RRRలో హీరోయిన్‌ నేపథ్యం ఇదే.. ఒలీవియా మోరిస్‌ను రాజమౌళి ఎందుకు తీసుకొన్నారంటే

By Manoj

దర్శకధీరుడు రాజమౌళి - జూనియర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'RRR'. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జరుగుతోంది. భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కావడంతో పాటు క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా అవడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. త్వరత్వరగా షూటింగ్ పూర్తి చేసి ఈ సినిమాను 2020 జూలై 30న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. తాజాగా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ విషయంలో క్లారిటీ వచ్చేసింది.

మొదటి నుంచీ అవాంతరాలే

మొదటి నుంచీ అవాంతరాలే

ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. ఇందులో నటిస్తున్న హీరోలు రామ్ చరణ్, తారక్ ఒకరి తర్వాత ఒకరు గాయపడడం, రాజమౌళి తన వ్యక్తిగత విషయాల కోసం విశ్రాంతి తీసుకోవడం, తర్వాత హీరోయిన్‌ ఆలియాకు అనారోగ్యం వంటి వాటితో షూటింగ్‌కు బ్రేక్ పడుతూ వస్తోంది. అలాగే, మిగిలిన నటుల డేట్స్ సర్ధుబాటు కాకపోవడం వల్ల కూడా ఇదే పరిస్థితి తలెత్తింది.

తారక్ హీరోయిన్ విషయంలో..

తారక్ హీరోయిన్ విషయంలో..

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా.. తారక్‌కు జంటగా నటించే హీరోయిన్ గురించి క్లారిటీ రావడం లేదు. మొదట తారక్‌కు జోడీగా హాలీవుడ్ అమ్మాయి డైసీ ఎడ్గార్ జోన్స్ నటిస్తుందని చిత్ర యూనిట్ మొదట్లో ప్రకటించింది. అయితే, ఆమె సినిమా నుంచి అర్థాంతరంగా తప్పుకుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే.

తర్వాత ఎంతో మంది పేర్లు

తర్వాత ఎంతో మంది పేర్లు

ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ విషయంలో ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. ఇందులో అతడికి జంటగా నిత్యామీనన్ నటిస్తుందని అన్నారు. ఆ తర్వాత చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. కొద్ది రోజుల క్రితం హాలీవుడ్ నటి ఎమ్మా రాబర్ట్స్‌ను తీసుకుంటున్నారని ప్రచారం జరిగింది. ‘వైల్డ్ లైఫ్', ‘నెర్వ్', ‘వలంటైన్స్ డే', ‘అడల్ట్ వరల్డ్' సహా ఎన్నో సినిమాల్లో నటించిన ఈమెతో రాజమౌళి సంప్రదింపులు జరిపారని వార్తలు కూడా వచ్చాయి.

ఆమె ఒప్పుకోలేదట

ఆమె ఒప్పుకోలేదట

ఎమ్మా రాబర్ట్స్.. తారక్ సరసన నటిస్తుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ దీనిపై చిత్ర యూనిట్ మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే, ఆ సమయంలోనే దీనికి సంబంధించిన మరో విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో చేయడానికి ఎమ్మా రాబర్ట్స్ ఒప్పుకోలేదనేదే దాని సారాంశం. ఈ పాత్ర చేయడం కోసం ఎక్కువ రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుందట. అన్ని రోజులు తేదీలు ఇవ్వలేకే ఎమ్మా రాబర్ట్స్‌ తప్పుకున్నట్లు గుసగుసలు వినిపించాయి.

ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది

ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ పేరును వెల్లడిస్తామని మంగళవారం చిత్ర యూనిట్ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఒలీవియా మోరిస్ అనే నటిని ఎన్టీఆర్ సరసన నటించే జెన్నీఫర్‌గా పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా పరిచయం చేసింది. దీంతో ఈమె ఎవరు అని తెలుగు ప్రేక్షకులు గూగుల్‌లో వెతకడం ప్రారంభించేశారు.

Recommended Video

#Cinebox : #KRKRTrailer2 Released | Chiranjeevi - Manisharma To Team Up Again

హీరోయిన్ నేపథ్యం ఇదే

ఒలీవియా మోరిస్‌ లండన్‌కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్. అంతేకాదు, కొన్ని టీవీ సిరీస్‌లలో కూడా నటించింది. అక్కడ ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఎమోషన్స్, ఎక్స్‌ప్రెషన్స్ పండించడంలో ఒలివియా దిట్ట అట. దీనికితోడు అందం కూడా కలిగిన నటి కావడంతో తక్కువ వయసులోనే ఎక్కువ పాపులారిటి సంపాదించింది. అందుకే ఈమె రాజమౌళిని విశేషంగా ఆకర్షించిందని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X