బికినీలో దర్శనం ఇచ్చిన రొమాంటిక్ బ్యూటీ.. నెవర్ బిఫోర్ అందాల ఆరబోత
సినిమాల్లో నటించాలని అందరికీ ఉన్నా అది అందరికీ సాధ్యం కాదు. ఎవరైనా సరే అందంతో పాటు అభినయం కూడా తోడైనప్పుడే వాళ్ళకి కెరీర్ లో మంచి అవకాశాలు వస్తాయి. అలా హీరోయిన్ అవ్వాలని వచ్చి ప్రస్తుతం వర్ధమాన నటిగా సత్తా చాటుతున్న దేవియాని శర్మ తాజాగా బికినీలో కనిపించి షాకిచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఢిల్లీలో పుట్టి పెరిగి
దేవియాని శర్మ వయస్సు 28 సంవత్సరాలు కాగా ఆమె న్యూ ఢిల్లీలో జన్మించారు. ఇప్పటి వరకు దేవియాని శర్మ టాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేశారు. ఆమె చేసిన తెలుగు భాషా సినిమాలు అలాగే కొన్ని వెబ్ సిరీస్‌లలో విడుదలయ్యాయి. ఆమె నటనా కెరీర్ కోసం ఆమె కుటుంబం ఇప్పుడు హైదరాబాద్‌లో నివసిస్తోంది. ఆమె తల్లి పేరు నీనా శర్మ కాగా ఆమె తండ్రి పేరు సునీల్ శర్మ.

సినిమాల కోసం హైదరాబాద్
ఆమెకు సోనమ్ శర్మ అనే సోదరి కూడా ఉంది. ఆమె కాలేజ్ ఆఫ్ ఢిల్లీలో తన చదువు పూర్తి చేసింది. దేవియాని శర్మ నటన మీద ఆసక్తితో సినిమాలలో ప్రయత్నిస్తూ తెలుగులో అనగనగా, వై, తాజాగా వచ్చిన రొమాంటిక్ సినిమాలో నటించింది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా కొత్త హీరోయిన్ కేతిక శర్మ హీరోయిన్‌గా నటించిన మూవీ 'రొమాంటిక్'. సరికొత్త కాన్సెప్ట్‌తో లవ్ స్టోరీ నేపథ్యంలో 'రొమాంటిక్' సినిమాను తెరకెక్కించారు.

అంచనాలను మించి
ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమాను ఈ మధ్య ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కూడా మొదలయింది. ఈ సినిమా అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. రొమాంటిక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అంచనాలను మించి పోయి ఊహించని రేంజ్‌లో కలెక్షన్స్‌ని సొంతం చేసుకుంది. ఈ సినిమా పోటికి మరో సినిమా కూడా విడుదలైనప్పటికి.. మరో వైపు ఈ సినిమాకి మిక్స్‌డ్ గా టాక్ వచ్చినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది.

బాక్సాఫీస్ వద్ద
ఈ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో 1.5 కోట్ల మార్క్ ని సొంతం చేసుకున్న ఈ రొమాంటిక్ సినిమా ముఖ్యంగా యూత్ అలాగే మాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. మొత్తంగా రూ. 4.6 కోట్ల థియేట్రిక్ బిజినెస్ చేసిన ఈ సినిమా రూ. 4.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా బరిలో దిగింది. కానీ సినిమా ఓవరాల్‌గా రూ. 4.2 కోట్ల వరకు వసూళ్లు సాధించి బాక్సాఫీస్ దగ్గర అబౌ యావరేజిగా నిలిచింది. రొమాంటిక్.. సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ పాదూరి దర్శకత్వం వహించగా డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో వస్తున్న ఓ ప్రేమ కథగా తెరకెక్కింది.
Recommended Video
హాట్ షూట్స్
ఈ సినిమాలోనే దేవియానీ కీలక పాత్రలో నటించింది..ఆకాష్ పూరి స్నేహితురాలి పాత్రలో నటించిన ఆమె హీరోయిన్ తో పోటీగా నటించింది. అయితే సినిమాల్లో ఎలా అయినా మంచి అవకాశాలు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న ఈ భామ ఇప్పుడు హాట్ ఫోటో షూట్స్ కు తెర లేపింది. తాజాగా ఆమె షేర్ చేసిన బికినీ ఫోటో సహా పలు ఫోటోలు కాక రేపుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











