అఖండ 2 విడుదల వేళ బాలకృష్ణపై రోజా కామెంట్స్.. అందరూ ముందు అలా పిలిస్తే అంటూ..
Akhanda 2: నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన 'అఖండ 2' సినిమాపై ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. 'అఖండ' బ్లాక్‌బస్టర్ విజయానంతరం వస్తున్న సీక్వెల్ కావడంతో పాటు, బాలయ్య-బోయపాటి కాంబోలో ఇది నాలుగో చిత్రం కావడం మరింత హైప్ పెంచింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లతో సినిమా మీద పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ ఏర్పడింది. డిసెంబర్ 5న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, అవధ్ భాషల్లో ఈ మూవీ గ్రాండ్‌గా విడుదల కానుంది. బాలయ్య కెరీర్‌లో ఇదే తొలి పాన్ ఇండియా రిలీజ్ కావడం విశేషం.ఇక ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, సీనియర్ నటి రోజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే..?
టాలీవుడ్‍లో బాలకృష్ణ- రోజాలది ఒకప్పటి సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు అందుకున్నాయి. ముఖ్యంగా 'బైరవ ద్వీపం' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలుస్తాయి. సాంఘికం నుండి జానపదం, పౌరాణికం, చారిత్రక సినిమా వరకూ ఏ జానర్‌ను వదిలిపెట్టకుండా చేసిన అరుదైన జోడీ ఇదే అన్నది మూవీ లవర్స్ s మాట. వీళ్లిద్దరి ప్రయాణంలో మరో ఆసక్తికర అంశమేమిటంటే.. విభజిత ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఒకేసారి ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడం. ఇటీవల ఎన్నికల్లో ఓటమి అనంతరం రోజా మళ్లీ సినిమాల్లోకే రావాలని నిర్ణయించుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా, బాలకృష్ణతో తన ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పలు భావోద్వేగ విషయాలు పంచుకున్నారు.

నటి రోజా ఇటీవల బాలకృష్ణతో తన అనుబంధం, గతంలో కలిసి చేసిన సినిమాల జ్ఞాపకాలు, అలాగే ఇతర అగ్రహీరోలతో తన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. రోజా మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో తనకు అన్ని హీరోలతోనూ మంచి సంబంధాలున్నాయని, కానీ బాలయ్యగారితో ఉన్న అనుబంధం మాత్రం పూర్తిగా స్పెషల్ అని చెప్పారు. "బాలకృష్ణ గారు కనిపిస్తే నేను పరిగెత్తుకుంటూ వెళ్లాల్సిందే" అంటూ సరదాగా చెప్పిన ఈ వ్యాఖ్య ఎంతో వైరల్ అయింది. అసెంబ్లీ సెషన్ సమయంలో కూడా ఇద్దరూ కలిసినప్పుడు బాలయ్య "హాయ్ రోజా, ఎలా ఉన్నావ్?" అని అడగడంతో, అక్కడి ఎమ్మెల్యేలు ఆశ్చర్యపడేవారట. "ఇద్దరూ వేర్వేరు పార్టీల వాళ్లు... ఫైట్ చేస్తారనుకున్నాం గాని ఇలా ప్రేమగా మాట్లాడుకుంటున్నారు?" అని చాలామంది ఆశ్చర్యపడ్డారని ఆమె నవ్వుతూ గుర్తుచేసుకున్నారు.
రోజా మాట్లాడుతూ.. బాలయ్య గారితో తనకు ఉన్న ప్రేమ, గౌరవం గురించి కూడా వివరించారు. 'ఆయనకు నాపై స్పెషల్ అఫెక్షన్ ఉంటుంది. నాకు కూడా ఆయనపై అలాగే ఉంటుంది. నన్ను చూసినప్పుడల్లా 'దేవుడు నీకు మంచి ఫ్యూచర్ ఇచ్చాడు... నువ్వు క్వీన్ గెటప్‌లో అద్భుతంగా కనిపిస్తావు' అని పొగుడుతారు' అని చెప్పారు. ముఖ్యంగా 'బైరవద్వీపం' సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఆ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి ఇవెన్ బాలకృష్ణ, రంభలాంటి నటీనటులకు కూడా స్క్రీన్ టెస్టులు నిర్వహించారని చెప్పారు. కానీ తనకు మాత్రం ఒక్క స్క్రీన్ టెస్ట్ కూడా లేకుండానే డైరెక్ట్‌గా ఎంపిక చేశారు. "క్వీన్ గెటప్‌కు పర్ఫెక్ట్ నువ్వే" అని అప్పుడే బాలయ్య చెప్పేవారని తెలిపారు.
