అశోకవనంలో మెరిసిన కొత్త భామ.. ఆ రితిక నాయక్ ఎవరో తెలుసా?

చేసింది తక్కువ సినిమాలే అయినా విశ్వక్ సేన్ యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇక ఆయన చేస్తున్న సినిమాలు వరుసగా ప్లాప్ కావడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఉద్దేశంతో అశోకవనంలో అర్జున్ కళ్యాణం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మే ఆరో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విడుదలకు ముందు పెద్ద ఎత్తున వివాదం నెలకొనడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగినట్లుగా సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దానికి తోడు సినిమా విడుదలకు ముందే సెలబ్రిటీలకు ప్రీమియర్ షోస్ వేసి వాటి నుంచి ప్రమోషన్స్ చేయడంతో సినిమా మీద ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఇక దానికి తోడు యూఎస్ ప్రీమియర్స్ నుంచి కూడా సినిమాకి మంచి టాక్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున థియేటర్లు బుక్ అయ్యాయి.

ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ తన గత సినిమాలకు ఏ మాత్రం సంబంధం లేని పాత్రలో నటించారు. 30 ఏళ్లు దాటాక కూడా పెళ్లి కానీ ఒక కుర్రాడి గా నటించిన విశ్వక్ సేన్ నెమ్మదస్తుడు, మొహమాటస్తుడి పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ రుక్సార్ థిల్లాన్ అని అందరూ భావించారు. కానీ ఆమె అతిథి పాత్రకు ఎక్కువ సపోర్టింగ్ పాత్రకు తక్కువగా కనిపించింది. ఇక ఈ సినిమాలో సర్ప్రైజింగ్ ప్యాకేజీ లాగా హీరోయిన్ చెల్లెలి పాత్రలో రితిక నాయక్ అనే కొత్త అమ్మాయి కనబడి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా ఆద్యంతం కూడా హీరోయిన్ పాత్ర కంటే రితిక ఎక్కువగా కనిపించింది. అయితే ఇప్పటి వరకు ఈ భామను ఎక్కడా చూడలేదు ఏమిట్రా అనుకుంటున్న అందరికీ ఆమె గురించి కొన్ని వివరాలు సేకరించి తీసుకువచ్చే ప్రయత్నం చేశాం.. రితిక నాయక్ ఒక వ్లాగర్, అలాగే ఆమె మోడలింగ్ కూడా చేస్తూ ఉంటుంది.

Ritika nayak as surprise package in ashoka vanam lo arjuna kalyanam

సినిమాల మీద ఆసక్తితో ఆమె మొట్టమొదటి సినిమాగా అశోకవనంలో సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. సినిమా మొత్తం హీరోయిన్ కంటే ఎక్కువగా కనిపించేది ఆమె అయినా ఎందుకో కానీ ఆమె పాత్రను తొలుత ఎక్కడ రివీల్ చేయలేదు. బహుశా సర్ప్రైజింగ్ ప్యాకేజీ లాగా ఉంచడం కోసమే ఆమె ను పెద్దగా హైలెట్ చేయకపోయినా ఉండవచ్చు అని భావిస్తున్నారు. సినిమా మొత్తం తన క్యూట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న రితిక భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని అందరూ భావిస్తున్నారు. భోగవల్లి బాపినీడు కుమారుడు బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాణంలో విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించగా ఆయన సరసన రుక్సార్ థిల్లాన్ ఫిమేల్ పాత్రలో నటించింది. సినిమా విడుదలకు ముందు పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ విషయంలో దాదాపు అందరూ కూడా విశ్వక్సేన్ కి సపోర్ట్ చేయడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X