చెత్త ముఖం.. సినిమాలకు పనికి రావు పో.. షాకింగ్‌గా హీరోయిన్ వెల్లడి
బాలీవుడ్ హీరోయిన్లలో అందం, అభినయంతో రాణిస్తున్న వారిలో రిచా చద్దా ఒకరు. ఎలాంటి విషయాన్నైనా కుండల బద్దలు కొట్టినట్టు చెప్పడం రిచాకు అలవాటు. ఆమె సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటారు. తనను ఎవరైనా విమర్శిస్తే వారిపై మండిపడకుండా వారి సూచనలు పాటించేందుకు ప్రయత్నిస్తారు.
తాజాగా మీడియాతో రిచా మాట్లాడుతూ.. హీరోయిన్లు, మహిళా ఆర్టిస్టులపై ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియా వెబ్‌సైట్లు దారుణంగా వ్యవహరిస్తున్నాయి. చాలా మందిని టార్గెట్ చేసుకొని ట్రోల్ చేస్తున్నారు. అలాంటి బారిన పడిన వారిలో ప్రియాంక చోప్రా, స్వర భాస్కర్, సోనమ్ కపూర్ ఉన్నారనే విషయాన్ని గ్రహించాను అని రిచా తెలిపారు.

నేను ఎప్పుడూ మీడియా వారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. కానీ కొన్నిసార్లు నన్ను దారుణంగా హర్ట్ చేశారు. నా ముఖం చెత్తగా ఉన్నానని కామెంట్ చేశారు. నేను సినిమా పరిశ్రమకు పనికిరానని నా కెరీర్ ఆరంభంలో కథనాలు రాశారు. కానీ జర్నలిస్టులు నా గురించి రాసిన విషయాలను పట్టించుకోలేదు. అయితే అలాంటి రాతలు నన్ను మానసికంగా మరింత ధృడం చేశాయి అని రిచా చెప్పారు.
అలనాటి బాలీవుడ్ తారలు స్మితా పాటిల్, షబానా ఆజ్మీ, దీప్తి నావల్ లాంటి వాళ్లు నాకు సినీ పరిశ్రమలో ఆదర్శం. వారి నుంచి మానసిక ధైర్యాన్ని, ఎలా ప్రయోగాలు చేయవచ్చో నేర్చుకొన్నాను అని రిచా చద్దా అన్నారు.


Click it and Unblock the Notifications











