‘నేను డేటింగ్ చేయకపోతే.. బ్రేకప్‌తో ఆ క్రికెటర్ సూసైడ్ చేసుకోనే వాడేమో’

క్రికెటర్లు, సినీ తారలకు మధ్య డేటింగ్, అఫైర్, సహ జీవనం, రిలేషన్‌షిప్స్ వ్యవహారాలు కొత్తేమీ కాదు. 70, 80 దశకాల నుంచే వారి మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి. పటౌడీ, షర్మీలా టాగోర్, మోహిసిన్ ఖాన్, రీనారాయ్, సందీప్ పాటిల్, రవిశాస్త్రి, అమృత డియోల్, అనిల్ అంబానీ, టీనా మునిమ్ లాంటి వారి లవ్ అఫైర్లు అటు సినీ అభిమానులకు, ఇటు క్రికెట్ ఫ్యాన్స్‌కు ఆనందాన్ని కలిగించే వార్తలుగా మారాయి. అయితే ఇప్పడు కూడా అంతకు మించిన డేటింగ్ వ్యవహారాలు క్రికెటర్లు, సినీ తారల మధ్య కనిపిస్తున్నాయి. తాజాగా అత్యంత చర్చనీయాంశమైన క్రికెటర్ యజువేంద్ర చాహల్, ఆర్జే మహ్‌వశ్ రిలేషన్‌షిప్ గురించి రకరకాల కథలు వినిపించాయి. అయితే చాహల్‌తో ఉన్న బంధం గురించి ఆర్జే భామ చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే..

గత కొద్దికాలంగా యుజ్వేంద్ర చాహల్‌తో ఆర్జే మహ్‌వశ్‌తో డేటింగ్ వ్యవహారంపై అటు సినీ, క్రికెట్ రంగాల్లో భారీ చర్చే జరిగింది. తెలుగు, హిందీ సినీ రంగాల్లో రాణిస్తున్న శ్రేయ ధన్వంతరితో చాహల్‌ డైవోర్స్ తీసుకొన్న తర్వాత ఆయన జీవితంలోకి ఆమె వచ్చింది. ఆర్జే మహ్‌వశ్‌తో కలిసి చాహల్ తిరగడం, క్రికెట్ మ్యాచులకు కలిసి వెళ్లడం, రెస్టారెంట్స్, పార్టీల్లో కలిసి కనిపించడంతో వారి మధ్య అఫైర్ ఉందనే వార్తలు ముంబై మీడియాలోను, జాతీయ మీడియాలోను గుప్పుమన్నాయి.

RJ MahVash Yuzvendra Chahal

అయితే శ్రేయా ధన్వంతరితో బ్రేకప్ తర్వాత చాహల్ మానసికంగా, శారీరకంగా కుంగిపోయాడు. వారి వివాహ బంధం ముగిసిన తర్వాత ఒంటరి వాడు అయ్యాడు. ఆ సమయంలో నాకు చాహల్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం మా మధ్య స్నేహానికి దారి తీసింది. అనంతరం మా మధ్య స్నేహాని కంటే ఎక్కువ బంధం ఏర్పడింది. ఆ బంధం ఏమిటో మాకే తెలుసు అని ఆర్జే మహ్‌వశ్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది.

జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్జే మహ్ మాట్లాడుతూ.. చిన్న విషయాలను పెద్దవిగా చేసి చూపించడం ప్రజలకు అలవాటైంది. అలాంటి వాటిని చూసి వదలేయడం తప్ప పట్టించుకొనే ఛాన్స్ లేదు. చాహల్‌కు నాకు మధ్య కొన్ని విషయాల్లో సరితూగలేదు. అందుకే సోషల్ మీడియాలో అన్ ఫాలో అయ్యాం. చాహల్‌కు తన జీవితంలో అంతా మంచే జరగాలని కోరుకొంటాను. మా మధ్య అభిప్రాయ బేధాలు, ఆర్గ్యూమెంట్ చోటు చేసుకొన్నాయి. అందుకే విడిపోయాం. అంతే తప్ప అందులో భూతద్దం పెట్టి చూడటానికి ఏమీ లేదు అని ఆమె అన్నారు.

RJ MahVash Yuzvendra Chahal

మా మధ్య స్నేహానికి మించి ప్రేమ బంధం లేదు. ఆయనతో స్నేహ బంధాన్ని మాత్రమే కొనసాగించాను. ఆయన క్లిష్టమైన పరిస్థితుల్లో, వ్యక్తిగతంగా సమస్యల్లో ఉన్న సమయంలో నేను ఆయనకు ఫ్రెండ్‌గా తోడున్నాను. తన జీవితంలో చోటు చేసుకొన్న బ్రేకప్ తర్వాత ఆయనను సూసైడ్ ఆలోచనలు చుట్టుముట్టాయి. ఆ సమయంలో ఆయన పక్కన ఉండి మానసికంగా ధైర్యం చెప్పాను. ఐపీఎల్‌లో ఆయన పెర్ఫార్మెన్స్ బాగా ఉండేదుకు నా వంతు సహకారం అందించాను. ఈ విషయాన్ని అందరూ అర్ధం చేసుకొంటే చాలూ అని ఆర్జే మహ్‌వశ్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X