RRR ఎఫెక్ట్ భారీగానే పడిందిగా.. ఎన్టీఆర్ హీరోయిన్‌ ఇది అస్సలు ఊహించి ఉండదు.!

By Manoj

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో ఎస్ఎస్ రాజమౌళి టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో తెలుగు వాళ్లకు మాత్రమే పరిచయం అయిన ఆయన.. 'బాహుబలి' సిరీస్ తర్వాత దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. ఈ సినిమాలు ఎంతటి విజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలకు మన దేశంతో పాటు ప్రపంచంలో చాలా దేశాల్లో మంచి స్పందన వచ్చింది. భారీ హిట్‌ల తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రమే 'RRR'. ఇద్దరు బడా హీరోలు కలిసి చేస్తున్న ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే క్రేజ్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో RRR ఎఫెక్ట్‌ను నిరూపించే ఓ పరిణామం చోటు చేసుకుంది. ఇంతకీ ఏంటా పరిణామం.? వివరాల్లోకి వెళితే..

వాళ్లిద్దరినీ కలిపిన ఘనత జక్కన్నదే

వాళ్లిద్దరినీ కలిపిన ఘనత జక్కన్నదే

రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR‌లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌లోనే రెండు పేరొందిన కుటుంబాలకు చెందిన ఈ హీరోలను కలిపిన ఘనత జక్కన్నకే దక్కింది. ఇందులో చరణ్.. అల్లూరిగా, తారక్.. కొమరం భీంగా నటిస్తున్న విషయం తెలిసిందే. వీళ్లకు జోడీగా ఆలియా భట్, ఒలీవియా మోరిస్ ఆడి పాడనున్నారు.

RRRలో ప్రస్తుతం జరుగుతున్నదిదే

RRRలో ప్రస్తుతం జరుగుతున్నదిదే

RRR షూటింగ్ ప్రారంభమై దాదాపు ఏడాది పైగానే అయిపోయింది. అయినప్పటి ఎన్నో అవాంతరాల నడుమ ఈ సినిమా షూటింగ్ డెబ్బై శాతం పూర్తయింది. మిగిలిన భాగంలో ఇంటర్వెల్ బ్యాంగ్‌తో పాటు, క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరించాల్సి ఉందని తెలుస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం చిత్ర యూనిట్ విశాఖపట్నంలోని మన్యంలో షూటింగ్ జరుపుకుంటోంది.

వాళ్లు ఎంటరయ్యాక ఊపందుకుంది

వాళ్లు ఎంటరయ్యాక ఊపందుకుంది

ఈ సినిమా రెగ్యూలర్ షూట్ ప్రారంభమైన చాలా రోజులకు గానూ జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ విషయంలో క్లారిటీ రాలేదు. ఈ పాత్రకు లండన్‌కు చెందిన థియేటర్ ఆర్టిస్టు ఒలీవియా మోరిస్‌ను తీసుకున్నారు. ఆమెతో పాటు హాలీవుడ్ యాక్టర్లు రే స్టీవెన్‌సన్, అలీసన్ డాడీలు కీలక పాత్రలు చేస్తున్నారు. వీళ్ల ఎంపిక తర్వాత షూటింగ్ వేగవంతం అయింది.

ఎన్టీఆర్ హీరోయిన్‌ ఇది అస్సలు ఊహించి ఉండదు.!

ఎన్టీఆర్ హీరోయిన్‌ ఇది అస్సలు ఊహించి ఉండదు.!

ఎన్టీఆర్ హీరోయిన్‌గా ఎంపికై ఒలీవియా మోరిస్ గురించి గూగుల్‌లో ఎంతో మంది వెతికిన విషయం తెలిసిందే. అప్పుడు ఈమె పేరు ట్రెండ్ కూడా అయింది. ఇక, ట్విట్టర్‌లో కూడా ఈమెకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. RRRకు ఎంపిక కాకముందు కేవలం 400 మంది ఫాలోవర్స్ ఉంటే.. ఆ సంఖ్య ఇప్పుడు 22 వేలకు దాటిపోయింది. దీన్ని ఆమె కూడా అస్సలు ఊహించి ఉండదు.

RRR ఎఫెక్ట్ భారీగానే పడిందిగా

ఒలీవియా మోరిస్‌కు ఇంత భారీ సంఖ్యలో ఫాలోవర్స్ పెరిగిపోవడం వెనుక RRR ఎఫెక్ట్ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె 2010 ఆగస్టులో ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసినా.. ఇప్పుడే ఫాలోవర్స్ గణనీయంగా పెరిగిపోతున్నారు. ఇటీవల ఆమె RRR అకౌంట్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేయడం కూడా బాగా ప్లస్ అయిందన్న టాక్ వినిపిస్తోంది.

ఒలీవియాకే ఎక్కువ ప్రాధాన్యం

ఒలీవియాకే ఎక్కువ ప్రాధాన్యం

ఇక, ఈ సినిమాలో ఒలీవియా పాత్ర విషయానికొస్తే.. ఇందులో మరో హీరోయిన్ ఆలియా భట్ కంటే ఆమెకే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నదని తెలుస్తోంది. అల్లూరి సీతారామరాజు ప్రేయసి కంటే ఈ పాత్ర గురించి తెలుగు వాళ్లకు తెలియదు కాబట్టే.. ఆమెను ఎక్కువగా చూపించాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X