twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రియా చక్రవర్తికి కోర్టు మరో షాక్.. సెప్టెంబర్ 29 వరకు నిరీక్షణే

    |

    డ్రగ్ కేసులో అరెస్టైన తనకు బెయిల్ ఇవ్వాలంటూ బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం బాంబే హైకోర్టు విచారించింది. అయితే ముంబైని భారీ వర్షాలు ముంచెత్తినందున పిటిషన్‌పై నిర్ణయం తీసుకోలేమని, బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును సెప్టెంబర్ 29వ తేదీకి వాయిదా వేసింది. దాంతో సెప్టెంబర్ 29 వరకు రియా బెయిల్ కోసం బైకుల్లా జైలులోనే నిరీక్షించాల్సి వస్తున్నది.

    బెయిల్ కోసం పలుమార్లు పిటిషన్ దాఖలు చేయగా ప్రత్యేక కోర్టు రెండుసార్లు తిరస్కరించిన విషయం తెలిసిందే. బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరిస్తూ అక్టోబర్ 6వ తేదీ వరకు జుడిషియల్ కస్టడీలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    Rhea Chakrabortys bail plea rescheduled to September 29 by Bombay high court

    కోర్టు ఆదేశాలకు అనుగుణంగా రియా విచారణ జరగడం లేదు. ఆమెను విచారించేటప్పుడు మహిళా కానిస్టేబుల్ ఉండాలనే నిబంధనను పాటించడం లేదు. వాస్తవానికి ఎన్సీబీ విచారణ చట్ట వ్యతిరేకం అని 47 పేజీలతో కూడిన బెయిల్ పిటిషన్‌లో ఆమె తరఫు న్యాయవాది సతీష్ మాన్‌షిండే పేర్కొన్నారు.

    ఇదిలా ఉండగా, రియా చక్రవర్తిని విచారించగా వెల్లడించిన సమాచారం మేరకు రకుల్ ప్రీత్ సింగ్‌కు సమన్లు జారీ చేశారు. రియా మేనేజర్ జయ సాహా వాట్సాప్ ఛాట్ ఆధారంగా సారా ఆలీ ఖాన్, దీపిక పదుకోన్, శ్రద్దాకపూర్‌కు కూడా సమన్లు జారీ చేసి విచారణకు పిలువడం సంచలనంగా మారింది.

    English summary
    Bollywood heroine Rhea Chakraborty's bail plea rescheduled to September 29. Due to heavy rains in mumbai, Court has taken decision to give its opinion. Till then, the Rhea Chakraborty is to remain in judicial custody in Byculla jail in Mumbai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X