రోడ్డెక్కి మరీ బోల్డ్ షో చేసిన 'డర్టీ' భామ.. వేసవిలో మరింత వేడెక్కిస్తూ!
ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ సోషల్ మీడియాలో పరిధి దాటి అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తున్నారు. సినిమాల్లో అవకాశాలు తగ్గాయి అనుకుంటున్న సమయంలో మేము కూడా రేసులో ఉన్నామని చెప్పుకోవడం కోసం అందాలు ఆరబోయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. అందులో భాగంగా మొదట పద్ధతైన పాత్రల ద్వారా తెలుగు వారిని పలకరించిన రహానే శర్మ కూడా రెచ్చిపోయి అందాలు ఆరబోసింది. ఆ వివరాలు..

తమిళ సినిమాతో
హిమాచల్ ప్రదేశ్ లోని సొలాన్ అనే ప్రాంతంలో పుట్టి పెరిగింది రహానే శర్మ. చండీగఢ్ లోని పంజాబ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసిన ఆమె ముందుగా పంజాబీ మ్యూజిక్ వీడియోలలో కనిపించింది. అలా ఆమెను చూసిన ఒక తమిళ డైరెక్టర్ ఆమెకు ఒక సినిమాలో అవకాశం ఇచ్చారు. అలా ఆమె కాదాసీ బెంచి కార్తీ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. అది పెద్దగా వర్కౌట్ కాలేదు.

'చిలసౌ'
దీంతో అక్కినేని హీరో సుశాంత్ - రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్‌లో వచ్చిన 'చిలసౌ' సినిమా ద్వారా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసింది రుహానీ శర్మ. ఈ సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది ఆమె. ఈ సినిమాలో ఆమె నటన చూసి తర్వాత ఆమెకు ఎన్నో అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ, పరిస్థితి తారుమారైంది. 'చిలసౌ' తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, ఆ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది.

బోల్డ్ సినిమాలో కూడా
ఆ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నాక కూడా తెలుగులో ఆమెకు అవకాశాలు దక్కలేదు. దీంతో మలయాళ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమెకు అక్కడ కూడా వర్కౌట్ కాలేదు. చాలా గ్యాప్ తర్వాత ఆమె విశ్వక్ సేన్ హీరోగా నటించిన హిట్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత డర్టీ హరి అనే బోల్డ్ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఇక ఆమె నటించిన నూటొక్క జిల్లాల అందగాడు సినిమా మాత్రం మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ప్రస్తుతానికి ఆమెకు చేతిలో ఒకే తెలుగు సినిమా ఉంది.

హాట్ హాట్‌గా పోజులు
దీంతో రుహానీ శర్మ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తన అభిమానులతో ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను తరచూ అందులో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తన ఫోటోలను, వీడియోలను సైతం షేర్ చేస్తుంది రుహానీ శర్మ. ఇందులో భాగంగానే రుహానీ శర్మ ప్రత్యేకంగా ఫోటో సెషన్‌కు హాట్ హాట్‌గా పోజులు ఇచ్చింది. ఈ ఫొటోలు చూసిన వారంతా షాక్‌కు గురయ్యారు.

రచ్చ మొదలు
వాటిలో ఉన్నది రుహానీ అంటే నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే ఆమె అంత బోల్డ్ ఫోటో షూట్ చేసింది. మరి బ్లాక్ డ్రెస్ వేసుకుని ఉన్న ఫొటోలో క్లీవేజ్ షోతో యువతను, ఫిల్మ్ మేకర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది రుహానీ శర్మ. దీంతో ఈ ఫొటోలకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మరి ఇప్పటికైనా రుహానీ శర్మ లక్కు మారుతుందేమో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











