twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్నడూ చూడని విధంగా కేతిక శర్మ బోల్డ్ షో.. అలాంటి పోజులతో బర్త్ డే?

    |

    తెలుగులోకి ఎంతో మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే.. మొదటి చిత్రంతోనే కుర్రాళ్ల దృష్టిలో పడి క్రష్‌లుగా మారిపోతోన్నారు. అలాంటి వారిలో రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ ఒకరు. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమాతో తెలుగులో పరిచయం అయిన ఈ బ్యూటి.. హాట్ భామగా యూత్ లో క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో ఇప్పటికే పలు చిత్రాల్లో నటించిన ఈ భామ.. ఒక్క హిట్‌ను కూడా ఖాతాలో వేసుకోలేదు. కానీ సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో సూపర్ హిట్స్ అందుకుంటోంది.

    మారుమోగిపోయిన కేతిక పేరు..

    మారుమోగిపోయిన కేతిక పేరు..

    మోడలింగ్ రంగంలో తనదైన అందచందాలతో సందడి చేస్తూ కేతిక శర్మ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. మోడలింగ్ లో రాణించిన కేతిక శర్మ అనేక బ్రాండ్లకు ప్రచారకర్తగానూ చేసింది. ఇక 2016 సంవత్సరంలో 'థగ్ లవ్' అనే యూట్యూబ్ వీడియోలో ముందుగా దర్శనమిచ్చింది ఈ బ్యూటి. ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ రావడంతో కేతిక పేరు మారుమోగిపోయింది. ఫలితంగా కేతిక సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్‌తో సెన్సేషన్‌గా మారింది.

    రొమాంటిక్ సినిమాతో..

    రొమాంటిక్ సినిమాతో..

    సోషల్ మీడియా ద్వారా దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన ఢిల్లీ బ్యూటి కేతిక శర్మకు సినిమా అవకాశాలు వరుసగా వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే డ్యాషింగ్​ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్​ పూరి హీరోగా నటించిన చిత్రం రొమాంటిక్ సినిమాతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అక్టోబర్​ 29, 2021లో విడుదలైన ఈ చిత్రానికి అనిల్​ పాదూరి దర్శకత్వం వహించారు. అయితే, ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడకున్నా కేతికకు మాత్రం మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే, ఆమె క్రష్‌గా మారిపోయింది.

    సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా..

    సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా..

    రొమాంటిక్ సినిమా ఫ్లాప్ అయిన కూడా, దాని ఫలితంతో ఏమాత్రం సంబంధం లేకుండా కేతిక శర్మకు టాలీవుడ్‌లో అవకాశాలు వచ్చాయి. తన రెండో చిత్రంగా ఈ బ్యూటీ నాగశౌర్య హీరోగా నటించిన 'లక్ష్య'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఇది కూడా సక్సెస్ సాధించలేదు. ఇక, ఇటీవల వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'రంగరంగ వైభవంగా' సినిమాలోనూ ఆకట్టుకుంది కేతిక శర్మ. చేసింది. ఇది కూడా నిరాశనే మిగిల్చింది. వైష్ణవ్ తేజ్ తో కలిసి రొమాంటిక్ సీన్లలో అదరగొట్టిన కేతికకు ఈ సినిమా కూడా అంతగా కలిసి రాలేదు.

    అందని ద్రాక్షగా విజయం..

    అందని ద్రాక్షగా విజయం..

    కేతిక శర్మ తెలుగులో పలు చిత్రాల్లో నటించినా.. ఆమెకు ఏ సినిమా అంత విజయాన్ని తీసుకురాలేకపోయింది. దీంతో కేతికకు సక్సెస్ అందని ద్రాక్షలానే మారిపోయింది. అయినప్పటికీ టాలీవుడ్‌లో అవకాశాలు మాత్రం ఈ చిన్నదాన్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. దీంతో ఇప్పుడు కూడా కేతిక పలు చిత్రాలకు సైన్ చేసేసింది. అలాగే, దక్షిణాది భాషలకు చెందిన దర్శక నిర్మాతలు సైతం ఈ ఢిల్లీ బ్యూటీ డేట్స్ కోసం పోటీ పడుతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడో సెన్సేషన్ అయిన కేతిక శర్మ.. ఈ మధ్య కాలంలో మరింత యాక్టివ్‌ అయిపోయింది.

    బోల్డ్ ఫొటోలతో..

    బోల్డ్ ఫొటోలతో..

    సోషల్ మీడియాలో కేతిక శర్మ చేసే హడావిడి గురించి అందరికీ తెలిసిందే. కొంత కాలంగా అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది ఈ హాట్ బ్యూటి. ఈ క్రమంలోనే తరచూ తన బోల్డ్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో ఎక్కువగా క్లీవేజ్ షో చేసేవే ఉంటున్నాయి. తద్వారా ఈ చిన్నదాని పేరు మారుమోగిపోతోంది. రొమాంటిక్ బ్యూటీకి కరెక్ట్ గా సరిపోయేలా ఉంటున్నాయి కేతిక శర్మ ఫొటోలు.

    వయ్యారంగా పోజులిస్తూ..

    వయ్యారంగా పోజులిస్తూ..

    కేతిక శర్మ తాజాగా మరోసారి హాట్ ఫొటోలను వదిలింది. ఈ ఫొటోల్లో వయ్యారంగా పోజులిచ్చిన కేతిక శర్మ తన నాభి అందాలను అడ్డులేకుండా ఆరబోసింది. విభిన్నైన పోజుల్లో తన నాభి అందాలతో యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది. అలాగే ఇందులో తను చూసే చూపులు మత్తెక్కించేలా ఉన్నాయి. ఈ ఫొటోలకు 'హల్లో బర్త్ డే మంత్' అని క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. అంటే ఈ డ్రెస్ లో బర్త్ డే మంత్ ను ఆహ్వానించిందన్నమాట. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    చదువు పూర్తికాగానే..

    చదువు పూర్తికాగానే..

    రొమాంటిక్ సినిమాతో రొమాంటిక్ బ్యూటిగా పేరు తెచ్చుకున్న కేతిక శర్మ 1995 డిసెబంర్ 25న ఢిల్లీలో జన్మించింది. ఆమె లక్నౌలోని మార్టినీర్స్ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేయగా.. ఢిల్లీ యూనివర్శిటీ నుంచి డిగ్రీ కంప్లీట్ చేసింది. చదువు పూర్తి కాగానే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన కేతిక శర్మ నటిగా, గాయనీగా, యూట్యూబర్ గా పేరు ప్రఖ్యాతలు పొందింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో మరింత పాపులర్ అవుతోంది.

    English summary
    Romantic Movie Heroine Ketika Sharma Shares Latest Hot Photos In White And Green Dress. Ketika Sharma Showing Waist Pics Goes Viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X