RRR : సినిమాను ముందుకు నడిపించిన మల్లి ఎవరో తెలుసా? బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా!
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చి అద్భుతమైన విజయం అందుకున్న తరువాత విడుదలైన తాజా చిత్రం RRR. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలు కలిసి నటించిన ఈ సినిమా కోసం అభిమానులు నాలుగేళ్లకు పైగా వెయిట్ చేశారు. వాళ్ళ కోరికలు ఫలించేలా మార్చ్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అనుకున్నట్టే మొదటి రోజు వసూళ్లతో రికార్డులు బద్దలు కొట్టింది. రోజు రోజుకు వసూళ్లతో అనేక రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు వెళుతోంది. ఇక ఈ సినిమా కథకు కీలకమైన మల్లి పాత్రలో ఒక చిన్నారి నటించింది. ఆమె చుట్టే RRR కథ అంతా నడుస్తోంది. ఇక ఈ సినిమాలో గోండు పిల్ల మల్లి పాత్రలో నటించిన ఈ అమ్మాయి ఎవరనే విషయం మీద అందరూ వెతుకుతున్నారు. అసలు ఆమె ఎవరు? అనే విషయం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
Recommended Video


ఈ సినిమా గురించే
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన RRR అనే విజువల్ వండర్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ.. భారీ వసూళ్లను సాధిస్తోంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు అని చెప్పక తప్పదు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు తమ పెర్ఫార్మన్స్ తో ఫ్యాన్స్ అందరినీ ఆకట్టుకున్నారు.

మల్లి నటన
వీరిద్దరితో పాటు సినిమాలో చాలా పాత్రలకు మంచి ఆదరణ లభిస్తోండగా అలాంటి వాటిలో చిన్నారి మల్లి పాత్ర కూడా ఒకటి. నిజానికి అసలు RRR సినిమా కథ ఈ మల్లిని బ్రిటిష్ వారు తీసుకు వెళ్లడం నుంచే మొదలవుతుంది. కనిపించింది కొన్ని సీన్లే అయినా కథను ముందుకు నడిపించే కీలక పాత్రలో మల్లి నటన మెప్పిస్తుంది. ఈ క్రమంలో అసలు ఆ చిన్నారి ఎవరు..? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని నెటిజన్లు వెతుకుతున్నారు.

అనేక టీవీ రియాలిటీ షోలలో
అయితే మల్లి పాత్ర పోషించిన ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు ట్వింకిల్ శర్మ. ఆమెది చంఢీగడ్. డాన్స్ ఇండియా డాన్స్ రియాలిటీ షోతో ట్వింకిల్ శర్మ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఇండియాస్ బెస్ట్ డ్రామా బాజ్‌లో చివరి 8 మంది కంటెస్టెంట్స్‌లో ఒకరుగా ట్వింకిల్ శర్మ నిలిచింది. ఆ తరువాత అనేక టీవీ రియాలిటీ షోలలో పార్టిసిపేట్ చేసింది.

మంచి గుర్తింపు
అంతేకాదు ఫ్లిప్ కార్డ్ వంటి యాడ్‌లో కూడా నటించింది. సినిమా మొదలైనపుడు ఆమె 8వ తరగతి చదువుతూ ఉంది కానీ ఇపుడు ఇంటర్మీడియట్‌కు వచ్చినటట్టు చెబుతున్నారు. కనిపించింది తక్కువ సేపే అయినా మల్లి పాత్రలో నటించిన ట్వింకిల్ శర్మకు మంచి గుర్తింపు లభించింది.

ఇంపాక్ట్ క్రియేట్ చేసే
సినిమా ఓపెనింగ్ లో ఆమె తెల్లదొరసానికి పచ్చబొట్టు పొడుస్తూ పాడే పాట, 'నన్ను ఈడ ఇడిసిపోకన్నా..అమ్మ యాదికి వస్తుంది' అంటూ కోటలోకి వచ్చిన ఎన్టీఆర్ ని ఆమె అర్ధించే డైలాగ్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. సినిమాలో మల్లి రోల్ కనిపించేది కొంత సేపే అయినప్పటికీ.. ఉన్నంతలో తన నటనతో ఇంపాక్ట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసిందని చెప్పక తప్పదు.


Click it and Unblock the Notifications











