స్టార్ హీరో ఇంటి కోడలిగా.. కూతురు పెళ్లిపై రోజా క్లారిటీ
రోజా సెల్వమణి (Roja Selvamani) అంటే కేవలం ఒక పేరు మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేకమైన బ్రాండ్. నటిగా సినీ రంగంలో గుర్తింపు తెచ్చుకున్న ఆమె, తర్వాత రాజకీయాల్లోనూ తన ముద్ర వేసుకున్నారు. అంతేకాదు టీవీ షోలలో జడ్జిగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇలా రీల్ లైఫ్ మాత్రమే కాదు, రియల్ లైఫ్‌లోనూ నటిగా, రాజకీయ నాయకురాలిగా, జడ్జిగా అనేక పాత్రల్లో తనదైన గుర్తింపు పొందిన మల్టీ టాలెంటెడ్ వ్యక్తిత్వం రోజాది. గతంలో ఓ ఇంటర్వ్యూలో రోజా తన కూతురు అన్షు మాలిక (Anshu Malika) పెళ్లిపై వచ్చిన రూమర్లపై క్లారిటీ ఇచ్చారు. ఇటీవల మళ్లీ ఆ ఇంటర్వ్యూ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఏమన్నారంటే?
కూతురు పెళ్లిపై రోజా స్పందన
ఓ ఇంటర్వ్యూలో నటి రోజా మాట్లాడుతూ.. ముఖ్యంగా ఆమె కూతురు ఓ స్టార్ హీరో ఇంటి కోడలు కాబోతుందనే ప్రచారం, అలాగే సినీ ఎంట్రీ ఇవ్వబోతుందన్న వార్తలపై రోజా అప్పుడే స్పందించారు. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ రోజా నవ్వుతూ మాట్లాడారు. తన కూతురు పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టంగా చెప్పారు. 'నా కూతురు ఓ స్టార్ హీరో ఇంటి కోడలు కాబోతుందట అని అంటున్నారు... ఆ స్టార్ హీరో ఎవరో నాకు కూడా చెప్పండి' అంటూ సరదాగా స్పందించారు. అలాంటి ప్రపోజల్స్ గురించి తాను ఇప్పటివరకు వినలేదని కూడా వెల్లడించారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్త నిజం కాదని రోజా అప్పుడే పేర్కొన్నారు.

అన్షు మాలిక సినీ ఎంట్రీపై క్లారిటీ
ఇంటర్వ్యూలో మరో ముఖ్యమైన విషయం అన్షు మాలిక సినీ ఎంట్రీ గురించి. ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. ఈ విషయంపై రోజా మాట్లాడుతూ, 'అది కూడా కేవలం రూమర్ మాత్రమే. నా కూతురు ప్రస్తుతం చదువుల మీదే దృష్టి పెట్టింది'అని చెప్పారు. అన్షు మాలిక విదేశాలకు వెళ్లింది యాక్టింగ్ కోసమో, డ్యాన్స్ ట్రైనింగ్ కోసమో కాదని రోజా వివరించారు. నిజానికి ఆమె ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిందని తెలిపారు. ఆమె లక్ష్యం సైంటిస్ట్ కావడమేనని, చదువులపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తోందని వెల్లడించారు.
చదువుల్లో ముందున్న అన్షు
రోజా చెప్పిన వివరాల ప్రకారం అన్షు చదువుల్లో చాలా ప్రతిభ చూపుతోందట. స్కూల్ నుంచి కాలేజ్ వరకు అనేక మెడల్స్, అవార్డులు సాధించిందని ఆమె గర్వంగా చెప్పారు.అంతేకాకుండా ఇటాలియన్ భాషను కూడా నేర్చుకుందని తెలిపారు. చదువులతో పాటు అన్షు సోషల్ యాక్టివిటీస్‌లో కూడా చురుగ్గా పాల్గొంటోందని రోజా వెల్లడించారు. ముఖ్యంగా పేద పిల్లల చదువులకు సహాయం చేయడం వంటి సేవా కార్యక్రమాల్లో కూడా ఆమె ఆసక్తి చూపుతోందని చెప్పారు. తన పిల్లల విషయంలో ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని రోజా పేర్కొన్నారు. 'పిల్లలపై మన కోరికలను రుద్దడం నాకు ఇష్టం లేదు. వాళ్లకు ఏం నచ్చుతుందో అది వాళ్లే నిర్ణయించుకోవాలి. మనం గైడెన్స్‌గా ఉంటే చాలు' అని ఆమె అన్నారు.
అన్షు తనకంటే చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తుందని రోజా తెలిపారు. మంచి మనసుతో ఇతరులకు సహాయం చేయడం ఆమె స్వభావమని కూడా చెప్పారు. అయితే భవిష్యత్తులో తన కూతురు యాక్టింగ్ ఫీల్డ్‌లోకి రావాలని అనుకుంటే తాను ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తానని రోజా అన్నారు. 'యాక్టింగ్ అనేది ఒక వరం. అది అందరికీ దొరకదు. ఆమెకు నిజంగా ఆ ఆసక్తి ఉంటే నేను సపోర్ట్ చేస్తాను' అని చెప్పారు. మొత్తానికి అన్షు మాలిక సినీ ఎంట్రీ, స్టార్ హీరో ఇంటి కోడలు అవుతుందన్న వార్తలు అన్నీ కేవలం ఊహాగానాలేనని రోజా అప్పుడే స్పష్టంగా చెప్పారు. అన్షు మాలికపై వస్తున్న గాసిప్స్‌కు మరోసారి ఫుల్ స్టాప్ పడినట్లైంది.


Click it and Unblock the Notifications











