చప్పాపెట్టకుండా చెలికాడుతో చట్టాపట్టాలేస్తున్న మిర్చి పాప
లీడర్ సినిమాతో డాషింగ్ ఎంట్రీ ఇచ్చిన బొద్దుగుమ్మ రిచా గంగోపాధ్యాయ టాలీవుడ్ కొంతకాలం వరకూ మంచి ఆఫర్లతో బాగానే నెట్టువచ్చేసింది. టాప్ హీరోల సరసన ఆఫర్లు అందుకుంటూ గ్లామర్ షోతోనూ గట్టిగానే ఆకట్టుకుంది. కెరీర్ మాంచి ఊపులో ఉండగానే తట్టా బుట్టా సర్దేసుకుని చదువుల బాట పట్టిన రిచా, ఇన్నాళ్లకు మళ్లీ దర్శనమిచ్చింది.
ఏంటి మళ్లీ రిచా సిల్వర్ స్క్రీన్ పై మెరిసేందుకు సిద్ధమవుతోందా ఏంటి అని మరీ ఎగ్జైట్ అవ్వకండి. ఇటీవలే ట్విట్టర్ ఎంట్రీ ఇచ్చిన రిచా, ఓ మంచి వార్తతోనే ఆరంగేట్రం చేసింది. ఇంతకూ విషయం ఏమిటంటే రిచా ఇప్పుడు ఒక్కరు కాదు ఇద్దరట. అంటే అమ్మాయి తనకో తోడును వెతుక్కుంది. జీవితాంతం తనతో కలసి అడుగులేసే చెలికాడు చేయి అందుకుంది. అదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

నాలుగేళ్లుగా జాయ్ లాంగెల్లా అనే అబ్బాయితో డేటింగ్ చేస్తున్న రిచా, అతడిని పెళ్లాడినట్లు ఇటీవలే వెల్లడించింది. సినిమాలకు స్వస్తి పలికి ఎంబీయే పూర్తి చేసేందుకు అమెరికా వెళ్లిన రిచా, అక్కడే జాయ్ ను కలుసుకున్నట్లు తెలిపింది. ఇక తన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ రిచా పెట్టిన పోస్ట్ కు లైకులు మీద లైకులు పడుతున్నాయి.
ఏమైనా మొత్తానికి రిచా ఓ ఇంటిదయ్యేసరికి అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సొంత వ్యాపారం ప్రారంభించిన రిచా, అన్ని విధాలుగా జీవితంలో సెటిల్ అయిందనే చెప్పాలి. అమ్మడు ఇదే విధంగా హ్యాపీగా ఉండాలని కోరకుందాం.


Click it and Unblock the Notifications











