Rhea Chakraborty మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020.. రకుల్ ప్రీత్, రష్మిక మందన్నకు ఏ స్థానం అంటే!
దేశవ్యాప్తంగా 2020లో అత్యంత వివాదాస్పదంగా మారిన హీరోయిన్ రియా చక్రవర్తి ఇండియాలోనే మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020గా టైటిల్‌ను గెలుచుకొన్నారు. దేశంలో వివిధ రంగాల్లో అత్యంత ప్రతిభ చూపిన 40 మంది మహిళల కోసం జరిగిన ఆన్‌లైన్ పోల్‌లో అత్యధిక మందిని ఆకట్టుకొని ఈ ఘనతను రియా చక్రవర్తి సొంతం చేసుకొన్నది. ఈ వివరాల్లోకి వెళితే...
Recommended Video

సుశాంత్ మరణం కేసులో
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో అనుమానితురాలిగా, అలాగే సినిమా పరిశ్రమలో డ్రగ్స్ మాఫియా కేసులో ఈ భామ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాలో రియాకు అగ్రస్థానం దక్కడం ఇప్పుడు మీడియా, సినీ వర్గాల్లోను చర్చనీయాంశమైంది.

వివాదాలతో మీడియాలో టాప్‌గా
ఇక మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఎంపిక విధానంలోకి వెళ్తే.. ఫిజికల్ అప్పీయరెన్స్, గ్లామర్ మాత్రమే కాకుండా పర్సనాలిటీ, ఇంటెలెక్చువాలిటీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొంటారు. ఇక కెరీర్ పరంగా 2020లో పెద్దగా తన టాలెంట్‌ను ప్రదర్శించ లేకపోయినప్పటికి.. వివాదాలపరంగా మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించారు. రకరకాల వివాదాల కారణంగా సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ అయ్యారు.

వివాదాల నడుమ టైటిల్ గెలుచుకొన్న రియా
ఇటీవల కాలంలో కూడా రియా చక్రవర్తి తనపై పడిన మరకలను తుడిచి వేసుకొనేందుకు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇదే క్రమంలో సారా ఆలీఖాన్, సుశాంత్ సింగ్ ఫ్యామిలీపై తీవ్ర ఆరోపణలు చేయడంతో మళ్లీ మీడియాలోకి ఎక్కారు. వివాదాల నడుమ రియా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020గా ఎంపిక కావడం మరింత చర్చనీయాంశమైంది.

రకుల్, రష్మిక, కత్రినా కైఫ్‌కు స్థానం
ఇక మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020 జాబితాలో ప్రపంచ సుందరి పోటీలో నాలుగో స్థానంలో నిలిచిన మిస్ ఇండియా ఆడైన్ క్యాస్టెలైన్ రెండో స్థానంలో నిలిచారు. గతేడాది నంబర్ వన్ స్థానంలో నిలిచిన దిశా పటానీ మూడోస్థానానికి పడిపోయారు. కియారా అద్వానీ 4వ స్థానంలోను, దీపిక పదుకోన్ 5వ స్థానంలో, కత్రినా కైఫ్ 6వ స్థానంలో, జాక్వలైన్ ఫెర్నాండేజ్ 7వ స్థానంలో, శ్రద్దా కపూర్ 11వ స్థానంలో, రకుల్ ప్రీత్ సింగ్ 14వ స్థానంలో, యామీ గౌతమ్ 15వ స్థానంలో, అదితి రావు హైదరీ 16వ స్థానంలో, జాన్వీ కపూర్ 18, రష్మిక మందన్న 21వ స్థానంలో నిలిచారు.


Click it and Unblock the Notifications











