twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Riddhi Kumar : రెచ్చిపోయిన టాలీవుడ్ బ్యూటీ.. ఆ నటుడితో కలిసి హద్దులు దాటేసి మరీ వీడియో!

    |

    తెలుగులో రాజ్ తరుణ్ లవర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రిద్ధి కుమార్ ఆ తర్వాత అనగనగా ఓ ప్రేమ కథ సినిమా కూడా చేసింది. ఆ తర్వాత తమిళంలో మరికొన్ని సినిమాలు చేసిన ఈ భామ తాజాగా ఒక నటుడితో కలిసి చేసిన హాట్ డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

    లవర్ సినిమాతో ఎంట్రీ

    లవర్ సినిమాతో ఎంట్రీ

    తెలుగు తెరకు ముంబై భామలను తీసుకు రావడం కొత్తేమీ కాదు. అలా రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన లవర్ సినిమా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రిద్ది కుమార్. ముంబై లోనే పుట్టి పెరిగిన ఈ భామ తెలుగు తర్వాత తమిళ సినిమా ఇండస్ట్రీలో కూడా కొన్ని సినిమాలు చేసింది. ఫేస్ ఆఫ్ ఇండియా పెజెంట్ విన్నర్ గా నిలిచిన ఈ భామ మొట్టమొదటిసారిగా లవర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

    బిజీ బిజీ

    బిజీ బిజీ

    ఆ తర్వాత తెలుగు లోనే అనగనగా ఒక ప్రేమ కథ అనే సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత మలయాళంలో ప్రణయ మీను కాలుడే కాదల్ అనే సినిమాలో నటించగా తర్వాత చేతి మందారం తులసి అనే తమిళ సినిమాలో కూడా నటిస్తోంది. ఇక తెలుగులో ప్రస్తుతం ఆమె నటిస్తున్న రెండు సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి.

    రాధే శ్యామ్ తో బిజీ

    రాధే శ్యామ్ తో బిజీ

    అలా వాటిలో ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా ఒకటి కాగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో రూపొందుతున్న కోతికొమ్మచ్చి సినిమా ఒకటి. అయితే ఎక్కువగా ఎప్పుడూ హాట్ షోస్ కి దూరంగా ఉండే ఈ భామ ఈ రోజు ఏమైందో తెలియదు గానీ ఒక హాట్ వీడియో తన సోషల్ మీడియాలో షేర్ చేసి సంచలనం రేపింది.

    వర్షంలో తడుస్తూ

    తన స్నేహితుడు అని చెబుతూ ఒక వ్యక్తితో ఆమె హాట్ వీడియో షేర్ చేసింది. ఇక సదరు వ్యక్తి మరెవరో కాదు పాతాళ్ లోక్ వెబ్ సిరీస్ లో హథీరాం చౌదరి పాత్రలో నటించిన జైదీప్ అహ్లావత్ కొడుకు పాత్రలో నటించారు. ఆ సిరీస్లో సిద్ధార్థ్ చౌదరి పాత్రలో నటించిన బోధిసత్వ శర్మ పుట్టినరోజు కావడంతో రిద్ధి కుమార్ రెచ్చిపోయింది. ఇద్దరూ కలిసి వర్షంలో తడుస్తున్న ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పెద్ద ఉపోద్ఘాతము రాసుకొచ్చింది.

    ఐ లవ్యూ అని

    ఐ లవ్యూ అని

    పుట్టినరోజు శుభాకాంక్షలు బెస్ట్ ఫ్రెండ్, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అలాగే నేను నిన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది, మనం ఇలా వర్షంలో తడుస్తూనే ఉండాలి, వర్షం లో నృత్యం చేస్తూ, పిచ్చి జోకులు వేసుకుంటూ నవ్వుతూ మరియు మనల్ని మనమే ఇబ్బంది పెట్టుకుపోవాలి, ఇక అలాగే సోజు మరియు బార్బెక్యూ మన కోసం ఎదురు చూస్తున్నాయి కాబట్టి జల్ది రెడీ అయి ఉండు వస్తున్నా అంటూ పేర్కొంది.

    చూసేయండి మరి

    చూసేయండి మరి

    ఇక వీరిద్దరి కాంబో చూస్తే ఫ్రెండ్స్ కంటే ఎక్కువే అనిపిస్తుంది, కానీ రిద్ధి మాత్రం బెస్ట్ ఫ్రెండ్ అని అనడంతో ఫ్రెండ్ జోన్ అనే ముద్ర వేస్తున్నారు. అయితే ఈ ఇద్దరూ కలిసి క్యాండీ అనే ఒక వెబ్ సిరీస్ లో కలిసి నటించారు. అక్కడే వీరి ఫ్రెండ్ షిప్ బాగా పెరిగిందని అంటున్నారు. ఇక మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయండి మరి.

    English summary
    Riddhi Kumar's hot dance with Bodhisattva Sharma has gone viral on social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X