అలాంటి చిత్రాల్లో ఓకే.. గ్యాప్ రావడానికి కారణం అదే.. హీరోయిన్ కామెంట్స్
గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది రితికా సింగ్. రియల్ లైఫ్‌లో బాక్సర్ అయిన రితికా సింగ్.. గురు సినిమాలో అద్భుతంగా నటించి అందర్నీ మెప్పించింది. అయితే గురు తమిళంలో వచ్చిన ఇరుదు చుట్రు అనే సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో సాలా కడ్డూస్ అనే టైటిల్‌తో రిలీజ్ అయింది. విడుదలైన అన్ని చోట్లా మంచి విజయాన్నే నమోదు చేసింది.

అదృష్టం కలిసి రావడం లేదు..
అందం ఉన్నా, అభినయం ఉన్నా.. అదృష్టం మాత్రం ఈ బ్యూటీకి లేదని తెలుస్తోంది. గురు సినిమా తరువాత మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ అందుకోలేకపోతోంది. లారెన్స్‌తో శివలింగ అనే సినిమా చేసింది కానీ అంతగా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం తమిళంలో ఓ చిత్రం చేస్తోంది.

ఓ మై కడవలే..
వాటిలో ఒకటి ఓ మై కడవలే. అశోక్‌సెల్వన్‌తో జతకట్టిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 14వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ప్రేమికుల రోజున పలకరించబోతోన్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రితికా మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించింది.

గ్యాప్‌కు కారణం అదే..
తనకు చాలా అవకాశాలు వస్తున్నాయని చెప్పుకొచ్చిన బ్యూటీ.. ఏది పడితే దాన్ని అంగీకరించడం లేదని వెల్లడించింది. మంచి కథ అనిపిస్తేనే నటించడానికి ఒప్పుకుంటున్నానని చెప్పింది. తనకు కథ నచ్చాలని చెప్పుకొచ్చింది.

అలాంటి చిత్రాలైనా ఓకే..
యాక్షన్ కథా చిత్రాల్లో నటించడం ఇష్టమే కానీ, ప్రస్తుతానికి ప్రేమ కథా చిత్రాల్లోనే నటించాలని అనుకుంటున్నట్లు వెల్లడించింది. తాను ప్రస్తుతం బాక్సింగ్‌ను ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నానని తెలిపింది. అయితే ప్రస్తుతం చిత్రాలపైనే దృష్టి సారిస్తున్నట్లు రితికాసింగ్ పేర్కొంది.


Click it and Unblock the Notifications











