గదిలోకి రాకపోతే కెరీర్ ముగిసినట్లే.. సుశాంత్ పై కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా అంతే: స్టార్ హీరోయిన్
సినిమా ఇండస్ట్రీలో మీటూ ఉద్యమాలు ఎన్ని పుట్టుకొచ్చినా కూడా నటీమణులకు ఇబ్బందులు తప్పడం లేదు. అవకాశాల పేరుతో ఇంకా వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తూనే ఉంది. అయితే కాల గర్భంలో ఎంతో మంది సినీ ప్రముఖుల తప్పులు కనుమరుగయ్యాయని వాళ్ళ గుట్టు విప్పితే నీచంగా ఉంటుందని చాలా మందు హీరోయిన్స్ కామెంట్స్ చేశారు. ఇక ఇటీవల రిచా చద్దా కూడా సినిమా ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కౌచ్ ప్రభావం పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

నిజంగా ఇన్ని జరుగుతాయా..?
సుశాంత్ సింగ్ మరణంతో నెపోటిజమ్ పై ఊహించని విదంగా విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. నిజంగా ఇండస్ట్రీలో ఇంత రాజకీయాలు జరుగుతాయా అనేలా కొన్ని ఘటనలను ఉదాహరణలుగా నిలిచాయి. కంగనా రనౌత్ వంటి స్టార్స్ డైరెక్ట్ గా సినీ పెద్దల పేర్లు కూడా బయటకు లాగుతూ అందరికి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక రిచా చద్దా మాత్రం ఇన్ డైరెక్ట్ గా కొందరికి కౌంటర్ ఇచ్చింది.

రెండు రకాల మనుషులు ఉంటారు
రిచా మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో రెండు రకాల మనుషులు ఉంటారు. అందులో జాలి ఉన్నవారు, జాలి అనేది లేకుండా కఠినంగా ఉండేవాళ్లు కూడా ఉంటారు. ఇక ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన కొంతమంది సినీ పెద్దలు నీచంగా ప్రవర్తిస్తారు. అలాగని అందరూ చెడ్డవాళ్ళు కాదు. స్టార్స్ కిడ్స్ లో కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు.

నీచంగా చూస్తారు..
అయితే కొందరు సినీ ప్రముఖులు మాత్రం హీరోయిన్స్ అంటేనే నీచంగా చూస్తారు. సుశాంత్ మృతి అనంతరం చాలా మంది నీతి వ్యాఖ్యలు చెబుతున్నారు. కానీ అందులో కొందరు దర్శక నిర్మాతలలో చెడుగా ప్రవర్తించే నీచమైన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ప్రవర్తన చాలా బాధగా ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ ఉందనే అహం వాళ్లలో ఎక్కువగా ఉంటుంది.
Recommended Video

గదిలోకి రాకపోతే
ఇక వారు చెప్పినట్లు గదిలోకి రాకపోతే తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేస్తారు. అవకాశం వచ్చిన తరువాత కూడా గదిలోకి రాలేదని సినిమాల నుంచి తొలగిస్తారు. అలాగే మరో అవకాశం రాకుండా చూసినవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మొత్తంగా వారు చెప్పినట్లు చేయకపోతే హీరోయిన్ కెరీర్ ముగించడానికి కూడా ప్లాన్ చేసేవారు ఉంటారని రిచా చద్దా సంచలన వ్యాఖ్యలు చేసింది.


Click it and Unblock the Notifications











