‘గుమ్మడి వరలక్ష్మి’ని పరిచయం చేసిన టక్ జగదీష్: ‘వరుడు కావలెను’ అంటూ వచ్చేసింది
తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్‌గా ఉండే అమ్మాయిలకు అవకాశాలు అంతగా దొరకవు అన్న విషయం తెలిసిందే. కానీ, దానికి భిన్నంగా 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై వరుస ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోంది లోకల్ బ్యూటీ రీతూ వర్మ. హీరోయిన్‌గా చేసిన తొలి సినిమాలోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ తెలుగు నటి.. ఆ సినిమాలో చేసిన నటనకు గానూ ఎన్నో అవార్డులను దక్కించుకుంది. ఆ తర్వాత ఇతర భాషల్లో నటించి మెప్పించింది. ఈ మధ్య కాలంలో తెలుగులో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.
ప్రస్తుతం రీతూ వర్మ.. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న 'టక్ జగదీష్'లో నటిస్తోంది. శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను షైస్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మిస్తున్నారు. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో రీతూ వర్మ 'గుమ్మడి వరలక్ష్మి' అనే పాత్రను పోషిస్తోంది. ఈరోజు ఆమె పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని తాజాగా దీనికి సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు. ఎన్నో అంచనాల నడుమ రూపొందుతోన్న ఈ సినిమా ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది.

లవర్ బాయ్ నాగశౌర్య నటిస్తోన్న 'వరుడు కావలెను' అనే సినిమాలోనూ రీతూ వర్మ హీరోయిన్‌గా చేస్తోంది. లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని హీరోయిన్ లుక్‌ను కూడా నేడు విడుదల చేశారు. ఈ మూవీలో నదియా, మురళీ శర్మ, 'వెన్నెల' కిశోర్, ప్రవీణ్ తదితరులు నటిస్తున్నారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











