ఎవరి పర్మిషన్ అవసరం లేదంటూ... సెక్సీగా రెచ్చిపోయిన హీరోయిన్!
'నేను మీకు తెలుసా?' అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బెంగాళీ బ్యూటీ రియా సేన్ ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాకపోవడంతో మళ్లీ తెలుగులో అవకాశాలు దక్కించుకోలేక పోయింది. బాలీవుడ్లో అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చిన ఈ బ్యూటీ అక్కడ సైతం స్టార్ హీరోయిన్ రేంజికి ఎదగడంలో విఫలమైంది. 38 ఏళ్ల ఈ నటి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సిజ్లింగ్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు కనువిందు విందు చేస్తోంది.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్ పేజీలో తన హాట్ ఫిగర్ ఎక్స్ ఫోజ్ చేస్తూ సూపర్ హాట్ ఫోటో షేర్ చేసింది. ''నీకు నచ్చినట్లలు ఉండేందుకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు' అంటూ ఈ ఫోటోకు కాప్షన్ పెట్టడం గమనార్హం. ఈ పోస్ట్ షేర్ చేయడం ద్వారా స్వేచ్ఛగా జీవించాలి అనే సందేశం ఇచ్చే ప్రయత్నం చేసింది. అభిమానుల నుంచి ఈ ఫోటోకు మంచి స్పందన వస్తోంది.

సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చిన రియా సేన్... తన గ్రాండ్ మదర్ సుచిత్రా సేన్, తల్లి మూన్ మూన్ సేన్, సిస్టర్ రైమా సేన్ అడుగు జాడల్లో నడుస్తూ చిన్నతనంలోనే 'విషకన్య' అనే హిందీ మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా తెరంగ్రేటం చేసింది. 1999లో వచ్చిన 'తాజ్ మహల్' అనే తమిళ చిత్రం ద్వారా హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది.
2008లో మంచు మనోజ్ హీరోగా రూపొందిన 'నేను మీకు తెలుసా?' అనే మూవీ ద్వారా రియా సేన్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కెరీర్లో దాదాపు 50 సినిమాలు చేసిన ఆమె హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, బెంగాలీ, మలయాళం, ఒరియా చిత్రాల్లో నటించింది. ఆమె చివరగా నటించిన చిత్రం 'లెన్లీ గర్ల్' 2017లో విడుదలైంది. శివం తివారీతో పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు దూరంగానే ఉంటున్నారు.


Click it and Unblock the Notifications











