సుశాంత్ తండ్రిపై రియా చక్రవర్తి ఎదురుదాడి.. చంపేస్తాం.. రేప్ చేస్తామని బెదిరింపులు అంటూ
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్ రియా చక్రవర్తి ఎదురుదాడిని ప్రారంభించారు. తనపై సుశాంత్ తండ్రి చేసిన ఆరోపణలు తిప్పికొట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే పాట్నాలో సుశాంత్ తండ్రి కేకే సింగ్ దాఖలు చేసిన కేసును ముంబైకి బదిలీ చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కేకే సింగ్ ఫిర్యాదుపై రియా చక్రవర్తి కోర్టుకు తెలియజేస్తూ చేస్తూ..
Recommended Video

నాపై ఆరోపణలన్నీ అవాస్తవాలే
కేకే సింగ్ చేసిన ఆరోపణలపై రియా చక్రవర్తి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. నాతోపాటు మరో ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాము ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగాన్ని మోపారు. నాపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే. నాపై సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ తప్పుడు ఆరోపణలు చేశారు అని సుప్రీంకోర్టుకు వెల్లడించారు.

నా ప్రాణాలకు ముప్పు
సుశాంత్ తండ్రి అసత్యపు ఆరోపణలతో కేసు నమోదు చేయడం వల్ల నా ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. నాకు చాలా మంది చంపేస్తామని హెచ్చరిస్తున్నారు. నన్ను రేప్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. సుశాంత్ మరణంతో తీవ్ర విషాదంలో కూరుకుపోయి ఉన్నాను. ఇలాంటి సమయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసి మీడియా నన్ను వెంటాడేలా చేశారు అని రియా చక్రవర్తి పేర్కొన్నారు.

అప్పటి వరకు సుశాంత్‌తో సహజీవనం
జూన్ 8వ తేదీ వరకు సుశాంత్‌తో సహజీవనం చేశాను. ఆ సమయంలో సుశాంత్ తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. తనతో ఉన్నప్పుడు డిప్రెషన్‌ను దూరం చేసే మెడిసిన్స్ వాడుతున్నారు. ఇలాంటి విషయాలు ఏమీ తెలియకుండా నాపై సుశాంత్ తండ్రి తప్పుడు సమాచారంతో కేసు నమోదు చేశారు అని రియా సుప్రీంకోర్టుకు వెల్లడించారు.

ఆన్‌లైన్ ద్వారా సుప్రీంకోర్టులో
సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు నమోదైన కేసు గురించి రియా లాయర్ సతీష్ మానేషిండే స్పందించారు. తన క్లయింట్ ఆన్‌లైన్ ద్వారా పిటిషన్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. పాట్నా నుంచి ముంబైకి కేసు ట్రాన్స్‌ఫర్ చేయాలని కోర్టుకు నివేదించారు. ఇప్పటికే ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నందున పాట్నా కేసును కూడా ముంబైకి బదిలీ చేయమని వినతి పత్రం సమర్పించాం అని సతీష్ మానేషిండ్ తెలిపారు.

ముంబై పోలీసులకు రియా చక్రవర్తి ఫిర్యాదు
ఇదిలా ఉండగా, కేకే సింగ్ కేసు నమోదు చేసిన తర్వాత తన ప్రాణాలకు ముప్పు వాటిల్లిందని తెలుపుతూ ముంబైలోని శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్‌లో రియా చక్రవర్తి కేసు నమోదు చేశారు. తన ప్రాణ, మానాలకు ముప్పు వాటిల్లిందని తన ఫిర్యాదులో రియా పేర్కొన్నారు. కొద్ది రోజులు క్రితం తన కుమారుడి బ్యాంక్ అకౌంట్ల ద్వారా కోట్లాది రూపాయలు రియా దుర్వినియోగం చేశారని ఫిర్యాదు చేయడం మీడియాలో సంచలనం రేపింది.


Click it and Unblock the Notifications











