సీక్రెట్‌గా ప్రభాస్ హీరోయిన్ పెళ్లి.. భర్త ఎవరో తెలుసా?
లీడర్ చిత్రంతో పరిచయమైన కొత్త అందం రిచా గంగోపాధ్యాయ. అటుపై మిరపకాయ్, సారొచ్చారుసినిమాల్లో రవితేజతో తెగ రొమాన్స్ చేసేసింది. ఈ రొమాన్స్ అప్పటి కుర్రకారులో కాకపుట్టించింది. మిర్చి చిత్రంలో ప్రభాస్‌కు జోడిగానూ నటించింది. అయితే చేసింది కొన్ని సినిమాలే అయినా.. తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. అయితే తాజాగా ఈ అమ్మడు పెళ్లి చేసుకుంది. ఇక ఇంకేముంది అది సీక్రెట్ పెళ్లి అంటూ కథనాలు వైరల్ అయ్యాయి. వాటిపై ఈ హీరోయిన్ కూడా హర్టయినట్టు తెలుస్తుంది.

అమెరికా ప్రియుడు.
అప్పుడెప్పుడో మెరిసిన రిచా.. నేటి తరంతో పోటిపడలేకపోయి ఫేడవుట్ అయింది. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. హయ్యర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్లిన ఈ భామ అక్కడే ఓ అమెరికన్ (జో)ను ప్రేమించడం, పెళ్లి కూడా చేసుకోవడం జరిగింది.

ప్రేమాయణాన్ని చెప్పిన రిచా..
తమది అందరికీ తెలిసిన ప్రేమ పెళ్లి అని, ఇరు కుటుంబాల్లో తమ ప్రేమాయణం గురించి చాలా ముందే తెలుసని రిచా చెప్పుకొచ్చింది. 2015లో తాను వాషింగ్టన్ యూనివర్శిటీలో ఎంబీఏ చదువుకునేప్పుడే జోని ప్రేమించానని.. 2019 జనవరిలో నిశ్చితార్థమైందని.. అటుపై సెప్టెంబర్ లో పెళ్లాడేశానని వెల్లడించింది.

వార్తలు హల్ చల్..
రిచా గంగోపాధ్యాయ పెళ్లి ఫోటోలు ఒక్కసారిగా బయటకు వచ్చేసరికి అది సీక్రెట్ పెళ్లి అంటూ వార్తలు హల్ చల్ చేశాయి. ఈ వార్తలు కాస్త ఆమె చెవికి చేరినట్టున్నాయి. అందుకే సీక్రెట్ పెళ్లి ఏంటని ఫైర్ అవుతోంది.

ఘనంగా జరపుకున్నాం..
తమ పెళ్లిపై పుట్టుకొచ్చిన రూమర్లపై సీరియస్ అయ్యింది. ఇండో అమెరికన్ స్టైల్లో నాలుగురోజుల పెళ్లి వేడుకలు జరిగాయని రిచా తెలిపింది. అమెరికా- మిచిగన్‌లో పలు ప్రాంతాల్లో ఈ పెళ్లి వేడుకల్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నామని రిచా చెప్పుకొచ్చింది. రహస్యంగా పెళ్లి చేసుకునే ఛాన్సే లేదని రూమర్లను ఖండించింది.


Click it and Unblock the Notifications











