Ketika Sharma: అందచందాలతో హీటెక్కిస్తున్న రొమాంటిక్ బ్యూటీ..
అభినయంతో ఎంత ఆకట్టుకున్న మాస్ ఆడియెన్స్‌కు మాత్రం హీరోయిన్ గ్లామర్ తమ అందం ఒలకబోస్తేనే ఆరాధిస్తారు. సాంగ్స్‌లో మాత్రమే కాకుండా అవకాశం ఉన్న ప్రతి సీన్లో రొమాంటిక్ లుక్స్‌తో కట్టిపడేసే హీరోయిన్స్ క్రేజ్ ఇక మాములుగా ఉండదు. అలాగే గ్లామర్ ఎంత చూపించినా, ఎన్ని సినిమాలు చేసిన కొంతమంది కథానాయికలకు సరైనా గుర్తింపు ఉండదు. అలాంటి హీరోయిన్స్ టాలీవుడ్లో ఎంతోమంది ఉన్నారు. అయితే కొంతమందికి మాత్రం తొలి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ వస్తుంది. అలాంటి హీరోయిన్స్‌లలో రొమాంటిక్ బ్యూటి కేతిక శర్మ ఒకరు. అప్పుడప్పుడు తన అందచందాలను సోషల్ మీడియా వేదికగా ప్రదర్శించే కేతిక శర్మ న్యూ పిక్స్ చూసేద్దామా.

రొమాంటిక్ హీరోయిన్గా
డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన చిత్రం రొమాంటిక్. ఈ మూవీలో హీరోయిన్గా నటించి రొమాంటిక్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది కేతిక శర్మ. అక్టోబర్ 29, 2021లో విడుదలైన ఈ చిత్రానికి అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు.

గ్లామర్‌తో అట్రాక్ట్..
మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన రొమాంటిక్ చిత్రం పర్వాలేదనిపించుకున్న తన గ్లామర్‌తో మాత్రం యూత్‌ను చాలానే అట్రాక్ట్ చేసింది కేతిక శర్మ. సాంగ్స్, సీన్స్‌లలో రొమాంటిక్‌గా నటించి కేక పుట్టించింది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

ఫ్లాప్ అయిన తగ్గని క్రేజ్..
అనంతరం నాగ శౌర్య హీరోగా నటించిన లక్ష్య సినిమాలో యాక్ట్ చేసింది కేతిక శర్మ. ఈ సినిమా అంతగా విజయం అందుకోలేకపోయింది. అయినా కేతిక శర్మకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఈ సినిమా తర్వాత వెంటనే మరో మూవీ ఛాన్స్ కొట్టేసింది ఈ నార్త్ బ్యూటీ.

రంగ రంగ వైభవంగా అంటూ..
తొలి చిత్రం ఉప్పెనతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు వైష్ణవ్ తేజ్. అతను నటించిన తాజా చిత్రం రంగ రంగ వైభవంగా. ఈ సినిమాలో హీరోయిన్గా కేతిక శర్మ నటిస్తుందనేది తెలిసిన విషయమే. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి.

డైలాగ్‌లు మంచి స్పందన..
అంతేకాకుండా ఈ సినిమాలో కేతిక శర్మతో ముద్దు సీన్లతో పాటు ఆడియెన్స్ మెచ్చే రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రంగ రంగ వైభవంగా టీజర్లో కేతిక శర్మ చెప్పే డైలాగ్‌లకు మంచి స్పందన లభించింది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పక్కన హీరోయిన్గా!..
అలాగే ప్రస్తుతం ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించే అవకాశం కొట్టేసినట్లు సమాచారం. వినోదయ సిత్రం తెలుగు రీమేక్ చిత్రంలో కేతికకు హీరోయిన్గా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నాడట.

మోడల్‌గా, సింగర్‌గా..
ఇక డిసెంబర్ 24, 1995లో న్యూ ఢిల్లీలో జన్మించిన కేతిక శర్మ.. మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. తర్వాత యూట్యూబర్‌గా, సింగర్‌గా, డబ్‌స్మాష్‌లతో పాపులర్ అయింది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కేతికకు 2.2 మిలియన్స్ ఇన్‌స్టా గ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు.

థగ్ లైఫ్ వీడియోతో పాపులర్
2016లో థగ్ లైఫ్ అనే వీడియోతో పాపులర్ అయిన రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ ఎప్పుడు తన అందచందాలతో సోషల్ మీడియాలో పిచ్చెక్కిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా పెట్టిన ఫొటోలు ఆకర్షిస్తున్నాయి. మత్తైన చూపులతో కైపుగా చూస్తూ నిజంగా తాను రొమాంటిక్ హీరోయిన్ అని ప్రూవ్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