బైరవద్వీపం సినిమా తమ ఇద్దరికీ ఎన్నటికీ మరిచిపోలేని స్పెషల్ ఫిల్మ్ అని రోజా భావోద్వేగంగా చెప్పారు. తర్వాత 'అన్నమయ్య'లో కూడా తన మహారాణి గెటప్ విషయాన్ని గుర్తుచేస్తూ.. "ఎక్కడ రాణి పాత్ర ఉన్నా అందులో నేను ఉండాలని బాలయ్యగారు ఎప్పుడూ చెప్పేవారు" అని ఆమె చెప్పారు. బాలకృష్ణ సెట్లో ఎలా ఉంటారనే ప్రశ్నకు రోజా సమాధానమిస్తూ.. 'సెట్‌లో బాలకృష్ణ గారు ఉన్నారంటే అల్లరి మామూలుగా ఉండదు. మొత్తం టీంని తన చుట్టూ కూర్చోబెట్టుకుని కథలు, పాటలు, పద్యాలు, జోకులు...చెబుతారు. ఆయన ఎనర్జీ పూర్తిగా డిఫరెంట్‌గా ఉంటుంది" అని ఆమె నవ్వుతూ చెప్పారు. బాలయ్య సెట్ వాతావరణం ఎప్పుడూ ఎనర్జిటిక్ ఉండేదని తెలిపారు.
తర్వాత రోజా వెంకటేష్ గారి గురించి చెప్పారు. ఆయన చాలా రిజర్వ్డ్ నేచర్ కలిగిన వ్యక్తి అని చెప్పారు. "వెంకటేష్ గారు మనమే మాట్లాడితే మాత్రమే మాట్లాడుతారు. చాలా సాఫ్ట్, క్లాసీగా, గౌరవంగా వ్యవహరిస్తారు" అని ఆమె వివరించారు. నాగార్జున విషయానికి వస్తే రోజా పూర్తిగా వేరే కోణాన్ని బయటకు తీసుకొచ్చారు. "నాగార్జున గారు ఎక్కడ కూర్చున్నా అక్కడికి వెళ్లి కూర్చోవాల్సిందే. హీరోయిన్స్ అందరికీ ఆయనంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. ఆయన ఎవరితో బాగుంటారు. చాలా డిగ్నిఫైడ్ గా చూసుకుంటారు. అందుకే అందరూ ఆయనతో మాట్లాడడానికి, ఆయనతో ఉండడానికి ఇష్టపడతారు" అని రోజా చెప్పారు.
ఇక చిరంజీవి గారితో పనిచేయడం గురించి మాట్లాడుతూ "షూటింగ్‌కు ముందు చాలామంది భయపెట్టారు... రెండు మూడు టేకులు ఎక్కువైతే చిరంజీవి గారు కోపంగా వెళ్లిపోతారంటూ అన్నారు. కానీ ఆయన అసలు అలా కాదు. చాలా కూల్ గా ఉండేవారు. డాన్స్ స్టెప్స్ పర్ఫెక్ట్‌గా నేర్పించి టేక్‌కి రావాలని చెప్పేవారు" అని రోజా చెప్పారు. మొదటి సినిమాకే చిరంజీవితో డాన్స్ చేయడం తన కెరీర్‌లో పెద్ద మైలురాయి అని పేర్కొన్నారు. ఇక తరువాత 'బొబ్బిలి సింహం' చిత్రంలోని మీనా గారితో తన హెల్ధీ కంపిటీషన్ కూడా గుర్తుచేసుకున్నారు రోజా. "అప్పుడు నేను, మీనా గారు ఇద్దరం పోటీపడి నటించాం. ఎవరైనా బెస్ట్ గా చేయాలని హెల్ధీ కంపిటీషన్ ఉండేది. ఆ సినిమా ఇద్దరికీ కూడా మంచి గుర్తింపు తెచ్చింది" అని ఆమె తెలిపారు. ప్రస్తుతం రోజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో క్షణాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











