twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంత్రిగా ప్రమాణ స్వీకారం..ఏడ్చేస్తూ జగన్ చేతికి ముద్దు.. రోజా సంచలన ప్రకటన!

    |

    సినిమా హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి తెలుగు ప్రజలకు రోజాగా దగ్గరయింది తిరుపతికి చెందిన శ్రీ లతా రెడ్డి. ఆ అనంతర కాలంలో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆమె పదేళ్ల కాలానికి ఎమ్మెల్యే అయింది. అయితే ఆమె అనూహ్య పరిస్థితుల్లో మంత్రి కావడంతో ఇక సినిమాలకు, జబర్దస్త్ కి దూరం అవుతున్నాను అని ప్రకటించారు. ఆ వివరాలు

    ఆర్కే రోజా అనే నేను

    ఆర్కే రోజా అనే నేను

    ఎట్టకేలకు సినీ నటి, వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న రోజా తన కోరిక నెరవేర్చుకున్నారు. మంత్రి కావాలనే తన చిరకాల వాంఛ ఎట్టకేలకు నిజమైంది. సోమవారం నాడు ఏపీ రాజధాని అమరావతిలోని సచివాలయంలో ఆమె ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 'ఆర్కే రోజా అనే నేను..' అంటూ ప్రమాణం చేశారు.

    ముద్దు పెడుతూ

    ముద్దు పెడుతూ

    అయితే రోజా తన ప్రమాణ స్వీకార సమయంలో ఉద్వేగానికి లోనయ్యారు. 'ఆర్కే రోజా అనే నేను..' అంటూ ఉబికి వస్తున్న కన్నీటిని అదుపు చేసుకుంటూనే ఆమె ప్రమాణ పాఠం పూర్తి చేశారు. ఇక ఆ తరువాత తన ప్రమాణం పూర్తి కాగానే జగన్ కు పాదాభివందనం చేసి, ఆ వెంటనే జగన్ చేయి తీసుకొని ఆప్యాయంగా ముద్దు పెడుతూ తనకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు.

    కేబినెట్ లోకి

    కేబినెట్ లోకి

    రోజా చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె 2014లో వైసీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2019లో రెండోసారి విజయ దుందుభి మోగించడంతో మంత్రి పదవి పక్కాగా అనుకున్నారు. అయితే అప్పుడు ఆమెకు మంత్రి పదవి దక్కక పోవడంతో ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా జగన్ బాధ్యతలు అప్పగించారు. రెండేళ్ల పాటు ఆమె ఆ పదవిలో కొనసాగగా ఇప్పుడు కేబినెట్ లోకి అడుగుపెట్టారు.

    రెండు రంగాల్లో

    రెండు రంగాల్లో

    నిజానికి అటు సినిమాలు, ఇటు రాజకీయాలు కానీ రెండు రంగాల్లో రోజా తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు అని చెప్పక తప్పదు. సినిమా హీరోయిన్ గా ఎన్నో ఏళ్ల పాటు టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా వెలుగొందిన ఆమె రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. టీడీపీలో ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత వైసీపీకి వచ్చాక కానీ ప్రత్యర్థులపై ఆమె విరుచుకు పడిన తీరు కారణంగా నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉండేవారు.

    గుడ్ బై

    గుడ్ బై

    ఇక తాను మంత్రి పదవి స్వీకరిస్తున్న సందర్భంగా రోజా మాట్లాడుతూ, తనకు మంత్రి పదవి లభించినందుకు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ పై తన అభిమానం రెట్టింపయింది అని చెప్పారు. ముఖ్యమంత్రి తనకు ఏ శాఖను కేటాయించినా సమర్థవంతంగా పని చేస్తానని రోజా తెలిపారు. అదే సమయంలో ఆమె ఒక సంచలన ప్రకటన కూడా చేశారు.

    సినిమాలకు, జబర్దస్త్ షో కి గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు. మంత్రిగా తన పూర్తి సమయాన్ని ప్రజల కోసమే వెచ్చించాల్సి ఉంటుందని... ఈ సమయంలో సినిమాలు, షోలకు సమయం కేటాయించలేనని ఆమె తెలిపారు. మంత్రిగా సీఎంకు మంచి పేరు తీసుకొచ్చేలా బాధ్యతలు నిర్వర్తిస్తానని ఆమె చెప్పుకొచ్చారు.

    English summary
    RK Roja swore in as minister. and she says good bye to jabardasth and movies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X