RK Roja :విమానంలో సాంకేతిక లోపం.. రోజాకు తృటిలో తప్పిన పెను ప్రమాదం
వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి ఆర్ కే రోజా పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఎదురవడంతో చాలా సేపు గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానాన్ని చాలా సేపటి తర్వాత బెంగళూరులో ల్యాండ్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

పెను ప్రమాదం
వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి, జబర్దస్త్ జడ్జ్ రోజా ప్రయాణిస్తున్న విమానానికి పెను ప్రమాదం ఎదురైంది. ఈరోజు ఉదయం ఆమె రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్లేందుకు ఇండిగో విమానం ఎక్కారు. అయితే అయితే సాంకేతిక సమస్య ఎదురు కావడంతో తిరుపతిలో దిగాల్సిన విమానం బెంగళూరులో ల్యాండ్ అయింది. బెంగళూరులో ల్యాండ్ కావడానికి ముందు గంట పాటు గాలిలో చక్కర్లు కొట్టడంతో లోపల ఉన్న ఎమ్మెల్యే రోజా సహా ఇతర నేతలందరూ టెన్షన్ పడ్డారు.

విమానం ల్యాండ్ అయి
గంట పాటు గాలిలో చక్కర్లు కొట్టిన విమానం విమానాన్ని పైలట్ చాకచక్యంగా బెంగళూరు ఎయిర్పోర్టులో ల్యాండ్ చేశారు. అయితే బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో విమానం ల్యాండ్ అయిన తర్వాత కూడా సుమారు నాలుగు గంటల పాటు విమానం తలుపు తెరుచుకోలేదు. ఇంత జరుగుతున్నా అసలు ఏం జరుగుతుంది? అనే విషయం మీద ప్రయాణికులకు చెప్పడానికి ఇండిగో సిబ్బంది ఆసక్తి చూపించ లేదు.

సమాధానం చెప్పలేదని
ఈ నేపథ్యంలో నగరి ఎమ్మెల్యే రోజా సహా తెలుగుదేశం నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఇతర ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఇదే ఫ్లైట్లో టిడిపి ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సైతం ఉన్నారు. అయితే అసలు ఈ సాంకేతిక సమస్య ఏమిటి? ఎందుకు ఇలా జరిగింది? అనే విషయం మీద ఎవరూ సరిగా సమాధానం చెప్పలేదని విమానం ల్యాండ్ అయ్యాక కూడా విమానం నుంచి కిందకి దిగాలి అంటే ఐదు వేలు ఇవ్వాలి అని తమను డిమాండ్ చేసినట్లు ఎమ్మెల్యే రోజా ఆరోపించారు.

రోజా తీవ్ర అసహనం
ఈ ఘటనపై ఎమ్మెల్యే రోజా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమస్య ఏంటో చెప్పకుండా టెన్షన్ పెట్టారని, మా జీవితాలతో ఇండిగో చెలగాటం ఆడిందని ఆమె అన్నారు. నాలుగు గంటలు ఫ్లైట్ లోనే కూర్చోబెట్టారని పేర్కొన్న ఆమె, చివరికి బెంగళూరులో దిగడానికి కూడా ఐదు వేలు అడిగారని విమర్శించారు. ఈ అంశం మీద కోర్టుకు వెళతానని ఆమె అన్నారు. అయితే ఎందుకు అడిగారు? అనేది తెలియాల్సి ఉంది.

ఐదు వేల రూపాయలు బలవంతంగా వసూలు
సాంకేతిక లోపంతో విమానం ఆగిపోతే.. బెంగళూరు వెళ్లినందుకు ప్రయాణికుల నుంచి ఐదు వేల రూపాయలు బలవంతంగా వసూలు చేశారని.. దీనిపై తాను కోర్టుకు వెళ్తాను అని అన్నారు రోజా.. ఇండిగో అధికారులపై డిఫమేషన్ కేసు కచ్చితంగా వేసి తీరుతాను అన్నారు. ప్రయాణికులతో వారు ప్రవర్తించిన తీరు చాలా దారుణంగా ఉందని ఆమె మండిపడ్డారు. దీని గురించి మరింత సమాచారం అయితే అందాల్సి ఉంది. పైలెట్ తిరుపతిలో దిగాల్సిన విమానాన్ని బెంగళూరులో సురక్షితంగా దించడంతో వాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు.


Click it and Unblock the Notifications