్ ఫోటోను షేర్ చేసింది, అందులో రియా చాలా స్టైలిష్‌గా కనిపించింది. ఆమె పెయింటింగ్ ముందు
పోజులిచ్చింది. ఆ ఫొటోలో ఆమె జుట్టు చెదిరిపోయినట్టు కనిపిస్తుంది. రియా బాడీ టైట్ ట్రౌజర్ మరియు నెట్ టాప్‌లో రియా అద్భుతంగా కనిపించింది.
రియా కి సంబంధించిన ఈ ఫోటో చాలా అందంగా కనిపించింది. ఆమె అభిమానులు కూడా ఆమె ఫోటో మీద కామెంట్లతో ప్రసంసల వర్షం కురిపించారు.


Click it and Unblock the Notifications











