ఇంద్ర భవనాన్ని తలపిస్తోన్న రోజా ఇల్లు.. మొదటిసారి హోమ్ టూర్.. చూస్తే మతిపోవాల్సిందే!
నటిగా తెలుగు చిత్రపరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్న రోజా సెల్వమణి ఆ తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతే కాకుండా బుల్లితెరపై కూడా ఆమె పలు రియాలిటీ షోలతో కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ చూసే విధంగా పలు మంచి ప్రోగ్రాంలు చేస్తున్నారు. ఇక నటిగా రాజకీయ నాయకురాలిగా నిత్యం బిజీగా ఉంటున్న రోజా ఇటీవల మొదటిసారి తన హోమ్ టూర్ ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

నటిగా మంచి క్రేజ్
రోజా సెల్వమని హీరోయిన్ దాదాపు అన్ని రకాల పాత్రలలో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. కేవలం లవ్ స్టొరీ కమర్షియల్ మాస్ సినిమాలను మాత్రమే కాకుండా సోషల్ డ్రామా వంటి సినిమాలలో కూడా మేయిన్ లీడ్ లో నటించింది. పలు విప్లవాత్మక సినిమాల్లో కూడా రోజా చేసిన పాత్రలకు మంచి రోజా మంచి క్రేజ్ అందుకున్నారు. ఆమె తనలోని సరికొత్త నటిని ఎప్పటికప్పుడు బయట పెడుతూనే వచ్చారు.

దర్శకుడితో పెళ్లి
ఇక నటిగా మంచి అవకాశాలు వస్తున్న సమయంలోనే రోజా రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు. ఐదు పదుల వయసు దగ్గరపడుతున్న కూడా ఇంకా ఆమె అందంతో కూడా ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంటున్నారు. ఇక 2002 లో దర్శకుడిగా కొనసాగుతున్న రోజా సెల్వమణీని పెళ్లి చేసుకుంది. ఆ తరువాత ఆమె తొలిసారిగా తెలుగు దేశం పార్టీలో కొనసాగిన విషయం తెలిసిందే.

రియాలిటీ షోలతో..
ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజా ప్రస్తుతం నగరి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేవలం హీరోయిన్ గానే కాకుండా రాజకీయ నాయకురాలిగా కూడా రోజా నిత్యం బిజిగానే కనిపిస్తూ ఉంటారు. అలాగే జబర్దస్త్ వంటి కామెడీ షోలో ఆమె జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. నాగబాబు తప్పుకునప్పటికి కూడా ఆమె మొదటి నుంచి కూడా ఆ షోకు దూరంగా ఉండకుండా

మొదటిసారిగా హోమ్ టూర్
అయితే ఇటీవల మొదటిసారి రోజా ఇంటికి సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రోజుల్లో చాలామంది నటీనటులు ప్రత్యేకంగా హోమ్ టూర్ వీడియోలను చేస్తూ సొంతంగా యూ ట్యూబ్ ఛానెల్స్ లో పోస్ట్ చేస్తున్నారు. అయితే రోజా మాత్రం ఒక ప్రముఖ టీవీ చానెల్ నిర్వహించిన ప్రోగ్రాంలో తన హోమ్ టూర్ తో ప్రేక్షకులకు ఆకట్టుకున్నారు.
Recommended Video

ఇంద్రబావనాన్ని తలపించేలా..
తిరుపతి నగరి లో ఉన్నటువంటి రోజా ఇల్లు ఇంద్రబావనాన్ని తలపించేలా ఉంది. ఇంట్లోకి రాగానే వెంకటేశ్వర స్వామి ఫొటోతో స్వాగతం పలికిన ఆమె అనంతరం తన ఇంట్లో ఉన్న పూజ గది, బెడ్ రూమ్స్ కూడా చూపించారు. ఇక రోజాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రోజా కూతురు పేరు అన్షు మాలిక, కొడుకు పేరు కృష్ణ లోహిత్. అన్షు మాలిక చదువులో మంచి టాలెంటెట్. అంతే కాకుండా అన్షు కొంత పేద విద్యార్థులను కూడా చదివిస్తోంది. రెగ్యులర్ గా అన్షు కూడా సామాజిక సేవలలో పాల్గొంటూ తల్లికి తగ్గ తనయ అనిపించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











